Good Luck Ganesha OTT Release Date: తెలుగులో వచ్చేస్తున్న యోగిబాబు కామెడీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు
Good Luck Ganesha OTT Release Date: గుడ్ లక్ గణేశా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఓ తమిళ కామెడీ మూవీకి తెలుగు వెర్షన్‍గా ఈ చిత్రం వస్తోంది. స్ట్రీమింగ్ వివరాలు ఇవే.
Good Luck Ganesha OTT Release Date: తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో ‘యానై ముగతాన్’ చిత్రం వచ్చింది. గతేడాది ఏప్రిల్‍లో ఈ తమిళ కామెడీ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ‘గుడ్ లక్ గణేశా’ నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా వెల్లడించింది.
గుడ్ లక్ గణేశా సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 19వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (జనవరి 16) అధికారికంగా ప్రకటించింది. “ఈ గణేశ్ కోసం ఆ గణేశ్ వస్తున్నాడు! గుడ్ లక్, గణేశా ఆహాలో వచ్చేస్తోంది. గుడ్ లక్ గణేశా సినిమా జనవరి 19న ప్రీమియర్ అవుతుంది” అని ఆహా ట్వీట్ చేసింది. యోగిబాబు, రమేశ్ తిలక్, వినాయకుడి విగ్రహం ఉన్న పోస్టర్ పోస్ట్ చేసింది.
గుడ్ లక్ గణేశా (యానై ముగతాన్) చిత్రంలో యోగి బాబుతో పాటు రమేశ్ తిలక్, ఊర్వశి, కరుణాకరన్, ఉదయ్ చంద్ర, హరీశ్ పేరడి, నాగ విశాల్, క్రేన్ మనోహర్ కీలకపాత్రలు పోషించారు. ఫ్యాంటసీ కామెడీ మూవీగా రజీశ్ మిథిలా దర్శకత్వం వహించారు. భరత్ శంకర్ సంగీతం అందించారు. గుడ్ లక్ గణేశా చిత్రాన్ని గ్రేట్ ఇండియన్ సినిమాస్ పతాకంపై రజీశ్ మిథిలా, లిజో జోన్స్ నిర్మించారు.
యానై ముగతాన్ (గుడ్ లక్ గణేశా) చిత్రం వినాయకుడి భక్తుడు వినాయకర్ (యోగిబాబు) చుట్టూ తిరుగుతుంది. వినాయకర్ సోమరితనంగా ఉంటూ ఇతరులపై ఆధారపడుతుంటాడు. ప్రజలను మోసం చేస్తుంటాడు. అతడికి మైకేల్ (కరుణాకరన్), మల్లి అక్క (ఊర్వశి) సపోర్టుగా ఉంటారు. అయితే, ఇలా సోమరిగా తిరిగే వినాయకర్ ముందు ఒక రోజు వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. అతడు జీవిస్తున్న విధానం గురించి ప్రశ్నిస్తాడు. దీంతో తన సోమరితనాన్ని వినాయకర్ విడిచేశాడా? అతడి జీవితం ఎలా మారింది? అనేదే ఈ సినిమా ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
దుమ్మురేపుతున్న కోటబొమ్మాళి పీఎస్
కోట బొమ్మాళి పీఎస్ సినిమా ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోంది. జనవరి 11వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఆహాలో 75 మిలియన్ల వ్యూయింగ్ నిమిషాలను దాటిపోయింది. ఈ చిత్రం దూసుకుపోతోంది. సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్‍కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు.
స్వలాభం కోసం పోలీసు వ్యవస్థను రాజకీయ నేతలు ఎలా వాడుకుంటారన్న కథాశంతంతో కోట బొమ్మాళి పీఎస్ చిత్రం తెరకెక్కింది. ఓటర్ల ఆలోచన విధానం ఎలా ఉందన్నది ఈ మూవీలో ఉంది. తేజ మర్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ మూవీ నయట్టుకు రీమేక్‍గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే, తెలుగుకు తగ్గట్టు మార్పులు చేశారు మేకర్స్. రజిన్ రాజ్, మిథున్ ముకుందన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గతేడాది నవంబర్ 23న థియేటర్లలో రిలీజైంది కోట బొమ్మాళి పీఎస్ సినిమా. ఇప్పుడు ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది.