Low Budget Malayalam Movies: ఈ మలయాళం సినిమాల బడ్జెట్ తక్కువ.. బాక్సాఫీస్ వసూళ్లు భారీగా.. ప్రేమలు మూవీలాగే..-low budget malayalam movies box office collections are huge like premalu mollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Low Budget Malayalam Movies: ఈ మలయాళం సినిమాల బడ్జెట్ తక్కువ.. బాక్సాఫీస్ వసూళ్లు భారీగా.. ప్రేమలు మూవీలాగే..

Low Budget Malayalam Movies: ఈ మలయాళం సినిమాల బడ్జెట్ తక్కువ.. బాక్సాఫీస్ వసూళ్లు భారీగా.. ప్రేమలు మూవీలాగే..

Hari Prasad S HT Telugu
Feb 25, 2024 04:02 PM IST

Low Budget Malayalam Movies: మలయాళం సినిమాలంటే కంటెంట్ నే నమ్ముకొని తక్కువ బడ్జెట్ తో మంచి వసూళ్లు సాధిస్తాయని పేరుంది. తాజాగా ప్రేమలు మూవీ దీనికి నిదర్శనం. మరి ఇలాంటి సినిమాలు గతంలో ఏమున్నాయో చూడండి.

మలయాళంలో తక్కువ బడ్జెట్ తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించిన ప్రేమమ్ మూవీ
మలయాళంలో తక్కువ బడ్జెట్ తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షం కురిపించిన ప్రేమమ్ మూవీ

Low Budget Malayalam Movies: భారీ బడ్జెట్, మితిమీరిన ఎలివేషన్ల కంటే కంటెంటే కింగ్ అని నిరూపించడంలో మలయాళం సినిమాలను మించినవి లేవు. తాజాగా వచ్చిన ప్రేమలు మూవీయే దీనికి నిదర్శనం. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తొలి రెండు వారాల్లోనే రూ.50 కోట్ల వరకూ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. అయితే మలయాళ సినిమాల్లో గతంలోనూ ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి.

లో బడ్జెట్.. హై ప్రాఫిట్స్

మలయాళంలో చాలా తక్కువ బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కేరళలోనే అధిక భాగం షూటింగ్ లు జరుపుకుంటూ కంటెంట్ నే నమ్ముకొని నిలబడ్డాయి. అలాంటి సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

అనియత్తిప్రావు (1997)

మలయాళంలో 1997లో రిలీజైన అనియత్తిప్రావు అనే మూవీ కేవలం రూ.79 లక్షల బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసింది. ఇదే సినిమాను హిందీలో డోలీ సజాకే రఖ్నా పేరుతో రీమేక్ చేశారు. మాలీవుడ్ లోని పెద్ద హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది.

తన్నీర్ మాతన్ దినంగళ్ (2019)

తాజాగా వచ్చిన ప్రేమలు మూవీలాగే రొమాంటిక్ కామెడీ అయిన ఈ తన్నీర్ మాతన్ దినంగళ్ మూవీ 2019లో రిలీజైంది. అప్పట్లో రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.45 కోట్లు వసూలు చేసింది. జైసన్ అనే ఓ హైస్కూలు పిల్లాడి చుట్టూ తిరిగే కథ ఇది.

ఆది కప్యారె కూటమణి (2015)

2015లో వచ్చిన జాన్ వర్గీస్ మూవీ ఇది. కామెడీ జానర్ లో రూపొందిన సినిమానే అయినా థ్రిల్లింగ్ క్లైమ్యాక్స్ తో ఆకట్టుకున్న ఈ ఆది కప్యారె కూటమణి మూవీ కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసింది.

నేరం (2013)

మలయాళంతోపాటు తమిళంలోనూ ఒకేసారి రూపొందించిన ఈ నేరం సినిమా మొత్తాన్నీ చెన్నైలోని మందవేలిలోనే షూట్ చేశారు. కేవలం రూ.1.5 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం రూ.18 కోట్లు వసూలు చేసింది.

అమర్ అక్బర్ ఆంతోనీ (2015)

2015లో వచ్చిన అమర్ అక్బర్ ఆంతోనీ ఓ కామెడీ థ్రిల్లర్ మూవీ. నాదిర్షా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. రూ.6.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మలయాళం మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసింది.

ప్రేమమ్ (2015)

ఈ మలయాళ రొమాంటిక్ మూవీ గురించి తెలియని వాళ్లు ఉండరేమో. అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2015లో రిలీజైన ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా నిలిచింది. ప్రేమమ్ బడ్జెట్ రూ.4 కోట్లు కాగా.. రూ.60 కోట్లు వసూలు చేసింది.