Guntur Kaaram OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Guntur Kaaram OTT Release Date: గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Guntur Kaaram OTT Release Date: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా భారీ హైప్ మధ్య సంక్రాంతి బరిలో దిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. సూపర్ స్టార్ పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్ చేయటంతో ఈ మూవీపై అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే, మహేశ్ పర్ఫార్మెన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇక, సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ తీరనుంది.
గుంటూరు కారం సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్ నేడు (ఫిబ్రవరి 4) అధికారికంగా ప్రకటించింది.
“రౌడీ రమణను సినిమాస్కోప్ 70mmలో చూశారు. ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్‌లో చూడండి. ఫిబ్రవరి 9న గుంటూరు కారం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో వస్తుంది” అని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో రౌడీ రమణ అనే క్యారెక్టర్ చేశారు సూపర్ స్టార్ మహేశ్.
నెలలోపే..
గుంటూరు కారం చిత్రం జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, అనుకున్న స్థాయిలో బ్లాక్‍బాస్టర్ టాక్ తెచ్చుకోలేకపోయింది. లాంగ్ రన్ సాధ్యం కాలేదు. దీంతో థియేటర్లలోకి వచ్చిన నెలలోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది ఈ మూవీ. ఫిబ్రవరి 9నే నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది.
గుంటూరు కారం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మూవీ టీమ్ ప్రకటించింది. రీజనల్ మూవీల్లో రికార్డు సృష్టించిందని పోస్టర్లు వెల్లడించింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. మహేశ్ స్టార్ డమ్‍తో మంచి కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా మహేశ్ ఫైట్లు, మాస్ డ్యాన్, డైలాగ్ డెలివరీ ఆక్టటుకున్నాయి.
గుంటూరు కారం సినిమాను మాస్ యాక్షన్‍తో పాటు మదర్ సెంటిమెంట్ ప్రధాన అంశంగా తెరకెక్కించారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే, ఈ చిత్రానికి మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఫ్యామిలీ ఆడియన్స్ చూశాక టాక్ పాజిటివ్‍గా మారిందని మూవీ టీమ్ పేర్కొంది. తాము ఆశించిన స్థాయిలో కలెక్షన్లు బాగా వచ్చాయని నిర్మాత నాగవంశీ ఓ మీడియా సమావేశంలో చెప్పారు.
గుంటూరు కారంలో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి.. హీరోహీరోయిన్లు చేశారు. ఈ చిత్రంలో మహేశ్ తల్లి పాత్రలో నటించారు సీనియర్ నటి రమ్యకృష్ణ. జయరాం, జగపతి బాబు, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్, ఈశ్వరి రావు కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.
గుంటూరు కారం మూవీని హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి మొదట్లో పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ చేయగా.. ఆ తర్వాత ఎక్కువ భాగం మనోజ్ పరమహంస ఆ బాధ్యతను నిర్వహించారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు.