Kota Bommali PS OTT Release Date: కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ రివీల్ చేసిన ఆహా-kota bommali ps ott release date aha reveals its digital premier date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kota Bommali Ps Ott Release Date: కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ రివీల్ చేసిన ఆహా

Kota Bommali PS OTT Release Date: కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. డేట్ రివీల్ చేసిన ఆహా

Hari Prasad S HT Telugu

Kota Bommali PS OTT Release Date: శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, శివానీ రాజశేఖర్ నటించిన కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గురువారం (జనవరి 4) ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా రివీల్ చేసింది.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కోట బొమ్మాళి పీఎస్ మూవీ

Kota Bommali PS OTT Release Date: మలయాళ సినిమా నయట్టు రీమేక్ గా తెలుగులో వచ్చిన సినిమా కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీ డేట్ రివీలైంది. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ గురువారం (జనవరి 4) వెల్లడించింది. శ్రీకాంత్ తోపాటు వరలక్ష్మి శరత్‌కుమార్, శివానీ రాజశేఖర్ ఇందులో నటించారు.

జోహార్ మూవీ ఫేమ్ తేజ మార్ని ఈ కోట బొమ్మాళి పీఎస్ మూవీని డైరెక్ట్ చేశాడు. సంక్రాంతికి ఈ సినిమా తీసుకొస్తున్నట్లు గతంలోనే ఆహా ఓటీటీ చెప్పినా.. తాజాగా డేట్ ను వెల్లడించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 24న రిలీజైంది. సాధారణంగా నెల రోజుల్లోనే చాలా వరకూ సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుండగా.. ఈ మూవీ మాత్రం కాస్త ఆలస్యంగా వస్తోంది.

మలయాళంలో హిట్ అయిన నయట్టు మూవీకి రీమేక్ లో కాస్త మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు సినిమాను రూపొందించాడు. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో ఈ కోటబొమ్మాళి పీఎస్ ను నిర్మించారు. ఈ సినిమాకు రంజిన్ రాజ్, మిథున్ ముకుందన్ మ్యూజిక్ అందించారు. మురళీ శర్మ, విష్ణు, దయానంద్ రెడ్డి ముఖ్యమైన పాత్రలు పోషించారు.

కోట బొమ్మాళి పీఎస్ ఎలా ఉందంటే?

ప్ర‌భుత్వాలు, రాజ‌కీయ నాయ‌కులు త‌మ అధికారాన్ని నిలుపుకోవ‌డం ఎలాంటి ఎత్తులు వేస్తుంటారు. ఈ రాజ‌కీయ చ‌ద‌రంగంలో సామాన్యుల‌తో పాటు కొన్ని సార్లు చ‌ట్టాన్ని ర‌క్షించే పోలీసులు కూడా ఎలా స‌మిధ‌ల‌వుతుంటారు అన్న‌ది కోట బొమ్మాళి సినిమాలో ద‌ర్శ‌కుడు చూపించారు.

పోలీసులు, దొంగ‌ల మ‌ధ్య పోరు అన్న‌ది చాలా సినిమాల్లో క‌నిపిస్తుంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం పోలీసులు త‌మ డిపార్టెంట్‌మెంట్‌కు చెందిన పోలీసుల‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం అనే పాయింట్ కొత్త‌గా ఉంటుంది. రీమేక్ సినిమానే అయినా ఆ ఫీలింగ్ రాకుండా ద‌ర్శ‌కుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. ముఖ్యంగా శ్రీకాకుళం యాస‌, ఆ నేటివిటీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి.

ఈ సినిమాకు తొలి రోజే మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. చిన్న బడ్జెట్ మూవీ అయినా.. రిలీజైన రోజే రూ.1.75 కోట్లు వసూలు చేయడం విశేషం. మూవీ రిలీజ్ కు ముందే ట్రైలర్, పాటలతోనే సినిమా ఆకట్టుకున్నా.. రిలీజైన రోజు తొలి షోకి పెద్దగా స్పందన రాలేదు. అయితే మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో తర్వాతి షోలకు కలెక్షన్లు పెరిగాయి. మొత్తంగా కోట బొమ్మాళి పీఎస్ మూవీ రూ.10 కోట్లు రాబట్టడం విశేషం. 2023లో మంచి కలెక్షన్లు రాబట్టిన చిన్న సినిమాల్లో ఇది కూడా ఒకటి.

ఒకవేళ థియేటర్లలో మిస్ అయితే ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. పందెం మొదలైంది.. గెలిచేది ఎవరో చూడండి అనే క్యాప్షన్ తో ఈ కోట బొమ్మాళి పీఎస్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా రివీల్ చేసింది.