Viral Video : ప్రిన్సిపల్‌ను కొట్టిన ఎమ్మెల్యే
ఓ కళాశాల ప్రిన్సిపల్ చెంపై ఎమ్మెల్యే కొట్టడంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
బెంగళూరు, జూన్ 22: కర్ణాటకలోని మాండ్యకు చెందిన జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ను చెంపపై కొట్టిన వైనం వీడియోకు ఎక్కగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మాండ్య జిల్లాలో బుధవారం నల్వాదీ కృష్ణరాజ వడియార్ ఐటీఐ కళాశాలలో ఆధునీకరించిన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది.
ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యే ఆ కళాశాలను పరిశీలిస్తుండగా ప్రిన్సిపల్ నాగానంద్‌ను ఏదో సమాచారం కోరగా.. ఇవ్వడంలో జాప్యం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఆవేశం పట్టలేక చెంపపై కొడుతూ కనిపించారు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు ప్రిన్సిపల్ కూడా లేరని, ఎమ్మెల్యే వచ్చాక పిలిపించారని తెలిసింది.
ప్రిన్సిపల్‌ను తిడుతున్నట్టుగా, రెండుసార్లు చెంపపై కొడుతున్నట్టుగా ఆ వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పక్కనే ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. కాగా ఈ ఘటనపై ప్రిన్సిపల్ ఎలాంటి కంప్లయింట్ దాఖలు చేయలేదు.
దీనిపై కామెంట్ కోరేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు ప్రిన్సిపల్ కూడా ఇష్టపడలేదు. తన విధులను తాను సిన్సియర్‌గా నిర్వర్తించానని, ఆధునీకరించిన ఐటీఐ కళాశాల గురించి ఎమ్మెల్యేతో వివరించేందుకు ప్రయత్నించానని ప్రిన్సిపల్ చెప్పారు.
కాగా మాండ్య జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంభు గౌడ్ మాట్లాడుతూ మాండ్య డిప్యూటీ కమిషనర్ దృష్టికి ఈ ఘటన వివరాలను తీసుకెళ్లినట్టు చెప్పారు.
టాపిక్