Ram Gopal Varma: ఐఫా వేదికపై థ్యాంక్స్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. మియా మాల్కోవాపై ఒట్టేసిన రామ్ గోపాల్ వర్మ-ram gopal varma rgv swears on mia malkova after sandeep reddy vanga thanks him on iffa 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Gopal Varma: ఐఫా వేదికపై థ్యాంక్స్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. మియా మాల్కోవాపై ఒట్టేసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: ఐఫా వేదికపై థ్యాంక్స్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. మియా మాల్కోవాపై ఒట్టేసిన రామ్ గోపాల్ వర్మ

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 01, 2024 08:46 AM IST

Ram Gopal Varma - Sandeep Reddy Vanga: ఐఫా అవార్డుల్లో యానిమల్ సినిమా ఆధిపత్యం చూపింది. ఐఫా అవార్డు అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. రామ్ గోపాల్ వర్మకు థ్యాంక్స్ చెప్పారు. దీనికి తన స్టైల్‍లో ఆర్జీవీ స్పందించారు.

Ram Gopal Varma: థ్యాంక్స్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. మియా కలీఫాపై ఒట్టేసిన రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma: థ్యాంక్స్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. మియా కలీఫాపై ఒట్టేసిన రామ్ గోపాల్ వర్మ

యానిమల్ సినిమాతో గతేడాది డిసెంబర్‌లో బాక్సాఫీస్‍ను షేక్ చేసేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్‍వీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.900కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. కొన్ని విమర్శలు వచ్చినా.. ఫుల్ సక్సెస్ అయింది. సందీప్ రెడ్డి వంగా టేకింగ్‍తో పాటు ఈ మూవీలోని టెక్నికల్ అంశాలపై ప్రశంసలు వచ్చాయి. సందీప్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఐఫా 2024 అవార్డుల్లో యానిమల్ చిత్రానికి బెస్ట్ మూవీగా అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సీనియర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ)కు సందీప్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు.

డైరెక్టర్ రామ్‍ గోపాల్ వర్మపై తనకు ఉన్న గౌరవాన్ని, ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని సందీప్ రెడ్డి వంగా గతంలోనూ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు అబుదాబిలో జరిగిన ఐఫా 2024 అవార్డుల వేడుకలోనూ మరోసారి ఆర్జీవీ గురించి మాట్లాడారు.

సందీప్ ఏమన్నారంటే..

యానిమల్ చిత్రానికి గాను బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఎడిటింగ్ అవార్డులను సందీప్ వంగా అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రామ్‍గోపాల్ వర్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని సందీప్ అన్నారు. ఆయన చిత్రాల్లో తాను పని చేయకపోయినా చాలా నేర్చుకున్నానని అన్నారు. ‘థ్యాంక్య్ ఆర్జీవీ సర్’ అని సందీప్ చెప్పారు.

వారిపై ఒట్టేస్తూ..

సందీప్ రెడ్డి వంగా థ్యాంక్స్ చెప్పడంపై తన స్టైల్‍లో ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. అమెరికన్ శృంగార తార మియా మాల్కోవా, గ్యాంగ్‍స్టర్ దావూద్ ఇబ్రహీం, రష్యన్ రచయిత అయాన్ రాండ్‍తో పాటు సందీప్‍పై కూడా ఒట్టేస్తూ ట్వీట్ చేశారు.

ఇప్పుడు సందీప్ నుంచి తాను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నానని ఆర్జీవీ పోస్ట్ చేశారు. “సర్ సందీప్ రెడ్డి.. ఇప్పుడు నేను మీ నుంచి సినిమాలు తీయడం నేర్చుకోవాలని అనుకుంటున్నా. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, అయాన్ రాండ్, మీపై ఒట్టేసి చెబుతున్నా” అని ఆర్టీవీ ట్వీట్ చేశారు.

యానిమల్ చిత్రంలో దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ సందీప్ రెడ్డి వంగా తన మార్క్ చూపించారు. ఈ చిత్రంలోని కొన్ని ఇంటర్ కట్స్ విపరీతంగా మెప్పించాయి. కొన్ని చోట్ల ఒక సీన్ నుంచి ఒక సీన్‍కు మారే విధానం కూడా ఆకట్టుకుంది. దర్శకుడిగా, ఎడిటర్‌గా సందీప్ అదరగొట్టారు. మ్యూజిక్ విషయంలోనూ ఆయనకు ఎంత పట్టు ఉందో యానిమల్‍తో మరోసారి రుజువైంది.

యానిమల్ చిత్రం 2023 డిసెంబర్ 1వ తేదీన విడుదలైంది. సందీప్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం భారీ హిట్ అయింది. సుమారు రూ.100కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ మూవీ రూ.917 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఈ చిత్రంలో రణ్‍వీర్ కపూర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా చేశారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి, శక్తి కపూర్, చారు శేఖర్ కీరోల్స్ చేశారు.

సందీప్ రెడ్డి వంగా తదుపరి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‍తో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్‌లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.