Devil OTT Release: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న పూర్ణ హార‌ర్ మూవీ - రిలీజ్ డేట్ ఇదే-poorna mysskin devil movie ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Poorna Mysskin Devil Movie Ott Release Date Locked

Devil OTT Release: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న పూర్ణ హార‌ర్ మూవీ - రిలీజ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Feb 28, 2024 11:11 AM IST

Devil OTT Release: పూర్ణ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ డెవిల్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మార్చి 1న ఈ మూవీ టెంట్‌కోటాతో పాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

పూర్ణ  త‌మిళ మూవీ డెవిల్
పూర్ణ త‌మిళ మూవీ డెవిల్

Devil OTT Release date: పూర్ణ హీరోయిన్‌గా న‌టించిన హార‌ర్ మూవీ డెవిల్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మార్చి 1న ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. టెంట్‌కోటా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో డెవిల్‌ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి ఆథియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు మిస్కిన్ డెవిల్ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మిస్కిన్ కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు.

పూర్ణ లీడ్ రోల్‌...

డెవిల్ మూవీలో పూర్ణ‌తో పాటు మ‌రో టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీల‌క పాత్ర పోషించాడు. విదార్థ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ఫిబ్ర‌వ‌రి 2న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఫెయిలైంది. పూర్ణ‌, త్రిగుణ్ ఇద్ద‌రు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే కావ‌డంతో టాలీవుడ్‌లోనూ డెవిల్ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

హౌస్‌వైఫ్ క‌థ‌...

డెవిల్ మూవీలో హేమ అనే గృహిణిగా పూర్ణ క‌నిపించింది. హేమా భ‌ర్త అలెక్స్ ఓ ఫేమ‌స్ లాయ‌ర్‌. అత‌డో స్త్రీలోలుడు. త‌న ఆఫీస్‌లోనే ప‌నిచేసే సోఫియా అనే అమ్మాయితో రిలేష‌న్‌షిప్ కొన‌సాగిస్తుంటాడు. ఓ యాక్సిడెంట్ ద్వారా హేమ జీవితంలోకి రోష‌న్ వ‌స్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? రోష‌న్‌, హేమ‌ల బంధం గురించి తెలిసి అలెక్స్ ఏం చేశాడు? అన్న‌దే ఈ మూవీ డెవిల్ మూవీ క‌థ‌. పూర్ణ న‌ట‌న బాగున్నా రొటీన్ స్టోరీ కార‌ణంగా డెవిల్ క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిల‌చింది. థియేట‌ర్ల‌లో కోటి లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

మిస్కిన్ క్రేజ్‌...

మిస్కిన్ సినిమాల‌కు ఉన్న క్రేజ్ కార‌ణంగా రిలీజ్‌కు ముందు డెవిల్‌పై కోలీవుడ్ ఆడియెన్స్‌లో భారీగా ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి.కానీ ఈ మూవీ ఆడియెన్స్‌ను పూర్తిగా డిస‌పాయింట్ చేసింది. డెవిల్ మూవీ డైరెక్ట‌ర్ ఆథియా మిస్కిన్ సోద‌రుడు కావ‌డం గ‌మ‌నార్హం. డెవిల్ సినిమాకు మ్యూజిక్ అందిస్తూనే ఇందులో గెస్ట్ రోల్‌లో మిస్కిన్ క‌నిపించాడు.డెవిల్ మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత పూర్ణ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు ఈ సినిమా విజ‌యాన్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయింది.

అఖండ‌, ద‌స‌రా...

అల్ల‌రి న‌రేష్ సీమ‌ట‌పాకాయ్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పూర్ణ‌. అవును, ల‌డ్డుబాబు, రాజుగారి గ‌దితో పాటుచాలా సినిమాలు చేసింది. ఓ వైపు హీరోయిన్‌గా న‌టిస్తూనే అఖండ‌, దృశ్యం 2, ద‌స‌రాతో పాటు ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌లో డిఫ‌రెంట్ రోల్స్ చేసింది. సంక్రాంతికి రిలీజైన మ‌హేష్ బాబు గుంటూరు కారంలో స్పెష‌ల్ సాంగ్‌లో ఆడిపాడింది పూర్ణ‌. ఢీ 16 సీజ‌న్ డ్యాన్స్ షోకు జ‌డ్జ్‌గా పూర్ణ వ్య‌వ‌హ‌రిస్తోంది.

చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు...

తెలుగులో త్రిగుణ్ చాలా సినిమాలు చేశాడు. చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు, 24 కిసెస్‌, డియ‌ర్ మేఘ‌, కొండ‌తో పాటు వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేసినా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకోలేక‌పోయాడు. ఇటీవ‌లే నివేదిత అనే అమ్మాయిని పెళ్లిచేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు త్రిగుణ్‌. ప్ర‌స్తుతం గంజామ్‌, కిరాయితో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తున్నాడు.

IPL_Entry_Point