Devil Movie OTT: డెవిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే..-devil ott release date kalyan ram latest movie will stream on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devil Movie Ott: డెవిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే..

Devil Movie OTT: డెవిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోపే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 13, 2024 03:38 PM IST

Devil Movie OTT Release Date: డెవిల్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో రిలీజైన 20 రోజులలోపే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఆ వివరాలివే..

డెవిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు
డెవిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు

Devil Movie OTT Release Date: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘డెవిల్’ సినిమా గత నెల డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ అయింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా.. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్‍లైన్‍తో ఈ మూవీ చాలా ఆసక్తిని కలిగించింది. మంచి అంచనాల మధ్య రిలీజైన డెవిల్‍కు ఆరంభం నుంచి ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చింది. అభిషేక్ నామా ఈ మూవీని నిర్మించటంతో పాటు దర్శకత్వం వహించారు. డెవిల్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చింది.

డెవిల్ సినిమా రేపు (జనవరి 14) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ఓటీటీలో అడుగుపెడుతోంది. డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజైన డెవిల్.. 17 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.

డెవిల్ చిత్రం జనవరి 14న తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్‍కు వస్తుందని, త్వరలోనే మలయాళం కన్నడ వెర్షన్‍లను కూడా తీసుకొస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది.

డెవిల్ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‍గా నటించారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో మాళవిక నాయర్, ఎడ్వర్డ్ సొనెన్‍బ్లిక్, ఎల్నాజ్ నొరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య కీలకపాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతం అందించారు.

డెవిల్ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించారు. ఆయనే దర్శకత్వం వహించారు. ఈ మూవీకి తొలుత నవీన్ మేడారం డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే, ఆ తర్వాత విభేదాల వల్ల ఈ ప్రాజెక్టుకు నవీన్ దూరమయ్యారు. దీంతో అభిషేక్ నామానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విసా కథ అందించారు.

ఇదీ డెవిల్ మూవీ స్టోరీ

బ్రిటీష్ పాలనలో ఉన్న రాసపాడులో జమిందార్ కూతురు విజయ (అమ్ము అభిరామి) అనుమానాస్పద రీతిలో హత్యకు గురవుతుంది. ఈ హత్య మిస్టరీని విచారించే బాధ్యతను సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కల్యాణ్ రామ్)కు బ్రిటీష్ పాలకులు అప్పగిస్తారు. రాసపాడుకు వెళ్లి దర్యాప్తు చేస్తాడు డెవిల్. అయితే, ఈ క్రమంలో చాలా షాకింగ్ విషయాలను గుర్తిస్తాడు. ఈ కేసు దర్యాప్తు క్రమంలోనే డెవిల్‍కు ‘ఆపరేషన్ టైగర్ హంట్’ మిషన్‍ను బ్రిటీష్ ప్రభుత్వం ఇస్తుంది. అసలు జమిందారు కూతురిని చంపింది ఎవరు? ఆపరేషన్ టైగర్ హంట్ దేని గురించి? ఆ హత్యకు ఈ మిషన్‍కు ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలే డెవిల్ చిత్రంలో ప్రధాన కథగా ఉన్నాయి.

డెవిల్‍కు సీక్వెల్ కూడా..

డెవిల్ సినిమాకు సీక్వెల్ కూడా తీసుకురానున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. డెవిల్ సక్సెస్ సెలెబ్రేషన్లలో ఈ ప్రకటన చేశారు హీరో కల్యాణ్ రామ్. డెవిల్ 2 సినిమాలో 1940లు, 2000 దశకం రెండూ కనిపిస్తాయని చెప్పారు. అంటే.. బ్రిటీష్ కాలం, ప్రస్తుతం కాలం మధ్య నడిచే స్టోరీగా సీక్వెల్ ఉండనుందని హింట్ ఇచ్చారు. 2025లో డెవిల్ 2 రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తామని కల్యాణ్ రామ్ తెలిపారు.

IPL_Entry_Point