OTT Releases This Week: హనుమాన్ నుంచి సూపర్ హిట్ మలయాళం మూవీ వరకు.. ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు-ott releases this week hanuman anweshippin kandethum lal salaam yatra 2 in prime video netflix zee5 otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ott Releases This Week Hanuman Anweshippin Kandethum Lal Salaam Yatra 2 In Prime Video Netflix Zee5 Otts

OTT Releases This Week: హనుమాన్ నుంచి సూపర్ హిట్ మలయాళం మూవీ వరకు.. ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు

Hari Prasad S HT Telugu
Mar 04, 2024 08:12 AM IST

OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. చాలా రోజులుగా వేచి చూస్తున్న హనుమాన్ నుంచి సూపర్ హిట్ మలయాళం మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్ వరకూ ఈ లిస్టులో ఉన్నాయి.

ఈవారం ఓటీటీల్లోకి రాబోతున్న హనుమాన్, మలయాళం మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్
ఈవారం ఓటీటీల్లోకి రాబోతున్న హనుమాన్, మలయాళం మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్

OTT Releases This Week: ఓటీటీల్లోకి ఈ వారం కొన్ని తెలుగుతోపాటు ఇతర భాషల సినిమాలు రాబోతున్నాయి. తెలుగులో హనుమాన్, యాత్ర 2తోపాటు మలయాళంలో అన్వేషిప్పిన్ కండెతుమ్, లాల్ సలామ్ లాంటి సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో ఒకసారి చూద్దాం.

ఈవారం ఓటీటీ రిలీజ్‌లు

ఈసారి సోమవారం (మార్చి 4) నుంచే ఓటీటీల్లోకొ కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. శనివారం (మార్చి 9) వరకూ సుమారు ఆరేడు సినిమాలు తమ డిజిటల్ ప్రీమియర్స్ కు రెడీ అవుతున్నాయి.

బ్యాచిలర్ పార్టీ - ప్రైమ్ వీడియో (మార్చి 4)

బ్యాచిలర్ పార్టీ ఓ కన్నడ మూవీ. ఇదొక కామెడీ-అడ్వెంచర్ ఫిల్మ్. అభిజిత్ మహేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రముఖ కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నిర్మించాడు. జనవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి సోమవారం (మార్చి 4) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

హనుమాన్ - జీ5 (మార్చి 8)

ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ హనుమాన్. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జీ5 ఓటీటీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

అన్వేషిప్పిన్ కండెతుమ్ - నెట్‌ఫ్లిక్స్ (మార్చి 8)

మలయాళంలో ఈ ఏడాది తొలి హిట్ అందుకున్న మూవీ అన్వేషిప్పిన్ కండెతుమ్. టొవినో థామస్ నటించిన ఈ మర్డర్ మిస్టరీ మూవీ మార్చి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ మూవీ రానుంది.

లాల్ సలామ్ - నెట్‌ఫ్లిక్స్ (మార్చి 8)

సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథిపాత్రలో కనిపించిన ఈ లాల్ సలామ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది.

యాత్ర 2 - ప్రైమ్ వీడియో (మార్చి 8)

యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్.

ఓటీటీల్లోకి రాబోతున్న మరికొన్ని సినిమాలు

ఈ వారం ఈ సినిమాలతోపాటు తమిళంలో రూపొందిన రొమాన్స్ డ్రామా లవర్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్), హిందీలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన మెర్రీ క్రిస్మస్ (నెట్‌ఫ్లిక్స్)లాంటి సినిమాలు కూడా ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాయి. ఈ లెక్కన రాబోయే లాంగ్ వీకెండ్ లో ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ టైంపాస్ పక్కా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

WhatsApp channel