Pushpa 2 First Song: పుష్ప 2 నుంచి తొలి పాట వచ్చేసింది.. దేశమంతా పూనకాలే.. అదిరిపోయిన అల్లు అర్జున్ స్టెప్స్-pushpa 2 the rule first single released pushpa song video with mass beat and allu arjun excellent steps ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 First Song: పుష్ప 2 నుంచి తొలి పాట వచ్చేసింది.. దేశమంతా పూనకాలే.. అదిరిపోయిన అల్లు అర్జున్ స్టెప్స్

Pushpa 2 First Song: పుష్ప 2 నుంచి తొలి పాట వచ్చేసింది.. దేశమంతా పూనకాలే.. అదిరిపోయిన అల్లు అర్జున్ స్టెప్స్

Chatakonda Krishna Prakash HT Telugu
May 01, 2024 05:36 PM IST

Pushpa 2 The Rule First song - Allu Arjun: పుష్ప 2 సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఫుల్ మాస్ బీట్‍తో ఈ పాట అదిరిపోయేలా ఉంది. స్టెప్‍లతో హీరో అల్లు అర్జున్ అదరగొట్టారు.

Pushpa 2 First Single: పుష్ప 2 నుంచి తొలి పాట వచ్చేసింది.. దేశమంతా పూనకాలే! అదిరిపోయిన అల్లు అర్జున్ స్టెప్స్
Pushpa 2 First Single: పుష్ప 2 నుంచి తొలి పాట వచ్చేసింది.. దేశమంతా పూనకాలే! అదిరిపోయిన అల్లు అర్జున్ స్టెప్స్

Pushpa 2 The Rule First Song: దేశమంతా ఎంతో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. పుష్ప 2: ది రూల్ చిత్రం నుంచి తొలి పాట అడుగుపెట్టింది. పుల్ జోష్‍తో పక్కా మాస్ బీట్‍తో ఉన్న ఈ పాటను మూవీ టీమ్ నేడు (మే 1) రిలీజ్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై క్రేజ్ భారీ స్థాయిలో ఉంది. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినీ ప్రేక్షకులంతా ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో పుష్ప 2 సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ నేడు వచ్చేసింది.

'పుష్ప.. పుష్ప.. పుష్ప., పుష్ప రాజ్' అంటూ పుష్ప 2: ది రూల్ నుంచి తొలి పాటవచ్చేసింది. “నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లె”.. "నువ్వు భుజమే ఎత్తి నడిసొస్తుంటే భూమి బద్దలయ్యే" అంటూ ఈ సాంగ్ మొదలైంది. “నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తేపెంచాలే” అంటూ పవర్ ఫుల్ లిరిక్స్ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటకు ఫుల్ మాస్ బీట్ ఇచ్చారు. తెలుగులో నాకాశ్ అజీజ్, దీపక్ బ్లూ ఈ సాంగ్‍ను పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

టీ గ్లాస్ పట్టుకొని..

పుష్ప 2లోని ఈ తొలి సాంగ్ లిరికల్ వీడియోలో అల్లు అర్జున్ స్టెప్స్ అదిరిపోయాయి. వీడియో చివర్లో టీ గ్లాస్‍ పట్టుకొని ఆయన వేసిన డ్యాన్స్ సూపర్‌గా ఉంది. పుష్ప రాజ్‍గా ఐకాన్ స్టార్ స్వాగ్, స్టైల్ దద్దరిల్లిపోయాయి. 'అసలు తగ్గేదే లే' అంటూ అల్లు అర్జున్ ఐకానిక్ డైలాగ్ కూడా చివర్లో ఉంది.

పుష్ప 2 నుంచి ఈ తొలి పాట ఐదు భాషల్లో వచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయింది. ఆయా భాషలకు సంబంధించి సింగర్లు, లిరిక్ రైటర్లు వేర్వేరుగా ఉన్నారు. బెంగాలీలోనూ ఈ పాట తీసుకొస్తామని టీమ్ ఇప్పటికే చెప్పింది. దీంతో బెంగాలీలో త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

పుష్ప 2: ది రూల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ థియేట్రికల్ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. ఆ రేంజ్‍లో హిందీలోనూ ఈ మూవీకి క్రేజ్ ఉంది.

సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా దేశాన్నంతా ఊపేసింది. అల్లు అర్జున్ స్టైల్, స్వాగ్, మేనరిజమ్స్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాలు అందరినీ మెప్పించాయి. పాన్ ఇండియా రేంజ్‍లో బాక్సాఫీస్‍ను పుష్ప షేక్ చేసింది. దీంతో సీక్వెల్‍గా వస్తున్న పుష్ప 2 సినిమాపై కూడా క్రేజ్ చాలా ఉంది. అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. సీక్వెల్ మూవీని మరింత భారీగా, కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో రూపొందించారు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలు మెండుగా ఉన్నాయి.

పుష్ప 2: ది రూల్ మూవీలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, ధనుంజయ, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.