Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల హార‌ర్ మూవీకి “ఏ” స‌ర్టిఫికెట్ - తంత్ర యూనిట్ వార్నింగ్‌-ananya nagalla horror movie tantra gets a certificate by censor release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల హార‌ర్ మూవీకి “ఏ” స‌ర్టిఫికెట్ - తంత్ర యూనిట్ వార్నింగ్‌

Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల హార‌ర్ మూవీకి “ఏ” స‌ర్టిఫికెట్ - తంత్ర యూనిట్ వార్నింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 23, 2024 01:12 PM IST

Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల హీరోయిన్‌గా న‌టిస్తోన్న హార‌ర్ మూవీ తంత్రకు సెన్సార్ “ఏ” స‌ర్టిఫికెట్ ఇచ్చింది. త‌మ సినిమాకు “ఏ” స‌ర్టిఫికెట్ రావ‌డంపై యూనిట్ డిఫ‌రెంట్‌గా రియాక్ట్ అయ్యింది.

అన‌న్య నాగ‌ళ్ల
అన‌న్య నాగ‌ళ్ల

Ananya Nagalla: అన‌న్య నాగ‌ళ్ల హీరోయిన్ న‌టిస్తోన్న‌ హార‌ర్ మూవీ తంత్ర రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. మార్చి 15న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ మేక‌ర్స్ వెరైటీగా అనౌన్స్‌చేశారు. ఈ సినిమా సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ నుంచి తమ సినిమాకు “A” సర్టిఫికేట్ రావడంపై 'తంత్ర' టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దు. ఎందుకుంటే మాది ఏ సినిమా అంటూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. A లెట‌ర్‌ను హైటైల్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఈ పోస్ట‌ర్‌లో లంగా వోణీ ధ‌రించి ట్రెడిష‌న‌ల్ లుక్‌లో అన‌న్య నాగ‌ళ్ల క‌నిపిస్తోంది.

భ‌య‌పెట్టే మూవీ...

హార‌ర్‌ ఎలిమెంట్స్‌తో ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఈ సినిమా థ్రిల్ క‌లిగిస్తుంద‌ని, సినిమాలోని చాలా సీన్స్ భ‌య‌పెడ‌తాయ‌ని, చిన్న పిల్ల‌లు ఈ సినిమాకు రావ‌ద్ద‌ని హెచ్చ‌రించ‌డానికే ఈ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ప‌ల్లెటూరి అమ్మాయిగా...

ఇటీవ‌ల తంత్ర టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించింది. తాంత్రిక శాస్త్రంలో ఊహ‌కు అంద‌ని ఎన్నో ర‌హ‌స్యాలున్నాయ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గోపిశెట్టి తంత్ర సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ప‌ల్లెటూళ్ల‌లో క్షుద్ర‌పూజ‌లు, చేత‌బ‌డులు ఎలా ఉంటాయ‌న్న‌ది ఇందులో చూపించ‌బోతున్నారు.

స‌లోనీ రీఎంట్రీ...

తంత్ర సినిమాలో మ‌ర్యాద రామ‌న్న ఫేమ్ స‌లోనీ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. తంత్ర సినిమాతోనే చాలా రోజుల త‌ర్వాత స‌లోనీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆమె క్యారెక్ట‌ర్ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. దివంగ‌త న‌టుడు శ్రీహ‌రి కుటుంబం నుంచి వ‌చ్చిన ధ‌నుష్ ర‌ఘుముద్రి హీరోగా తంత్ర మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

టెంప‌ర్ వంశీ, మీసాల ల‌క్ష్మ‌ణ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. నరేష్ బాబు, రవిచైతన్య తంత్ర సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. క్షుద్ర‌పూజ‌లు, చేత‌బ‌డుల కాన్సెప్ట్‌తో ఇటీవ‌ల రిలీజైన మా ఊరి పొలిమేర 2 మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ట‌యింది. ఆ కాన్సెప్ట్‌తోనే తంత్ర మూవీ కూడా తెర‌కెక్కుతోంది.

అచ్చ తెలుగు అమ్మాయిగా...

అచ్చ తెలుగు హీరోయిన్‌గా మ‌ల్లేషం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అన‌న్య నాగ‌ళ్ల‌. తొలి సినిమాలోనే స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న‌ది. మ‌ల్లేషం హిట్ట‌యిన అన‌న్య నాగ‌ళ్ల‌కు పెద్ద సినిమాల్లో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటూ ట్రెడిష‌న‌ల్ హీరోయిన్ రోల్స్ ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది అన‌న్య నాగ‌ళ్ల‌.

వ‌కీల్ సాబ్ లో…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ ఓ కీల‌క పాత్ర చేసింది. ఆ త‌ర్వాత స‌మంత శాకుంత‌ల‌, నితిన్ మాస్ట్రో సినిమాలో డిఫ‌రెంట్ రోల్స్‌తో ఆక‌ట్టుకుంటుంది. హీరోయిన్‌గా చిన్న సినిమాల్లో ఎక్కువ‌గా న‌టిస్తోంది. ప్లేబ్యాక్‌, అన్వేషి, మ‌ళ్లీ పెళ్లితో పాటు ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. బిగ్‌బాస్ సోహెల్ హీరోగా న‌టించిన బూట్‌క‌ట్ బాల‌రాజు ఓ పాత్ర‌లో అన‌న్య నాగ‌ళ్ల త‌ళుక్కున మెరిసింది. ప్ర‌స్తుతం తెలుగులో పొట్టేల్ అనే సినిమా చేస్తోంది అన‌న్య నాగ‌ళ్ల‌.

టాపిక్