Salaar TV Premiere: టీవీ ఛానెల్‍లో వచ్చేస్తున్న సలార్ మూవీ.. టీవీ ప్రీమియర్ టీజర్ కూడా వచ్చేసింది.. డేట్, టైమ్ ఇవే-salaar tv premiere date and time prabhas action thriller to telecast on star maa channel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Tv Premiere: టీవీ ఛానెల్‍లో వచ్చేస్తున్న సలార్ మూవీ.. టీవీ ప్రీమియర్ టీజర్ కూడా వచ్చేసింది.. డేట్, టైమ్ ఇవే

Salaar TV Premiere: టీవీ ఛానెల్‍లో వచ్చేస్తున్న సలార్ మూవీ.. టీవీ ప్రీమియర్ టీజర్ కూడా వచ్చేసింది.. డేట్, టైమ్ ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 15, 2024 04:44 PM IST

Salaar TV Premiere: సలార్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీ టెలికాస్ట్ డేట్, టైమ్ అధికారికంగా ఖరారయ్యాయి.

Salaar TV Premiere: టీవీ ఛానెల్‍లో వచ్చేస్తున్న సలార్ మూవీ.. టీవీ ప్రీమియర్ టీజర్ కూడా వచ్చేసింది.. డేట్, టైమ్ ఇవే
Salaar TV Premiere: టీవీ ఛానెల్‍లో వచ్చేస్తున్న సలార్ మూవీ.. టీవీ ప్రీమియర్ టీజర్ కూడా వచ్చేసింది.. డేట్, టైమ్ ఇవే

Salaar TV Premiere: హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్: పార్ట్1 సీజ్‍ఫైర్’ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆ చిత్రం భారీ కలెక్షన్లను దక్కించుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ గతేడాది డిసెంబర్‌లో రిలీజై దుమ్మురేపింది. సలార్ చిత్రానికి ఓటీటీల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు, టీవీ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు సలార్ సినిమా సిద్ధమైంది. ఈ మూవీ టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి.

టెలికాస్ట్ వివరాలివే

సలార్ సినిమా టెలివిజన్ ప్రీమియర్ వివరాలను ప్రముఖ టీవీ ఛానెల్ ‘స్టార్ మా’ అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్ 21వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సలార్ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్టు స్టార్ మా ప్రకటించింది. ఇందుకు సంబంధించి నేడు ఓ ప్రోమో విడుదల చేసింది.

సలార్ టీవీ ప్రీమియర్ తేదీ, టైమ్ అనౌన్స్‌మెంట్ కోసం నేడు ఓ ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా. ప్లీజ్.. కైండ్లీ.. రిక్వెస్ట్ అంటూ ప్రభాస్ డైలాగ్‍తో ఈ ప్రోమోను తీసుకొచ్చింది. ఎపిక్ యాక్షన్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్‌ సలార్ సిద్ధమవ్వాలని, ఈ ఆదివారం (ఏప్రిల్ 21) సాయంత్రం 5:30 గంటలకు ఈ మూవీ టెలికాస్ట్ అవుతుందని స్టార్ మా ట్వీట్ చేసింది. సలార్ చిత్రం టీవీలోనూ మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ సినిమా ఎంత టీఆర్పీ రేటింగ్ సాధిస్తుందో చూడాలి.

సలార్ ఓటీటీలో ఎక్కడ..

సలార్ సినిమా ఈ ఏడాది జనవరిలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. అయితే, సలార్ హిందీ వెర్షన్ మాత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి జనవరి 20నే ఈ చిత్రం వచ్చింది. అయితే, సలార్ హిందీ వెర్షన్ ఫిబ్రవరిలో హాట్‍స్టార్‌లో అందుబాటులో వచ్చింది. ఓటీటీల్లో గ్లోబల్ రేంజ్‍లో సలార్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

సలార్ చిత్రంలో ప్రభాస్‍తో పాటు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, టిన్నూ ఆనంద్, బాబీ సింహా, దేవరాజ్ కీరోల్స్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ మూవీకి సుమారు రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. సలార్ సీక్వెల్ సలార్ పార్ట్ 2 కూడా శౌర్యాంగపర్వం పేరుతో రానుంది.

ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో గ్లోబల్ మూవీ కల్కి 2898 ఏడీ చేస్తున్నారు. ఈ చిత్రం మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడడం దాదాపు ఖరారైంది. కొత్త తేదీ త్వరలో వెల్లడికానుంది. మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం కూడా ప్రభాస్ చేయనున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‍లో స్పిరిట్ మూవీకి కూడా ఓకే చెప్పారు. సలార్ 2 కూడా చేయనున్నారు. అలాగే, దర్శకుడు హను రాఘవపూడితో ఈ చిత్రాన్ని చేయనున్నారు ప్రభాస్.

IPL_Entry_Point