Krishna mukunda murari march 18th: రూపం మార్చుకున్న ముకుంద.. భయంతో వణికిన మధు, ఒకరినొకరు కొట్టుకున్న మురారి, ఆదర్శ్-krishna mukunda murari serial march 18th episode mukunda tries to scare murari and madhu by pretending to be a devil ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Krishna Mukunda Murari Serial March 18th Episode Mukunda Tries To Scare Murari And Madhu By Pretending To Be A Devil

Krishna mukunda murari march 18th: రూపం మార్చుకున్న ముకుంద.. భయంతో వణికిన మధు, ఒకరినొకరు కొట్టుకున్న మురారి, ఆదర్శ్

Gunti Soundarya HT Telugu
Mar 18, 2024 07:38 AM IST

Krishna mukunda murari serial march 18th episode: కృష్ణ, మురారిని దూరం చేసేందుకు ముకుంద ప్లాన్ చేస్తుంది. దెయ్యంగా వచ్చి మురారికి వార్నింగ్ ఇస్తుంది. అటు తన ముకుంద చావుకి నీ భార్య కారణం అంటూ ఆదర్శ్ మాటలకు మురారి తన మీదకి వెళతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 18వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 18వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial march 18th episode: మురారి ముకుంద కనిపించడం గురించి ఆలోచిస్తాడు. కృష్ణ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నారని అడుగుతుంది. నేను తప్పు చేశాను కృష్ణ. ముకుంద చనిపోవడానికి, ఆదర్శ్ ఇలా అయిపోవడానికి నేను కారణం కాదు కదా అంటాడు. మీరు ఎందుకు అలా అనుకుంటారు ఒకరి తలరాతకు మరొకరు ఎప్పుడూ కారణం కాదని సర్ది చెప్తుంది. పైకి కనిపిస్తున్న కారణాలు నావైపు వేలెత్తి చూపిస్తున్నాయి ఒకప్పుడు నేను ముకుంద మీద చూపించిన ప్రేమ నన్ను తను మర్చిపోకుండా చేసింది. ఆ ప్రేమే నన్ను వదులుకోలేక తనని తానే అంతం చేసుకునేలా చేసిందని అంటాడు.

మురారికి అండగా నిలిచిన కృష్ణ 

మీరు మంచి చేసి నిందని మీ నెత్తిన పులుముకోవాలని చూస్తున్నారు. ఒక అమ్మాయిని ప్రేమించి తనని మోసం చేయలేదు. ఆదర్శ్ ప్రేమ కోసం మీ ప్రేమని త్యాగం చేశారు అది మీ తప్పు ఎలా అవుతుందని కృష్ణ అంటుంది. నేను ఎప్పుడూ ముకుంద మనసులో ఆశలు పెంచేలా కూడా ఎప్పుడు ప్రవర్తించలేదు. నువ్వు నా జీవితంలోకి వచ్చాక ముకుంద పరిచయస్థురాలిలాగా, ఆదర్శ్ భార్యగానే మిగిలిపోయింది. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు నన్ను నమ్ముతావా కృష్ణ అని అడుగుతాడు. 

ముకుంద మీద మీకు ఎలాంటి ఉద్దేశం లేదని నేను నమ్ముతాను. తనతో వెళ్లిపోతారనే భయం కూడా నాకు లేదు. మీరు కేవలం వాళ్ళు కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశారు. ఇందులో మన తప్పేమీ లేదు ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే మన తలరాత అనుకోవాలి కానీ తప్పు చేశామని అసలు బాధపడకూడదని కృష్ణ ధైర్యం చెప్తుంది. దీంతో మురారి ఎమోషనల్ గా కృష్ణని హగ్ చేసుకుంటాడు.

ఆవేశ పడిన మధు 

రేవతి వాళ్ళు కృష్ణ గురించి ఆదర్శ్ మాట్లాడిన మాటల పట్ల కోపంగా ఉంటారు. కృష్ణ ఏ తప్పు చేయలేదని అర్థంఅయ్యేలా చెప్పాలని లేదంటే ఇది ద్వేషంగా మారి మరొక ప్రమాదానికి దారి తీస్తుందని నందిని అంటుంది. మధు వచ్చి ఏమైందని అడుగుతాడు. ఆదర్శ్ అన్నయ్య కృష్ణని చెప్పబోతుంటే రేవతి చెప్పకుండా అడ్డుపడుతుంది. కృష్ణది ఏ తప్పు లేదంటే అర్థం చేసుకోవడం లేదు అంతా తనే చేసిందని అంటున్నాడని చెప్తుంది. పిచ్చి పట్టిందా వాడికి ఇందులో కృష్ణ చేసిన తప్పు ఏంటి?ముకుంద అడ్డు తొలగించుకోవాలని అనుకుంటే ఆదర్శ్ ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మురారి ఇప్పుడు తన భర్త అతడిని చూసినందుకు ముకుందని బయటకి గెంటేయొచ్చు. లేదంటే తనే మురారిని తీసుకుని బయటకి వెళ్లొచ్చు అని మధు ఆవేశపడతాడు.

భార్య పోయిన బాధలో ఉన్నాడని వదిలేస్తే మరీ ఎక్కువ చేస్తున్నాడు. అసలు తప్పంతా ఆదర్శ్ ది. ముకుందకి ఆదర్శ్ అంటే ఇష్టం లేదని వాళ్ళని చూసిన నాకే అర్థం అయ్యింది ఇంక తనకి ఎందుకు అర్థం కాలేదని మధు అంటాడు. ఆదర్శ్ కి బుద్ధి చెప్తానని మధు ఆవేశపడుతుంటే రేవతి సర్ది చెప్తుంది. పరిమళ కృష్ణకి ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని పిలుస్తుంది. కానీ తాను ఇప్పుడు రాలేనని అంటుంది. మురారితో మాట్లాడుతుంది. రేపు నా ఫ్రెండ్ క్లినిక్ ఓపెనింగ్ ఉంది దాన్ని కృష్ణ చేతుల మీదుగా చేయించాలని అనుకున్నాను కానీ రమ్మంటే రావడం లేదు నువ్వే ఎలాగైనా ఒప్పించమని పరిమళ చెప్తుంది. నేను పంపిస్తానని మురారి మాట ఇస్తాడు.

దెయ్యంగా వచ్చి మధుని వణికించిన ముకుంద 

నువ్వు ఏడుస్తూ, నేను బాధపడుతుంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మనం ఓపెనింగ్ కి వెళ్తున్నామని మురారి కృష్ణని ఒప్పిస్తాడు. నైట్ అయ్యేసరికి మధు సిట్టింగ్ వేస్తాడు. నువ్వు చావడం ఏమో కానీ నాకు ప్రశాంతత లేకుండా చేశావని ముకుందని తిట్టుకుంటాడు. చచ్చి ఏం సాధించావ్ మురారి, కృష్ణని దూరం చేయగలిగావ్. నాలుగు రోజులు బాధపడిన తర్వాత వాళ్ళే మర్చిపోతారని అంటాడు. మధు తాగుతుంటే మరొక గ్లాసు పక్కన ఉంటుంది. అది ఆదర్శ్ పెట్టాడనుకుని ముకుంద గురించి ఏదేదో మాట్లాడతాడు. గ్లాసులో మందు పోసి పక్కకి చూసేసరికి అక్కడ ముకుంద ఉండటం చూసి మధు షాక్ అవుతాడు.

ముకుంద దెయ్యంగా వచ్చిందని భయపడతాడు. ఏంటి మధు నన్ను తిట్టుకుంటున్నావా? నేను ఆత్మహత్య చేసుకోవడానికి కృష్ణ కదా కారణం మరి నన్ను తిట్టుకుంటావ్ ఏంటని అడుగుతుంది. మధు దెయ్యం వచ్చిందని భయంతో పరుగులు పెడతాడు. మళ్ళీ చూసేసరికి అక్కడ ముకుంద ఉండదు. ముకుంద దెయ్యం అయి వచ్చిందని ఇంట్లోకి పరుగుతీస్తాడు. లేకపోతే నన్నే తిడతావా ముకుంద ఎప్పుడూ కరెక్ట్ కృష్ణ తప్పు చేసిందని అందరూ అనుకోవాలని ముకుంద అనుకుంటుంది. తర్వాత మురారి ఫోన్ మాట్లాడుతుంటే ముకుంద కనిపించకుండా పిలుస్తూ ఉంటుంది. మళ్ళీ ముకుంద వచ్చిందని అనుకుని మురారి మొత్తం వెతుకుతాడు. తనని కావాలని మొత్తం తిప్పిస్తుంది.

మురారికి వార్నింగ్ ఇచ్చిన ముకుంద 

ఎందుకు ఇలా నన్ను సాధిస్తున్నావ్ నువ్వు లేవు వెళ్లిపో అని గట్టిగా అరుస్తాడు. ఈ లోకం నుంచి అయినా వెళ్లిపోతాను కానీ నిన్ను ఎలా విడిచి పోతాను అది సాధ్యమా? నీ మీద గుండెల నిండా ప్రేమతో ఉన్నప్పుడే నన్ను చేరుకోలేదు. ఇక ఇప్పుడు ఏం చేరుకుంటావ్. కృష్ణ నువ్వు కలిసి హాస్పిటల్ ఓపెనింగ్ కి వెళ్తున్నారంట కదా నా చావుకి కారణమైన కృష్ణతో నువ్వు సంతోషంగా తిరుగుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను. ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు. 

నువ్వు ఏం భయపడకు. నిన్ను ప్రేమించాను కదా నిన్ను ఏం చేయను. ఏం చేసినా ఆ కృష్ణని. నువ్వు తనతో ఎంత సంతోషంగా ఉంటే నా కడుపు అంత రగిలిపోతుంది, దాని ఆయుష్హు అంత తరిగిపోతుంది. నువ్వు కృష్ణ మీద ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తో దాని ఆయుష్హు అంత తగ్గిపోతుంది. నేను మనిషిగా లేకపోయినా నీ మీద ప్రేమ రూపంలో, కృష్ణ మీద పగ రూపంలో మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను. చెప్పింది చేసి చూపిస్తాను నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వార్నింగ్ ఇస్తుంది.

చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న ఆదర్శ్, మురారి 

మధు భయంతో వణికిపోతూ ఉంటాడు. ముకుంద దెయ్యంగా వచ్చిందని చెప్తాడు. అది విని మురారి డౌట్ పడతాడు. నాకు కనిపించినప్పుడు నీకు కనిపించడంలో ఆశ్చర్యం ఏముందని మురారి అనుకుంటాడు. బతికి ఉన్నప్పుడే ఇంత సాధించినప్పుడు చనిపోయాక ఇంకెంత సాధిస్తుందని మధు భయపడతాడు. కాసేపటికి ఆదర్శ్ ఆవేశంగా బయటకి వస్తే ఎక్కడికి వెళ్తున్నావని రేవతి అడుగుతుంది. ఈ టైమ్ లో ఎందుకని వెళ్లొద్దని అంటుంది. విషం ఇవ్వండి సరిపోతుంది. అంతా మీరు చెప్పినట్టు విని నా బతుకు ఇలా అయిపోయింది. అసలు ఈ ఇంట్లో మనుషుల మధ్య ఉంటుంటే నరకంగా ఉందని కోపంగా అంటుంటే మురారి వచ్చి పెద్దవాళ్ళతోనే ఇలాగేనా మాట్లాడేది అంటాడు.

నేను ఇంతే మాట్లాడతాను లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఇంకొకటి మాట్లాడలేను. మురారి, ఆదర్శ్ మధ్య వాదన జరుగుతుంది. నువ్వేం నాకు సలహాలు ఇవ్వొద్దు ఉందిగా నీ మాయలాడి పెళ్ళాం తనకి ఇచ్చుకో సలహాలని ఆదర్శ్ అంటాడు. మర్యాదగా మాట్లాడమని మురారి సీరియస్ గా చెప్తాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొక విధంగా చేసే వాళ్ళని మాయలాడి అనే అంటారని ఆదర్శ్ ఆవేశంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మురారి ఆవేశంగా తన మీదకి వెళతాడు. 

ముకుందని చూసి ఆగిపోయిన మురారి 

ఇద్దరూ చొక్కాలు పట్టుకుని తోసుకుంటుంటే మురారికి ముకుంద కనిపిస్తుంది. దీంతో మురారి ఆగిపోతాడు. కాసేపటికి ముకుంద మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఏమైంది మీ ఇద్దరికీ అని రేవతి వాళ్ళని తిడుతుంది. ఆదర్శ్ కోపంగా బయటకి వెళ్ళిపోతాడు. తన మాటలకు మురారి భయపడిపోయాడని ముకుంద ఫిక్స్ అవుతుంది. ఇలాగే కృష్ణ మురారికి దగ్గర కాకుండా చూసుకోవాలని అనుకుంటుంది.

ఇదంతా నిజమా నా భ్రమ? కృష్ణ మీద పగ తీర్చుకోవడానికి ఇలా వస్తుందా? దెయ్యాలు ఏమి ఉండవు ఇవి కేవలం నా భ్రమ అనుకుంటాడు. కానీ మళ్ళీ మధు మాటలు గుర్తు చేసుకుంటాడు. ముకుంద ఆత్మ ఇంటి చుట్టూ తిరుగుతుందా? ఒకవేళ ఉంటే భయం ఎందుకు? భయపడే కొద్ది భయపెడుతూనే ఉంటారు. అసలు భయపడకూడదు. ముకుంద దెయ్యం అయి వచ్చినా కృష్ణని నన్ను వేరు చేయలేదు. రేపు హాస్పిటల్ ఓపెనింగ్ కి తీసుకెళ్తాను ముకుంద ఏం చేస్తుందో చూస్తానని అనుకుంటాడు. కృష్ణ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నారని అడుగుతుంది. మన గురించే ఆలోచిస్తున్నా వేరే ఆలోచనలు వద్దు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానేయమని చెప్తాడు.

తరువాయి భాగంలో..

పోలీసులు మురారిని అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తారు. ముకుంద చావుకి కారణం అయ్యారని తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కృష్ణ ఏడుస్తూ ఉంటుంది. ఇక ముకుంద రూపం మారిపోయి కనిపిస్తుంది. నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఇక నేను ఏంటో చూపిస్తానని మనసులో అనుకుంటుంది.

IPL_Entry_Point