Guntur Kaaram OTT: గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు-netizens disappointed with guntur kaaram kannad tamil dubbing versions streaming on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram Ott: గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు

Guntur Kaaram OTT: గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 10, 2024 09:13 PM IST

Guntur Kaaram OTT Streaming: గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఓ విషయంలో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Guntur Kaaram OTT: గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు
Guntur Kaaram OTT: గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్: ఆ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు

Guntur Kaaram OTT: థియేటర్లలో ఒక భాషలోనే రిలీజైన కొన్ని చిత్రాలు కూడా డబ్బింగ్‍తో వివిధ భాషల్లో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రస్తుత ఓటీటీ యుగంలో ఇది సాధారణమైంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం కూడా ఈ జాబితాలోకి వచ్చింది. థియేటర్లలో తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీ.. నెట్‍ఫ్లిక్స్‌ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్‍లోనూ అందుబాటులోకి వచ్చింది.

గుంటూరు కారం సినిమా ఫిబ్రవరి 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. దీంతో ఓటీటీలోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. అయితే, తెలుగులో అంతా బాగానే ఉన్నా.. డబ్బింగ్ వెర్షన్ విషయంలో ఈ మూవీపై నిరాశ వ్యక్తమవుతోంది.

కన్నడిగుల నిరాశ

గుంటూరు కారం సినిమా కన్నడ వెర్షన్‍పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ట్రాన్స్‌లేషన్‍తో పాటు వాయిస్‍లు కూడా సూటవ్వలేదని చాలా మంది కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందని నిరాశ చెందుతున్నారు. డబ్బింగ్‍ను తూతూ మంత్రంగా కానిచ్చేశారని అభిప్రాయపడుతున్నారు. గుంటూరు కారం తమిళ డబ్బింగ్ విషయంలోనూ కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

‘కుర్చీ మడతపెట్టి’ కూడా..

గుంటూరు కారం చిత్రంలో మాస్ సాంగ్ ‘కుర్చీ మడత పెట్టి’ ఓ ఊపు ఊపేసింది. ఫుల్ పాపులర్ అయింది. అయితే, డబ్బింగ్‍ వెర్షన్‍లలో ఈ సాంగ్ పేలవంగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. అన్ని భాషల ఆడియోలో ఒరిజినల్ సాంగ్ ఉంచేసి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘కుర్చి మడతపెట్టి’ పాట వివిధ భాషల వీడియోలను కలిపి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

మరోవైపు, నెట్‍ఫ్లిక్స్‌లో గుంటూరు కారం తెలుగులో దూసుకెళుతోంది. మంచి వ్యూవర్‌షిప్ దక్కించుకుంటోంది. సినిమాలోని హైలైట్‍లను అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

గుంటూరు కారం చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్, మదర్ సెంటిమెంట్ కలబోతతో ఈ చిత్రాన్ని తెరక్కికించారు. రమణ అనే మాస్ క్యారెక్టర్లో మహేశ్ బాబు దుమ్మురేపగా.. అతడి తల్లి పాత్ర పోషించారు సీనియర్ నటి రమ్యకృష్ణ. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు.

గుంటూరు కారం చిత్రంలో జయరాం, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, రావు రమేశ్, ఈశ్వరి రావు, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిశోర్, రాహుల్ రవీంద్రన్ కీరోల్స్ చేశారు. హారిక హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీని నిర్మించారు.

గుంటూరు కారం చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే, మహేశ్ బాబు స్టార్ డమ్‍తో మంచి వసూళ్లే వచ్చాయి. ఈ చిత్రానికి రూ.200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని మూవీ టీమ్ వెల్లడించింది.

మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‍లో మూవీ చేయనున్నారు. గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండనుంది. రెండు నెలల్లో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. 

Whats_app_banner