Optical Illusion: ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యూషన్‌లో మనుషుల్లో ఒక దెయ్యం దాగుంది, అది ఎక్కడుందో అయిదు సెకన్లలో కనిపెట్టండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ మీ ఐక్యూ స్థాయిలను సవాలు చేస్తుంది. ఇక్కడున్న చిత్రంలో మనుషుల్లో దాక్కున్న దెయ్యాన్ని కనిపెట్టండి.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఎంతోమందికి వినోదాన్ని, టైంపాస్‌ను అందిస్తాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ల వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కళ్ళు కూడా మెదడుతో కలిసి సమన్వయంతో పనిచేస్తాయి. అందుకే అప్పుడప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మేము ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇందులో ఎంతోమంది మనుషులు పార్టీ చేసుకుంటున్నారు. ఆ పార్టీలోకి ఒక దెయ్యం ప్రవేశించింది. ఆ దెయ్యాన్ని మీరు గుర్తించాలి. అలా చేస్తే మీ మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్టే లెక్క. మీ కళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్నాయని అనుకోవాలి.
ఇక్కడ ఉన్న మనుషులను పరిశీలనగా చూస్తే మీకు దెయ్యం ఎవరో దొరికిపోతారు. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా ఘోస్ట్ ను కనిపెడతారు. మీరు కేవలం 5 సెకండ్లలోనే కనిపెట్టండి. అలా కనిపెడితే మీ ఐక్యూ లెవెల్ సూపర్ అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం ఓసారి ప్రయత్నించండి.
జవాబు ఇదే
ఇక్కడున్న మనుషుల్లో ఘోస్ట్ ఎవరో 5 సెకండ్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. వారు చాలా తెలివైన వారని, మేధావులని అర్థం చేసుకోవాలి. కనిపెట్టలేని వారి కోసమే మేము జవాబు ఇస్తున్నాం. అక్కడున్న అందరూ సాధారణంగానే ఉన్నారు. మనుషుల్లాగే అన్ని అవయవాలతోనూ ఉన్నారు. దెయ్యాలు మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు అందరి కాళ్లను చూడండి. ఒకమ్మాయి కాళ్లు మాత్రం కనీకనిపించకుండా ఉన్నాయి. ఎడమవైపు నుంచి నిల్చున్న రెండో అమ్మాయి కాళ్లలో ఒక కాలే కనిపిస్తోంది. ఆమెనే దెయ్యం.
ఆప్టికల్ ఇల్యూషన్ల చరిత్ర ఈనాటిది కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా వీటిని చిత్రీకరిస్తున్నారు. ఎంతోమంది చేయి తిరిగిన చిత్రకారులు ఆప్టికల్ ఇల్యూషన్లను వేస్తూ వినోదాన్ని పంచుతున్నారు. ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో ఆప్టికల్ ఇల్యూషన్ లనే నమ్ముకుని జీవిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సోషల్ మీడియా వచ్చాక ఆప్టికల్ ఇల్యుషన్లు బాగా వైరల్ అవుతున్నాయి. మీకు కూడా ఆప్టికల్ ఇల్యూషన్లు ఆసక్తిగా అనిపిస్తే వాటిని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దీనివల్ల మెదడు, కంటిచూపు మెరుగవుతాయి. ముఖ్యంగా పిల్లలకు సింపుల్ ఆప్టికల్ ఇల్యూషన్లను అందించి వారి చేత కూడా ప్రాక్టీస్ చేయిపించండి. ఇది వారి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. అలాగే కళ్ళు, మెదడు కలిసి పనిచేయడాన్ని ప్రోత్సహిస్తుంది.
టాపిక్