Malayalam OTT Releases in March 2024: ఓటీటీల్లోకి మార్చి నెలలో రాబోతున్న మలయాళం సినిమాలు ఇవే-malayalam ott releases in march 2024 bramayugam premalu manjummel boys anweshippan kendethum in netflix sony liv hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Ott Releases In March 2024: ఓటీటీల్లోకి మార్చి నెలలో రాబోతున్న మలయాళం సినిమాలు ఇవే

Malayalam OTT Releases in March 2024: ఓటీటీల్లోకి మార్చి నెలలో రాబోతున్న మలయాళం సినిమాలు ఇవే

Hari Prasad S HT Telugu
Feb 28, 2024 11:53 AM IST

Malayalam OTT Releases in March 2024: మార్చి నెలలో ఓటీటీల్లోకి కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, అన్వేషిప్పిన్ కండెతుమ్ లాంటి సినిమాలు ఉన్నాయి.

మార్చిలో ఓటీటీలోకి రాబోతున్న మలయాళం మూవీ మంజుమ్మెల్ బాయ్స్
మార్చిలో ఓటీటీలోకి రాబోతున్న మలయాళం మూవీ మంజుమ్మెల్ బాయ్స్

Malayalam OTT Releases in March 2024: మలయాళం సినిమాలకు క్రమంగా క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇండస్ట్రీ నుంచి కొత్తగా వచ్చే సినిమాల ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమధ్యే మోహన్ లాల్ నటించిన మలైకొట్టై వాలిబన్ సినిమా రాగా.. మార్చి నెలలో మరో నాలుగు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, సోనీలివ్ లాంటి ఓటీటీల్లోకి ఈ సినిమాలు రాబోతున్నాయి.

మార్చి నెలలో ఓటీటీల్లోకి వస్తున్న మలయాళ సినిమాలు

మార్చి నెలలో ఓటీటీల్లోకి రాబోతున్న మలయాళ సినిమాల్లో ఈ మధ్యే బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించినవి ఉన్నాయి. వీటిలో ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ లాంటి సినిమాలు ఉండటం విశేషం. ఇందులో రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లోకే వస్తున్నాయి.

ప్రేమలు - నెట్‌ఫ్లిక్స్

కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకుపైగా వసూలు చేసిన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నస్లేన్ గఫూర్, మమితా బైజు నటించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్ష్ దక్కించుకుంది. ఈ సినిమా మార్చి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భ్రమయుగం - సోనీ లివ్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ భ్రమయుగం మూవీ ఫిబ్రవరి 15న థియేటర్లలో రిలీజై మంచి హిట్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 13 రోజుల్లోనే రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేసిన ఈ డార్క్ ఫ్యాంటసీ హారర్ మూవీ మార్చి నెలాఖరులో సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

అన్వేషిప్పిన్ కండెతుమ్ - నెట్‌ఫ్లిక్స్

మలయాళ నటుడు టొవినో థామస్ నటించిన మర్డర్ మిస్టరీ మూవీ ఇది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఓ హత్య, దానిని పరిష్కరించడానికి ప్రయత్నించే ఓ పోలీసు అధికారి, ఆ హత్య వెనుక ఉన్న రహస్యాన్ని దాచి పెట్టడానికి రాజకీయంగా వచ్చే ఒత్తిళ్లతో ఈ అన్వేషిప్పిన్ కండెతుమ్ మూవీ ఇంట్రెస్టింగా సాగుతుంది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ సినిమా కూడా మార్చి నెలాఖరుకల్లా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

మంజుమ్మెల్ బాయ్స్ - డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మలయాళం మూవీ. నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా ఈ మంజుమ్మెల్ బాయ్స్ మూవీని తెరకెక్కించారు. చిదంబరం ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. తమిళనాడులో వెకేషన్ కు వెళ్లిన కొందరు స్నేహితుల్లో ఒకరు అక్కడి ఓ గుహలో పడిపోతాడు. మిగిలిన స్నేహితులు అతన్ని ఎలా రక్షిస్తారన్నది ఈ మూవీ స్టోరీ. ఈ మంజుమ్మెల్ బాయ్స్ మూవీ మార్చి చివరి వారం లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.