Hi Papa: ఓటీటీలో 50 రోజులుగా టాప్-10లో హాయ్ నాన్న హిందీ వెర్షన్.. ‘సరిపోదా’కు కలిసి రానుందా?
Hi Papa Streaming: హాయ్ నాన్న సినిమా హిందీ వెర్షన్ ‘హాయ్ పాపా’ ఓటీటీలో సత్తాచాటుతోంది. 50 రోజులుగా ట్రెండింగ్ టాప్-10లోనే కొనసాగుతోంది. దీంతో ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ఇది కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఆ వివరాలివే..
Hi Nanna Hindi: నేచురల్ స్టార్, టాలెండెట్ యాక్టర్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ఫీల్ గుడ్‍మూవీగా ప్రశంసలు దక్కించుకుంది. దర్శకుడు శౌర్యవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం, అతడి టేకింగ్ అందరినీ ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ నటన, హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం మెప్పించాయి. తెలుగుతో పాటు హిందీలో ‘హాయ్ పాపా’ పేరుతో ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, థియేటర్లలో హిందీ వెర్షన్‍కు అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. అయితే, ఓటీటీలో మాత్రం సీన్ పూర్తిగా మారింది.
హాయ్ నాన్న సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జనవరి 4వ తేదీన ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. తొలి వారం తెలుగుతో పాటు హిందీ వెర్షన్ ‘హాయ్ పాపా’కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టాప్-5లో ట్రెండ్ అయ్యాయి. అయితే, హిందీ వెర్షన్ జోరు మాత్రం 50 రోజులైన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. టాప్-10లో కంటిన్యూ అవుతోంది.
‘హాయ్ పాపా’ చిత్రం 50 రోజులుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఇండియా ట్రెండింగ్‍లో టాప్-10లోనే కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ చాలా మంది హిందీ జనాలు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. నాని పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతున్నారు. దీంతో హిందీలోనూ నేచులర్ స్టార్ మంచి పాపులర్ అయ్యారు. నాని తదుపరి మూవీ ‘సరిపోదా శనివారం’ కూడా పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది.
‘సరిపోదా’కు ప్లస్!
‘హాయ్ పాపా’ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సూపర్ పాపులర్ కావడంతో హిందీలో ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ప్లస్ అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. సరిపోదా శనివారం సినిమా హిందీలో ‘సూర్యాస్ సాటర్‌డే’ పేరుతో రిలీజ్ కానుంది. నాని పుట్టిన రోజైన ఫిబ్రవరి 24న ఈ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. శనివారం మాత్రమే కోపం చూపించే వ్యక్తి అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ చిత్రం వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
‘హాయ్ పాపా’తో నానికి హిందీ జనాల్లో మంచి పాపులారిటీ రావడంతో ఇది ‘సూర్యాస్ సాటర్‌డే’ కలిసివచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఓపెనింగ్ బాగానే రావొచ్చు. నాని యాక్టింగ్‍తో పాటు వివేక్ అత్రేయ ప్రత్యేకమైన టేకింగ్, స్క్రిన్‍ప్లే క్లిక్ అయితే.. హిందీలోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇప్పటికే భారీ ఓటీటీ డీల్
హాయ్ నాన్న సినిమా తమ ప్లాట్‍ఫామ్‍లో భారీ వ్యూవర్‌షిప్ దక్కించుకోవడంతో ‘సరిపోదా శనివారం’ హక్కులను నెట్‍ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ.45కోట్లను వెచ్చించిందట. ఇప్పటికే ఇలా ఓటీటీ హక్కుల విషయంలో ఈ మూవీకి కలిసి వచ్చింది. ‘సరిపోదా శనివారం’ హిందీ వెర్షన్ ‘సూర్యాస్ సాటర్‌డే’ థియేటర్లలోనూ సత్తాచాటుతుందని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది.
సరిపోదా శనివారం చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. తమిళ స్టార్ ఎస్‍జే సూర్య కీరోల్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.