Ooru Peru Bhairavakona OTT: ‘ఊరు పేరు భైరవకోన’ ఓటీటీలోకి ఆ రోజే రానుందా?-sundeep kishan varsha bollamma ooru peru bhairavakona expected streaming date on zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ooru Peru Bhairavakona Ott: ‘ఊరు పేరు భైరవకోన’ ఓటీటీలోకి ఆ రోజే రానుందా?

Ooru Peru Bhairavakona OTT: ‘ఊరు పేరు భైరవకోన’ ఓటీటీలోకి ఆ రోజే రానుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 03, 2024 10:39 PM IST

Ooru Peru Bhairavakona OTT Release: ఊరు పేరు భైరవకోన సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే, ఈ మూవీ ఓటీటీ రిలీజ్‍పై తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. ఏ రోజు స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉందంటే..

Ooru Peru Bhairavakona OTT: ‘ఊరు పేరు భైరవకోన’ ఓటీటీలోకి ఆ రోజే రానుందా?
Ooru Peru Bhairavakona OTT: ‘ఊరు పేరు భైరవకోన’ ఓటీటీలోకి ఆ రోజే రానుందా?

Ooru Peru Bhairavakona OTT: సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’ మంచి అంచనాలతో వచ్చింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం, మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేయడంతో ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజై అయింది. పాజిటివ్ మౌత్ టాక్‍తో ఈ చిత్రానికి ఆరంభంలో మంచి వసూళ్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో జోరు చూపలేకపోయింది.

ఊరు పేరు భైరవకోన సినిమా ఇక ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మార్చి 15వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు వెలువడుతున్నాయి.

ఊరు పేరు భైరవకోన చిత్రం మార్చి 15న జీ5 ఓటీటీలోకి రానుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, ఆహాలో కూడా ఈ చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

ఊరు పేరు భైరవకోన చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఫ్యాంటసీతో పాటు హారర్ ఎలిమెంట్‍ను కూడా ఈ చిత్రంలో చూపించారు. ఈ మూవీలో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‍గా నటించారు. కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్ కీలకపాత్రలు చేశారు.

కలెక్షన్ల లెక్కలు ఇలా..

ఊరు పేరు భైరవకోన సినిమాకు ఇప్పటి వరకు సుమారు ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. తొలి వారం ఈ చిత్రం సత్తాచాటింది. మంచి వసూళ్లను రాబట్టింది. పోటీగా వేరే చిత్రాలు లేకపోవటంతో ఈ మూవీకి కలిసి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్ల జోరు కొనసాగలేదు. అయితే, ఓవరాల్‍గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకుంది.

ఊరు పేరు భైరవకోన మూవీని హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించగా.. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ చిత్రానికి రిలీజ్ తర్వాత కూడా మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేసింది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ కొన్ని థియేటర్లకు కూడా వెళ్లారు.

స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే..

భైరవకోన అనే ఓ రహస్యమైన గ్రామం చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో రాత్రి వేళల్లో మాత్రమే తలుపులు తెరుచుకునే ఈ ఊరులోకి అనుకోకుండా వెళతాడు బసవ లింగం (సందీప్ కిషన్). అతడితో పాటు జాన్ (హర్ష), గీత (కావ్య థాపర్) కూడా ఉంటారు. అక్కడే గీత (వర్ష బొల్లమ్మ)తో బసవ ప్రేమలో పడతాడు. అక్కడ బసవ అతడి గ్యాంగ్‍కు చాలా అనూహ్యమైన విషయాలు ఎదురవుతాయి. భైరవకోన కథేంటి.. గరుడపురాణంలో నాలుగు పేజీలతో ఈ ఊరికి ఉన్న సంబంధం ఏంటి.. అక్కడి నుంచి బసవ, జాన్, గీత బయటపడ్డారా.. గీతతో బసవ ప్రేమ ఏమైంది? అన్న విషయాలు ఊరు పేరు భైరవకోన చిత్రంలో ఉంటాయి.

Whats_app_banner