Lal Salaam OTT: రెండు ఓటీటీల‌లోకి ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ - రిలీజ్ డేట్ ఇదేనా?-rajinikanth lal salaam streaming on netflix and sun nxt ott from this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lal Salaam Ott: రెండు ఓటీటీల‌లోకి ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ - రిలీజ్ డేట్ ఇదేనా?

Lal Salaam OTT: రెండు ఓటీటీల‌లోకి ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ - రిలీజ్ డేట్ ఇదేనా?

Nelki Naresh Kumar HT Telugu
Feb 29, 2024 12:32 PM IST

Lal Salaam OTT: ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ మూవీ మార్చి 9న ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు స‌న్ నెక్స్ట్ ఓటీటీలో లాల్ స‌లామ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది.

ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ మూవీ
ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ మూవీ

Lal Salaam OTT: థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా మిగిలిన ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఒకే రోజు లాల్ స‌లామ్ మూవీ రెండు ఓటీటీల‌లో రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్‌తో పాటు స‌న్ నెక్స్ట్ ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో ర‌జ‌నీకాంత్ మూవీ రిలీజ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. స‌న్ నెక్స్ట్‌లో కేవ‌లం త‌మిళ‌ వెర్ష‌న్ మాత్రం విడుద‌ల‌కానున్న‌ట్లు చెబుతున్నారు. మార్చి9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌, స‌న్ నెక్స్ట్ ఓటీటీల‌లో లాల్ స‌లామ్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. మార్చ్ ఫ‌స్ట్ వీక్‌లో లాల్ స‌లామ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

ర‌జ‌నీకాంత్ గెస్ట్ రోల్‌...

లాల్ స‌లామ్ మూవీలో ర‌జ‌నీకాంత్ ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ చేశాడు. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టించిన ఈ మూవీకి ర‌జ‌నీకాంత్ త‌న‌య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్డ్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ త‌మిళంతో పాటు తెలుగులోనూ దారుణ‌మైన ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న‌ది.

దాదాపు న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన లాల్ స‌లామ్ మూవీ త‌మిళంలో ప‌ది కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. తెలుగు వెర్ష‌న్ కోటిలోపే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ర‌జ‌నీకాంత్ తెలుగు డ‌బ్బింగ్ మూవీస్‌లో అతి త‌క్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న‌ది.

లాల్ స‌లామ్ క‌థ ఇదే...

క‌సుమూరుకు చెందిన మొయుద్దీన్ (ర‌జ‌నీకాంత్‌) గొప్ప బిజినెస్‌మెన్‌గా పేరు తెచ్చుకుంటాడు. కొడుకు శంషుద్దీన్‌ను (విక్రాంత్‌) క్రికెట‌ర్‌గా చూడాల‌న్న‌ది మొయుద్దీన్ క‌ల‌. ఊళ్లో క్రికెట్ మ్యాచ్ లో జ‌రిగిన గొడ‌వ‌లో శంషుద్దీన్ చేయిని గురు (విష్ణు విశాల్‌) న‌రికేస్తాడు. క్రికెట్ గొడ‌వ ఊళ్లో మ‌త‌క‌ల్లోలానికి దారితీస్తుంది. త‌న కొడుకు చేయిని న‌రికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు? గురును ఊరివాళ్లు ఎందుకు వెలివేశారు? ప్రాణ‌స్నేహితులుగా ఉన్న మొయిద్దీన్‌, గురు తండ్రి ఎందుకు శ‌త్రువులుగా మారారు అన్న‌దే లాల్ స‌లామ్ మూవీ క‌థ‌.

తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత…

ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ క్యారెక్ట‌ర్‌, అత‌డి యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నా...క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాత్ త‌డ‌బ‌డింది. లాల్ స‌లామ్ మూవీతో దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ మెగాఫోన్ ప‌ట్టింది. ధ‌నుష్ హీరోగా న‌టించిన త్రీ మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌. ఆ త‌ర్వాత వాయ్ రాజా వాయ్ అనే సినిమా చేసింది. లాల్‌స‌లామ్ మూవీలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి జీవిత ఓ కీల‌క పాత్ర చేసింది.

నాలుగు సినిమాలు...

జైల‌ర్‌తో గ‌త ఏడాది బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు ర‌జ‌నీకాంత్‌. ప్ర‌స్తుతం ఐదు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ర‌జ‌నీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వెట్టైయాన్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో అమితాబ్‌బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు 35 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ క‌లిసి చేస్తోన్న మూవీ ఇది.

జైల‌ర్ కు సీక్వెల్ కూడా రాబోతుంది. ఇటీవ‌లే నెల్స‌న్ అఫీషియ‌ల్‌గా సీక్వెల్‌ను ప్ర‌క‌టించాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో మ‌రో మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. వీటితో పాటు బాలీవుడ్‌లో ర‌జ‌నీకాంత్ ఓ మూవీ చేయ‌బోతున్నాడు.

Whats_app_banner