Ritika Singh: నేరుగా ఓటీటీలోకి రితికా సింగ్ తెలుగు హార‌ర్‌ మూవీ వ‌ళ‌రి - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌!-tollywood news ritika singh horror movie valari to stream on etv win ott from march 6th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ritika Singh: నేరుగా ఓటీటీలోకి రితికా సింగ్ తెలుగు హార‌ర్‌ మూవీ వ‌ళ‌రి - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌!

Ritika Singh: నేరుగా ఓటీటీలోకి రితికా సింగ్ తెలుగు హార‌ర్‌ మూవీ వ‌ళ‌రి - స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Feb 13, 2024 05:57 AM IST

Ritika Singh: రితికా సింగ్‌, శ్రీరామ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న వ‌ళ‌రి మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చి 6న ఈటీవీ విన్‌లో ఈ హార‌ర్ మూవీ రిలీజ్ కాబోతోంది.

రితికా సింగ్‌
రితికా సింగ్‌

Ritika Singh: గురు ఫేమ్ రితికా సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ వ‌ళ‌రి థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారాఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో మార్చి 6 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. వ‌ళ‌రి రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ అనౌన్స్‌చేసింది. రితికా సింగ్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో రితికా సింగ్ వెనుక ద‌య్యం రూపంలో మ‌రో అమ్మాయి క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

వ‌ళ‌రిలో దివ్య అనే యువ‌తిగా రితికా సింగ్ క‌నిపించ‌బోతున్న‌ది. దివ్య‌...ద‌యాగుణం గ‌ల అమ్మాయి. ప్ర‌తి ఒక్క‌రితో మంచిగా ఉంటుంది. కానీ ప్ర‌పంచానికి తెలియ‌ని ఓ గ‌తం ఆమె జీవితంలో దాగుంది. అదేమిటి అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క‌లిగిస్తున్నారు మేక‌ర్స్‌. క్యాప్ష‌న్ చూస్తుంటే డిఫ‌రెంట్ షేడ్స్‌తో రితికా సింగ్ క్యారెక్ట‌ర్ క‌నిపించ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

కెప్టెన్ న‌వీన్ నాయుడు

వ‌ళ‌రి మూవీకి మ్రితికా సంతోషిణి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. రైట‌ర్ అయిన మ్రితికా వ‌ళ‌రి మూవీతోనే డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో శ్రీరామ్ హీరోగా న‌టిస్తోన్నాడు. కెప్టెన్ న‌వీన్ నాయుడు అనే నేవీ ఆఫీస‌ర్‌గా వ‌ళ‌రి మూవీలో అత‌డు క‌నిపించ‌బోతున్నాడు. సుబ్బ‌రాజు, ఉత్తేజ్ కీల‌క పాత్రల‌ను పోషిస్తున్నారు.ఔట్ అండ్ ఔట్ హార‌ర్ క‌థాంశంతో వ‌ళ‌రి మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. క‌థ‌లో అంత‌ర్లీనంగా ఓ దేశ‌భ‌క్తి పాయింట్‌ను ట‌చ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వ‌ళ‌రి ఆయుధం...

వ‌ళ‌రి మూవీతోనే రితికా సింగ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. 2018లో రిలీజైన నీవెవ‌రో త‌ర్వాత టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై రితికా సింగ్ క‌నిపించ‌లేదు. దాదాపు ఆరేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ళ‌రితో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది. వ‌ళ‌రిని త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు సంప్ర‌దాయ‌ ఆయుధంగా ఉప‌యోగిస్తుంటారు. 1800 ద‌శ‌కంలో బ్రిటీష్ ప్ర‌భుత్వం ఈ ఆయుధాన్ని నిషేధించింది. ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

తెలుగులో గురు...

మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ప్లేయ‌ర్‌గా రితికా సింగ్ కెరీర్ మొద‌లైంది. 2009 ఏషియ‌న్ ఇండోర్ గేమ్స్‌లో పాల్గొన్న‌ది. అనుకోకుండా త‌మిళ మూవీ ఇరుదుసుట్రుతో హీరోయిన్‌గా మారింది.ఈ సినిమాలో బాక్స‌ర్ రోల్ కోసం చాలా మందిని ఆడిష‌న్ చేసిన డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర చివ‌ర‌కు రితికా సింగ్‌ను సెలెక్ట్ చేసింది.

తొలి సినిమాతోనే చ‌క్క‌టి న‌ట‌న‌తో అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్న‌ది. ఇరుదుసుట్రు సినిమాను హిందీలో సాలాఖుదూస్ పేరుతో రిలీజ్ చేయ‌గా అక్క‌డ పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ తెలుగులో గురు పేరుతో రీమేక్ చేశారు. వెంక‌టేష్ హీరోగా న‌టించిన ఈ మూవీతోనే రితికా సింగ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ర‌జ‌నీకాంత్ మూవీలో...

గురు త‌ర్వాత తెలుగులో నీవెవ‌రో అనే సినిమా చేసింది. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిల‌వ‌డంతో టాలీవుడ్‌కు దూర‌మైంది రితికా సింగ్ త‌మిళంలో ఓ మై క‌డావులే, శివ‌లింగ‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది. దుల్క‌ర్ స‌ల్మాన్ కింగ్ ఆఫ్ కోతాలో ఐటెంసాంగ్‌లో న‌టించింది.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ వెట్టైయాన్‌లో రితికా సింగ్ ఓ యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్‌లో రితికా సింగ్ గాయ‌ప‌డింది. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది రితికా సింగ్‌. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, రానా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్