OTT Telugu Comedy Movie: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం
Aay OTT Streaming: ఆయ్ చిత్రం థియేటర్లలో దుమ్మురేపింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ తక్కువ బడ్జెట్ చిత్రం ఓటీటీలో ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చింది. మంచి వ్యూస్‍ను సాధిస్తోంది.
ఆయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం కలెక్షన్లలో దుమ్మురేపింది. నార్నే నితిన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయింది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్య చిన్న మూవీగా వచ్చిన ఆయ్ హిట్ కొట్టి విన్నర్ అయింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఆయ్ చిత్రం దుమ్మురేపుతోంది.
ట్రెండింగ్‍లోకి..
ఆయ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 12న స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్‍లోకి వచ్చేసింది. ప్రస్తుతం (సెప్టెంబర్ 15) ఈ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో మూడో ప్లేస్‍కు దూసుకొచ్చింది.
తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఆయ్ అప్పుడే మూడో ప్లేస్‍కు రావడం విశేషమే. ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. థియేటర్లలో తెలుగులో మాత్రం రిలీజైన ఆయ్.. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‍లలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా వ్యూస్ ఎక్కువగా వచ్చేందుకు తోడ్పడుతోంది.
ఆయ్ చిత్రానికి అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. గోదావరి జిల్లాలోని ఓ విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. కామెడీతో పాటు లవ్ స్టోరీని కూడా మెప్పించేలా రూపొందించారు. ఈ మూవీలో నితిన్, సారికతో పాటు కసిరెడ్డి రాజ్‍కుమార్, అంకిత్ కొయ్య కూడా ముఖ్యమైన రోల్స్ చేశారు. ఈ మూవీలో కామెడీ టైమింగ్‍తో ఆకట్టుకున్న రాజ్‍కుమార్‌కు ప్రశంసలు దక్కాయి.
ఆయ్ కలెక్షన్లు ఇలా..
ఆయ్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలకు నెగెటివ్ రెస్పాన్స్ రావటం కూడా ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది. ఈ చిత్రానికి క్రమంగా థియేటర్ల సంఖ్య, కలెక్షన్లు కూడా పెరిగాయి ఆయ్ చిత్రం ఫుల్ థియేట్రికల్ రన్‍లో సుమారు రూ.14కోట్ల కలెక్షన్లు సాధించింది. రూ.5కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. మ్యాడ్ తర్వాత నార్నే నితిన్ మరో సక్సెస్ సాధించారు.
ఆయ్ మూవీని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్, విద్యా కొప్పినీడి ప్రొడ్యూజ్ చేశారు. అల్లు అరవింద్ ఈ మూవీని సమర్పించారు. ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందించగా.. సమీర్ కల్యాణి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ మూవీకి సంగీతం, కెమెరా పనితనం కూడా బాగా ప్లస్ అయ్యాయి.
మిస్టర్ బచ్చన్ కూడా నెట్‍ఫ్లిక్స్‌లో..
థియేటర్లలో పోటీ పడిన మిస్టర్ బచ్చన్, ఆయ్ చిత్రాలు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ ఒకే రోజు అడుగుపెట్టాయి. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ కూడా సెప్టెంబర్ 12వ తేదీనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీ కూడా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో స్ట్రీమ్ అవుతోంది. మిస్టర్ బచ్చన్ ట్రెండ్ అవుతున్నా.. నెగెటివ్ రెస్పాన్సే వస్తోంది. ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా సోషల్ మీడియాలో కొందరు ఈ చిత్రాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు.