Saripodhaa Sanivaaram OTT Deal: భారీ ధరకు నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీ హక్కులు.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..-saripodhaa sanivaaram ott rights reportedly bagged by netflix for huge price ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Ott Deal: భారీ ధరకు నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీ హక్కులు.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..

Saripodhaa Sanivaaram OTT Deal: భారీ ధరకు నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీ హక్కులు.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 29, 2024 03:13 PM IST

Saripodhaa Sanivaaram OTT Deal: సరిపోదా శనివారం సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన డీల్ పూర్తయినట్టు తెలుస్తోంది. నాని హీరోగా నటించిన ఈ ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం.

సరిపోదా శనివారం పోస్టర్
సరిపోదా శనివారం పోస్టర్

Saripodhaa Sanivaaram OTT Deal: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచులర్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాపై ఆసక్తి విపరీతంగా ఉంది. టైటిల్ విభిన్నంగా ఉండడంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ మూవీపై మొదటి నుంచే బజ్ పెరిగింది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీ రానుంది. నాని - వివేక్ కాంబినేషన్‍లో రెండో చిత్రంగా సరిపోదా శనివారం రూపొందుతోంది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికి’ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు.. నాని - అత్రేయ కలిసి చేస్తున్న ‘సరిపోదా శనివారం’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్టుగానే.. ‘సరిపోదా శనివారం’ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం బయటికి వచ్చింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. ఏకంగా రూ.45కోట్లను వెచ్చించి ‘సరిపోదా శనివారం’ మూవీ అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. నాని కెరీర్లో ఇదే అత్యధిక ఓటీటీ డీల్‍గా ఉంది.

సరిపోదా శనివారం మూవీ పాన్ ఇండియా రేంజ్‍లో రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

సరిపోదా శనివారం మూవీలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ చిత్రం తర్వాత నాని - ప్రియాంక కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. తమిళ ప్రముఖ యాక్టర్ ఎస్‍జే సూర్య ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‍లో సూర్య పాల్గొన్నారు.

ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ, లవ్ స్టోరీలనే తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ.. యాక్షన్ థ్రిల్లర్‌ జానర్‌లో సరిపోదా శనివారం రూపొందిస్తున్నారు. విభిన్నమైన స్క్రీన్‍ప్లేతో ఆకట్టుకునే వివేక్.. సరిపోదా శనివారంలోనూ మ్యాజిక్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తుండగా.. మురళీ జీ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

సరిపోదా శనివారం మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‍రాజుకు చెందిన చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. ఈ విషయంపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ మూవీ కోసం దిల్‍రాజుతో భాగస్వాములవడం చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకుందని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ వెల్లడించింది.

సరిపోదా శనివారం చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్ సాధించింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ మూవీ విజయం సాధించడంతో పాటు చాలా ప్రశంసలను దక్కించుకుంది.

సంబంధిత కథనం