NNS October 10th Episode: అరుంధతికి పెరిగిన శక్తులు.. మనోహరికి చుక్కలు.. దొరికిపోయిన అంజు.. భాగీ కోరిక తీర్చాలన్న అమర్
Nindu Noorella Saavasam October 10th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 10వ తేది ఎపిసోడ్‌లో ప్రిన్సిపల్ దగ్గర్ అంజు రాకపోవడం గురించి భాగీ ఎంత చెప్పిన చివరికీ దొరికిపోతుంది. మరోవైపు అరుంధతికి శక్తులు వచ్చి ఏది కోరుకుంటే అది జరుగుతుంటుంది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్ (NNS 9th October Episode)లో పిల్లల్ని తీసుకుని స్కూల్‌కి వెళ్తుంది మిస్సమ్మ. ఉద్యోగం కోసం ప్రిన్సిపల్‌తో మాట్లాడటానికి వచ్చిన రామ్మూర్తి వాళ్లకి ఎదురుపడతాడు. తాతయ్యా మీరేంటి ఇక్కడ అని అడుగుతారు పిల్లలు. మిమ్మల్నే చూడటానికి వచ్చాను అంటాడు రామ్మూర్తి.
చేసిన తప్పు సరిదిద్దడానికి
ఇంటికి రావొచ్చు కదా అని భాగీ అడగ్గానే నేను అక్కడికి వస్తే మీరు నన్ను మొహమాట పెడతారని చెప్తూ.. నువ్వెందుకు వచ్చావమ్మా అని భాగీని అడుగుతాడు రామ్మూర్తి. కొందరు చేసిన తప్పు సరిదిద్దడానికి వచ్చాను అంటుంది భాగీ. ప్రిన్సిపల్‌తో మాట్లాడి అంజుని తను క్లాస్ దింపుతానని చెప్పి మిగతా పిల్లల్ని క్లాస్‌కి వెళ్లమని పంపిస్తుంది.
కారులో వెళ్తున్న అమర్ భాగీ మాటలు గుర్తు చేసుకుంటాడు. గోల్ ఏమీ లేదంటుంది. అసలు గోల్ లేని మనిషి ఉంటారా? ఏదో రెండు సార్లు అనుకున్నది జరగలేదని గోల్ లేదని అంటే ఎలా? కనీసం చిన్న కోర్కెలు ఉంటాయి కదా? అవైనా చెప్పాలి కదా? అంటాడు అమర్. సార్ ఏమీ అనుకోకండి ఈ గోల్ గోల ఏంటి సార్ అంటాడు రాథోడ్.
గోల్ ఏముంటుంది
అంటే ఏంటి? రాథోడ్ గోల్ ఉండటం గోలనా..? అంటున్న అమర్‌తో అయ్యోయ్యో నేను అలా అనలేదు సార్. అంటే ఎవరికి గోల్ లేదని మీరు గోల చేస్తున్నారు అని అడుగుతున్నాను అంటాడు. ఇంకెవరి గురించి అంటాను. ఉంది కదా నా లైఫ్‌లో ఒక లూజ్. మిస్సమ్మకే.. అంటాడు అమర్. పెళ్లైన ఆడపిల్లకు భర్తను ప్రేమగా చూసుకోవడం తప్పా పెద్దగా గోల్ ఏముంటుంది సార్ అంటాడు రాథోడ్.
ప్రతి ఒక్కరికీ ఒక గోల్ ఉంటుంది. ఉండాలి. మిస్సమ్మకు కూడా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలని తన గోల్‌ను పక్కన పెట్టేసింది. అదేంటో కనుక్కుని వెంటనే నెరవేర్చాలి రాథోడ్ అంటాడు అమర్. సార్ చిన్న డౌటు భార్య గానా.. లేదంటే భార్య చెల్లెలుగానా..? సార్ అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు.
భయపడిన ప్రిన్సిపల్
భాగీ, రామ్మూర్తిలు ప్రిన్సిపల్ రూంలోకి వెళ్తారు. వాళ్లను చూసి ప్రిన్సిపల్ భయపడుతుంది. ప్రిన్సిపల్ గారు మీతో మాట్లాడ్డానికి వచ్చి ఇంత సేపు అయింది. మీరేం మాట్లాడరేంటి? అంటుంది భాగీ. అది చెప్పాల్సింది మీరు అంటుంది ప్రిన్సిపల్. మీరు ఫ్రీగా ఉన్నారంటే మాట్లాడతాము అంటున్న భాగీతో నేను కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడదాం అంటుంది.
టైం లేదు మేడం. ఇప్పుడే మీతో మాట్లాడాలి అంటుంది అని భాగీ అనగానే ప్రిన్సిపల్ భయపడుతుంది. రామ్మూర్తితో సొంత పనులు చేయించుకుంటానని భాగీకి తెలిసిపోయినట్టుందని మనసులో అనుకుంటూ ఏదేదో మాట్లాడుతుంది. దీంతో రామ్మూర్తి ప్రిన్సిపల్ గారు నా కూతురు మాట్లాడటానికి వచ్చింది అంజలి పాప గురించి అని చెప్పగానే ప్రిన్సిపల్ కూల్ అవుతుంది.
మనోహరికి పనులు
అంజలి స్కూల్‌కి రాకపోడానికి చాలా పెద్ద రీజన్ ఉందంటూ కథ చెబుతుంది భాగీ. ఇంత ప్రిపేర్ అయ్యే బదులు ఏ కడుపునొప్పో అని చెబితే సరిపోతుంది కదా.. అంటుంది ప్రిన్సిపల్. అందరూ షాక్ అవుతారు. అంజలి ఇంకొక్కసారి ఆబ్సెంట్ అవ్వకుండా చూసుకో అని చెప్పగానే ఇంకేమీ అనరా? అంటూ క్లాస్‌లోకి వెళ్తుంది అంజు.
మరోవైపు మిస్సమ్మ ఇంట్లో లేదు కాసేపు ఇల్లంతా తిరగొచ్చు అనుకుంటూ ఇంట్లోకి వస్తుంది అరుంధతి. హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న శివరామ్‌ని హాయ్ మామయ్యగారు అని పలకరించి అయ్యో మామయ్యగారికి షుగర్‌లెస్ కాఫీ ఇచ్చే టైమ్ అవుతోంది అనుకుంటుంది. ఇంతలో నిర్మల కాఫీ తీసుకుని రావడంతో నీళ్లు తెమ్మంటాడు శివరామ్. అప్పుడే మనోహరి అటువైపు రావడంతో నీళ్లు తెమ్మంటాడు.
మహారాణి అవుదామనుకుంటే
అమర్‌ని పెళ్లి చేసుకుని నేను ఈ ఇంటికి మహారాణి అవుదామనుకుంటే ఈ ముసలోల్లేంటి నన్ను పని మనిషిని చేస్తున్నారు అనుకుంటుంది మనోహరి. ఈ ఇంటికి నిన్ను తీసుకొచ్చి నువ్వెన్ని దుర్మార్గాలు చేసినా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కదే.. ఇంత చేస్తున్నా వాళ్లు ఒక్క గ్లాసు నీళ్లు అడిగినందుకు ఇంతలా తిట్టుకుంటావా? నాకు కనక ప్రాణం ఉంటేనే నా కాలు అడ్డుపెట్టేదాన్ని అంటూ అరుంధతి వెళ్లి కాలు అడ్డంగా పెట్టగానే మనోహరి కిందపడిపోతుంది.
అసలు నేను కింద ఎలా పడ్డాను అని ఆశ్చర్యపోతుంది మనోహరి. అంటే మను కింద పడింది నా కాలు తగిలేనా..? అని షాకవుతుంది అరుంధతి. అదేంటమ్మా అలా కిందపడ్డావు. చూసుకోని నడవాలి కదమ్మా.. రెస్ట్ తీసుకోమ్మంటున్న శివరామ్‌తో బయటకు వెళ్లాలి అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు.
షాక్‌లో శివరామ్
అరుంధతి మాత్రం అసలు ఇదెలా సాధ్యం అయింది. మొన్న కూడా కొబ్బరి బొండం పడాలి అంటే పడిపోయింది. అసలు నిజంగా జరిగిందా? లేక పొరపడుతున్నానా? అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి గ్లాస్ చేత్తో పట్టుకుని షాక్ అవుతుంది. గాల్లోకి లేచిన గ్లాస్‌ను చూసి శివరామ్ షాక్ అవుతాడు. తర్వాత అరుంధతికి స్పర్శ వచ్చిందనే విషయం తెలియకుండా చేయాలని గుప్త ఆలోచిస్తుంటాడు.
ఇంతలో అరుంధతి అక్కడకు వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. అరుంధతి తన శక్తులతో ఏం చేయబోతోంది? మనోహరికి అరుంధతి శక్తుల గురించి ఘోరా ఏం చెబుతాడు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్ 10న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్