Malayalam Films: మరో బ్లాక్‍బాస్టర్.. ఒకే నెలలో మూడో సూపర్ హిట్.. ఫుల్ జోష్‍లో మలయాళ ఇండస్ట్రీ-manjummel boys getting huge collection after bramayugam premalu third blockbuster in february for malayalam cinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Manjummel Boys Getting Huge Collection After Bramayugam Premalu Third Blockbuster In February For Malayalam Cinema

Malayalam Films: మరో బ్లాక్‍బాస్టర్.. ఒకే నెలలో మూడో సూపర్ హిట్.. ఫుల్ జోష్‍లో మలయాళ ఇండస్ట్రీ

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2024 02:10 PM IST

Malayalam Movies in February: ఫిబ్రవరి నెల మలయాళం సినిమా ఇండస్ట్రీకి అద్భుతంగా కలిసి వచ్చింది. ఏకంగా మూడు సినిమాలు బ్లాక్‍బాస్టర్ అయ్యాయి. తక్కువ బడ్జెట్‍తో వచ్చి భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి.

Malayalam Movies: మరో బ్లాక్‍బాస్టర్.. ఒకే నెలలో మూడో సూపర్ హిట్.. ఫుల్ జోష్‍లో మలయాళ ఇండస్ట్రీ
Malayalam Movies: మరో బ్లాక్‍బాస్టర్.. ఒకే నెలలో మూడో సూపర్ హిట్.. ఫుల్ జోష్‍లో మలయాళ ఇండస్ట్రీ

Malayalam Cinema: మలయాళ సినీ ఇండస్ట్రీ (మల్లువుడ్) ఫుల్ జోష్‍లో ఉంది. ఫిబ్రవరి నెలలో హ్యాట్రిక్ బ్లాక్‍బాస్టర్లతో కళకళలాడుతోంది. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన మూడు చిత్రాలు ఈనెలలో బంపర్ కలెక్షన్లతో ఆశ్చర్యపరుస్తున్నాయి. డిఫరెంట్ జానర్లలో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్‍లుగా కొనసాగుతున్నాయి. ఈనెలలో ప్రేమలు, భ్రమయుగం.. తాజాగా మంజుమెల్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

మంజుమెల్ బాయ్స్

మంజుమెల్ బాయ్స్ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. సర్వైవర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు చిదంబర్ పీ పొందువేల్. సౌబిన్ షశీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్, దీపక్ ప్రమబోల్ ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు రూ.5కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసి సంచలనం సృష్టిస్తోంది.

మంజుమెల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా దూసుకెళుతోంది. తక్కువ తెరకెక్కి భారీ వసూళ్లను దక్కించుకుంటోంది. స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్‍కు వెళ్లడం, అక్కడ వారికి ఎదురైన సవాళ్ల చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఈ సర్వైవల్ మూవీకి వసూళ్లతో పాటు భారీ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయి. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో కలెక్షన్లు జోరు మరింత కొనసాగే అవకాశం ఉంది.

భ్రమయుగం

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన భ్రమయుగం కూడా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. తక్కువ బడ్జెట్‍తోనే ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈ చిత్రం మలయాళంలో ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.55 కోట్ల వసూళ్లను దాటింది. ఇంకా జోరు చూపిస్తోంది. ఈ చిత్రానికి రాహుల్ సదాశివం దర్శకత్వం వహించారు.

భ్రమయుగం సినిమాలో మమ్ముట్టి నటన, ఉత్కంఠ భరిత కథనం, టెక్నికల్ అంశాలు అద్భుతంగా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‍లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రలు పోషించారు.

భ్రమయుగం సినిమా తెలుగు డబ్బింగ్‍లోనూ ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంటోంది.

ప్రేమలు

మలయాళ సినీ ఇండస్ట్రీలో ‘ప్రేమలు’ సినిమా సెన్సేషనల్ హిట్‍గా దూసుకెళుతోంది. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చిన ఈ లవ్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. రూ.60 కోట్ల కలెక్షన్లను ఈ చిత్రం దాటేసింది. ఇంకా వసూళ్ల హవా నడుస్తోంది. సుమారు రూ.4కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో ఆశ్చర్య పరుస్తోంది.

ప్రేమలు సినిమాలో నెల్సన్ కే గఫూర్, మమితా బజు ప్రధాన పాత్రలు పోషించారు. ఫీల్ గుడ్ లవ్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు గిరీశ్ ఏడీ. ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలిచి.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో ప్రేమలు రూపొందింది. తెలుగు డబ్బింగ్‍లోనూ ఈ చిత్రం మార్చి 8వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రేమలు, భ్రమయుగం, మంజుమెల్ బాయ్స్ సినిమాలతో ఫిబ్రవరిలో మలయాళ ఇండస్ట్రీకి హ్యాట్రిక్ బ్లాక్‍బాస్టర్లు దక్కాయి. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన మూడు చిత్రాలు భారీ వసూళ్లతో సత్తాచాటుతున్నాయి.

WhatsApp channel