NNS October 9th Episode: మనోహరిని అమ్మా అని పిలిచిన అంజు- అవాక్కయిన మను- అమ్ముపై ఘోరా ప్లాన్- భాగీకి దొరికిపోయిన తండ్రి-nindu noorella saavasam serial october 9th episode anju calls manohari as amma nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns October 9th Episode: మనోహరిని అమ్మా అని పిలిచిన అంజు- అవాక్కయిన మను- అమ్ముపై ఘోరా ప్లాన్- భాగీకి దొరికిపోయిన తండ్రి

NNS October 9th Episode: మనోహరిని అమ్మా అని పిలిచిన అంజు- అవాక్కయిన మను- అమ్ముపై ఘోరా ప్లాన్- భాగీకి దొరికిపోయిన తండ్రి

Sanjiv Kumar HT Telugu
Oct 09, 2024 06:00 AM IST

Nindu Noorella Saavasam October 9th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌‌లో మనోహరిని అమ్మా అంటూ పిలుస్తుంది అంజు. దాంతో చతికిలపడిపోతుంది మనోహరి. అరుంధతి, భాగీ కూడా షాక్ అవుతారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌ (NNS 9th October Episode)లో రాథోడ్​ విసిరిన బాల్​ని అరుంధతి పట్టుకుంటుంది. గాల్లో బాల్​ ఆగిపోవడంతో షాక్​ అవుతాడు రాథోడ్​. బాల్​ని రాథోడ్​ వైపు అరుంధతి విసరడంతో భయంతో కారులో ఎక్కి కూర్చుంటాడు.

ఫ్రీజ్ అయిపోయిన మనోహరి

తర్వాత నేను బాల్‌ ఎలా పట్టుకోగలిగాను అని గుప్తను అడుగుతుంది అరుంధతి. నేను ఎలా చెప్పగలను.. మీ మానవులకు అన్ని అనుమానాలే అంటూ తిడుతూ వెళ్తాడు గుప్త. ఈయనను చూస్తుంటే ఏదో తేడాగా ఉంది విషయం ఏంటో నేనే కనిపెడతానంటూ ఆలోచిస్తుంది అరుంధతి. మనోహరి దగ్గరకు అంజు అమ్మా అంటూ వచ్చి పిలుస్తుంది. మనోహరి షాక్‌ అవుతుంది. అంజును చూస్తూ ఫ్రీజ్‌ అయిపోతుంది.

తన కూతురు పుట్టినప్పుడు, తాను ఆశ్రమంలో వదిలేసి వెళ్లినప్పటి విషయాలు గుర్తు చేసుకుంటుంది మనోహరి. ఏం మాట్లాడుతున్నావు అంజు అని అడుగుతుంది మనోహరి. ఏంటమ్మా అలా చూస్తున్నావు. నేను నీ కూతురినే కదా? నేను అమ్మా అనకూడదా? అంటుంది అంజు. కానీ, నన్నెందుకు అమ్మా అంటున్నావు. చెప్పు అంజు నన్నెందుకు అమ్మా అని పిలిచావు అని మనోహరి నిలదీస్తుంది.

మిస్సమ్మను కదా

మిమ్మల్ని ఎవరు అన్నారు ఆంటీ పక్కకు జరగండి అనగానే మనోహరి పక్కకు జరుగుతుంది. వెనకాలే భాగీ ఉంటుంది. నేను అంటున్నది మా అమ్మని.. కాదు నా మిస్సమ్మని అంటుంది అంజు. కాదు అంజు ఇందాక అమ్మా అన్నది నన్నే కదా? అంటే ఆ అమ్మను అంటాను లేదంటే ఈ అమ్మను అంటాను. అమ్మా అంటుంది అంజు. నేను అమ్మను ఏంటి? నేను మిస్సమ్మను కదా? అంటుంది భాగీ.

చూశావా? మిస్సమ్మలోనే అమ్మ ఉంది అని అంజు సెంటిమెంట్‌ డైలాగ్స్‌ చెప్పగానే భాగీ పడిపోతుంది. అంజును ముద్దాడుతుంది. ఇంతలో పిల్లలు వచ్చి పదాలు విడదీసి నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావా? అని అడుగుతారు. దీంతో నలుగురు పిల్లలు గొడవపడతారు. అమర్‌ రాగానే అందరూ కామ్‌‌గా అయిపోతారు. అమర్‌ ఆఫీసుకు వెళ్లొస్తాను అని చెప్పి వెళ్తాడు.

ఇదేమైన ధర్మ సత్రమా

బయట బాల్‌‌తో ఆడుకుంటున్న రాథోడ్‌ ఎన్ని సార్లు పడేసినా బాల్‌ మళ్లీ తిరిగి రాదు. దీంతో ఇరిటేటింగ్‌ అవుతుంటాడు. మరోవైపు రామ్మూర్తి స్కూల్‌‌లో ప్రిన్సిపాల్‌ దగ్గరకు వెళ్లి జాబ్‌ అడుగుతాడు. ఏంటండి ఇది స్కూల్‌ అనుకుంటున్నారా? ధర్మసత్రం అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు మళ్లీ మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్లిపోతారు. ఏంటిది అని అరుస్తుంది ప్రిన్సిపాల్.

పోయిన సారి ఒంట్లో బాగాలేకనే కదండి రాలేకపోయింది అని నచ్చజెప్పుతాడు రామ్మూర్తి. ముసలి వాళ్లు అయితే ఇలాగే ఒంట్లో జబ్బులు ఉంటాయి. మీ లాగా వచ్చే వాళ్లు వందల మంది ఉన్నారు రామ్మూర్తి. మీ లాగా రోగిస్టి వాళ్లను తీసుకోవాల్సిన అవసరం నాకేంటి. అయినా డబ్బుల కోసం మోసం చేసి మరీ నీ కూతురుని అమరేంద్రకు భార్యను చేశావు కదా? అంటుంది ప్రిన్సిపల్.

మానేస్తే ఊరుకోను

మీకున్నా హోదాకి, స్థాయికి మీ నోటి నుంచి రావాల్సిన మాటలు కావు అవి. నేను మానవత్వం ఉన్నవాణ్ని . ఇప్పటికే నేను ఆయనకు చాలా రుణపడిపోయాను. అందుకే నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పని చేద్దామని అనుకుంటున్నాను అని రామ్మూర్తి వేడుకుంటే ప్రిన్సిపాల్‌ సరేనని మరోసారి చెప్పకుండా మానేస్తే ఊరుకోను అంటుంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. నేను మళ్లీ ఇక్కడ పనిలో చేరినట్టు నా కూతురుకు కానీ అమరేద్ర బాబుకు కానీ చెప్పకండి అనగానే ప్రిన్సిపల్‌ సరే అంటుంది.

రామ్మూర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు భాగీ పిల్లల్ని తీసుకుని స్కూల్‌‌కు వస్తుంది. భాగీని చూసిన రామ్మూర్తి గోడ చాటుకు వెళ్లి దాక్కుంటాడు. అయినా రామ్మూర్తిని చూసిన భాగీ నాన్నా అని పిలుస్తుంది. పిల్లలు తాతయ్యా మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. పిల్లల్ని చూడటానికి వచ్చాను అంటాడు. ఇంటికి రావొచ్చు కదా అని అడగ్గానే నేను అక్కడికి వస్తే మీరు నన్ను మొహమాట పెడతారని చెప్తాడు రామ్మూర్తి.

భాగీకి నిజం తెలుస్తుందా? అమ్ముని ఘోరా ఏం చేయబోతున్నాడు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 09న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner