Ram Charan: పిఠాపురంలో పవన్‍‍ను కలిసిన రామ్‍చరణ్.. నంద్యాలలో అల్లు అర్జున్.. భారీగా ఫ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో మోత-ram charan meets pawan kalyan in pithapuram and pushpa actor allu arjun in nandyal videos goes viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: పిఠాపురంలో పవన్‍‍ను కలిసిన రామ్‍చరణ్.. నంద్యాలలో అల్లు అర్జున్.. భారీగా ఫ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో మోత

Ram Charan: పిఠాపురంలో పవన్‍‍ను కలిసిన రామ్‍చరణ్.. నంద్యాలలో అల్లు అర్జున్.. భారీగా ఫ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో మోత

Chatakonda Krishna Prakash HT Telugu
May 11, 2024 03:42 PM IST

Ram Charan - Allu Arjun: పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్‍ను కలిశారు రామ్‍చరణ్. అలాగే, నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. వీరిని చూసేందుకు అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram Charan: పిఠాపురంలో పవన్‍‍ను కలిసి రామ్‍చరణ్.. నంద్యాలలో అల్లు అర్జున్.. భారీగా ఫ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో మోత
Ram Charan: పిఠాపురంలో పవన్‍‍ను కలిసి రామ్‍చరణ్.. నంద్యాలలో అల్లు అర్జున్.. భారీగా ఫ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో మోత

Ram Charan - Allu Arjun: ఆంధ్రప్రదేశ్‍లో ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఆసక్తికర విషయాలు జరిగాయి. జనసేన అధినేత, తన బాబాయ్ పవన్‍ కల్యాణ్‍కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్.. పిఠాపురం వెళ్లారు. పవన్ ఇంటికి వెళ్లి కలిశారు. వీరిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలు వచ్చారు. మరోవైపు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కర్నూలు జిల్లాలోని నంద్యాలకు వెళ్లారు. వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవీంద్ర కిశోర్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మోత మోగుతున్నాయి.

పవన్‍తో రామ్‍చరణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన నేడు (మే 11) పిఠాపురం వెళ్లారు రామ్‍చరణ్. ముందుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న చెర్రీకి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్లారు. అక్కడ కూడా రామ్‍చరణ్‍కు మెగా ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‍కమ్ చెప్పారు.

అనంతరం తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు రామ్‍చరణ్. ఆ తర్వాత ఇంటి వద్దకు భారీగా వచ్చిన అభిమానులకు పవన్, చరణ్ కలిసి అభివాదం చేశారు. కేకలు, ఈలలతో ఫ్యాన్స్ మోతమోగించారు.

యువసేనాని అంటూ..

రామ్‍చరణ్‍కు యువసేనాని అనే పొలిటికల్ ట్యాగ్‍ను నెటిజన్లు ఇచ్చేశారు. జనసేనాని కోసం యువసేనాని అంటూ సోషల్ మీడియాలో మోతెక్కిస్తున్నారు. పిఠాపురంలో రామ్‍చరణ్‍ టూర్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నంద్యాలలో హోరు

వైఎస్ఆర్ సీపీ తరఫున నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవీంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు శిల్పా ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. బన్నీ.. బన్నీ అంటూ అరుపులతో మోతెక్కించారు. దీంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అక్కడి వచ్చిన ఫ్యాన్స్‌కు బన్నీ అభివాదం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో మోతెక్కిపోతున్నాయి.

శిల్పా రవి తనకు మంచి స్నేహితుడని.. అందుకే ఆయన అడగకున్నా తాను నంద్యాల వచ్చానని అల్లు అర్జున్ అన్నారు. తన స్నేహితులు ఏ రంగంలో ఉన్నా.. ఏ పార్టీలో ఉన్నా తాను సపోర్ట్ చేస్తానని చెప్పారు. నంద్యాల రావాలని తనను శిల్ప అడగలేదని, తనకే రావాలని అనిపించిందని బన్నీ అన్నారు. అల్లు అర్జున్‍తో తన భార్య స్నేహా రెడ్డి కూడా నంద్యాల వెళ్లారు.

మొత్తంగా.. ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు రామ్‍చరణ్, అల్లు అర్జున్ టాపిక్ హైలైట్‍గా నిలిచింది. ఏపీలో అసెంబ్లీ, లోక్‍సభ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన జరగనుంది. జూన్ 4న ఓట్లు లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.

సినిమాలు ఇలా..

రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో బిజీబిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో రామ్‍చరణ్ ఓ మూవీ చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ మూవీ చేస్తున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

IPL_Entry_Point