Extra Ordinary Man OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Extra Ordinary Man OTT Release Date: నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుంది.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
Extra Ordinary Man OTT Release Date: ఎనర్జిటిక్ హీరో నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం థియేటర్లలో గత డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ అయింది. ప్రమోషన్లతో ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. అయితే, వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో మోస్తరు విజయాన్ని ఈ సినిమా సాధించింది. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో స్ట్రీమింగ్ డేట్‍పై అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది. ఈ మూవీ జనవరి 19వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని నేడు (జనవరి 13) వెల్లడించింది.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నితిన్‍కు జోడీగా శ్రీలీల నటించారు. ఈ ఇద్దరి డ్యాన్స్ ఈ మూవీలో హైలైట్‍గా నిలిచాయి. సీనియర్ హీరో రాజశేకర్ ఈ చిత్రంలో కీరోల్ చేశారు. రావు రమేశ్, సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, హైపర్ ఆది ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
రచయితగా ఎన్నో బ్లాక్‍బాస్టర్ చిత్రాలకు స్టోరీలు అందించిన వక్కంతం వంశీ.. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీకి దర్శకత్వం వహించారు. ‘నా పేరు సూర్య’ తర్వాత వంశీ డైరెక్షన్ చేసిన మూవీ ఇదే. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో కామెడీ, పంచ్‍లు బాగా వర్కౌట్ అయినా.. అంతగా ఎంగేజింగ్ చేయలేకపోయింది. దీంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిత ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మించారు.
కథ ఇది..
సినిమా హీరో అవ్వాలని కలలు కనే యువకుడు అభినయ్ పాత్రను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో చేశారు నితిన్. సినిమాల్లో జూనియర్ అర్టిస్టుగా చేసే అభినయ్ (నితిన్) ఎప్పటికైనా హీరో కావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో అతడికి లిఖిత (శ్రీలీల) పరిచయం అవుతుంది. రిచ్ ఫ్యామిలీకి చెందిన లిఖితతో అభి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో లిఖితకు చెందిన కంపెనీకి సీఈవో అవుతాడు అభినయ్. ఆ తర్వాత ఎట్టకేలకు హీరో అయ్యే అవకాశం కూడా దక్కుతుంది. అప్పుడు విలన్ నీరో (సుదేవ్ నాయర్) ఎంటర్ అవుతాడు. పరిస్థితులు మారిపోయాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అభి హీరో అయ్యాడా? అతడి ఫ్లాష్‍బ్యాక్ ఏంటి అనే విషయాలు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.
భీష్మ సినిమా తర్వాత మూడేళ్లుగా హీరో నితిన్‍కు సరైన హిట్ లేదు. భీష్మ తర్వాత వచ్చిన రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా అదే కోవలోకి వెళ్లింది. అంచనాలకు తగ్గట్టుగా విజయం సాధించలేదు. నితిన్ తదుపరి పవర్ పేట అనే మూవీ చేస్తారని టాక్.