OTT Latest Releases: గత వారం ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.. సలార్‌తో పాటు మరికొన్ని..-salaar to atharva telugu movies debut for streaming on ott platforms in january third week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Latest Releases: గత వారం ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.. సలార్‌తో పాటు మరికొన్ని..

OTT Latest Releases: గత వారం ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.. సలార్‌తో పాటు మరికొన్ని..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 21, 2024 09:06 PM IST

OTT Releases: జనవరి మూడో వారంలో కొన్ని తెలుగు సినిమాలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టాయి. వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వచ్చాయి.

OTT Releases: గత వారం ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు ఇవే
OTT Releases: గత వారం ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు ఇవే

OTT Releases: ఓటీటీల్లో సినిమాలు చూడాలనుకునే వారికి కోసం గత వారం (జనవరి మూడో వారం) మరిన్ని తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. ప్రభాస్ హీరోగా నటించిన సలార్‌తో పాటు మరిన్ని సినిమాలు ఓటీటీల్లో అడుగుపెట్టాయి. నితిన్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ కూడా ఓటీటీలోకి వచ్చింది. జనవరి మూడో వారంలో ఓటీటీల్లోకి వచ్చిన చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

సలార్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా జనవరి 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ స్ట్రీమ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ చిత్రం గత డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ మూవీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరి రావు, జగపతి బాబు తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో రిలీజైన నెలలోపే జనవరి 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చింది సలార్.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్

ఎనర్జిటిక్ హీరో నితిన్ నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా జనవరి 19వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు వక్కంతం వంశీ. డిసెంబర్ 8న థియేటర్లలో రిలీజైన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

అథర్వ

క్రైమ్ థ్రిల్లర్ ‘అథర్వ’ సినిమా జనవరి 18వ తేదీన ‘ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్‍‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా జైన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. మర్డరీ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా అథర్వను తెరకెక్కించారు డైరెక్టర్ మహేశ్ రెడ్డి. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

గుడ్‍ లక్ గణేశా

‘యానై ముతాగన్’ అనే తమిళ సినిమాకు తెలుగు వెర్షన్‍గా ‘గుడ్ లక్ గణేశా’ చిత్రం మూవీ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 19వ తేదీన అడుగుపెట్టింది. తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు, రమేశ్ తిలక్, ఊర్వశి ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. సోమరిగా ఉండే వినాయకర్ (యోగిబాబు)కు వినాయకుడు మార్గనిర్దేశం చేయడం అనే ఆసక్తికర కథతో గుడ్‍ లక్ గణేశా మూవీ ఉంది.

జోయ్

తమిళ సినిమా ‘జోయ్’ సినిమా జనవరి 15వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హరిహరన్ రామ్ దర్శకత్వం వహించారు.

ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ కూడా జనవరి 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్.. ఈ పోలీస్ యాక్షన్ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. రోహిత్ శెట్టి ఈ సిరీస్ క్రియేట్ చేశారు.

IPL_Entry_Point