Kalki 3 Days Collections: కల్కికి రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు.. కనిపించని ప్రపంచకప్ ఫైనల్ ఎఫెక్ట్
Kalki 2898 AD 3 Days Collections: కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్లలో దూకుడు కొనసాగుతోంది. సెకండ్ డే కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లను దక్కించుకుంది. మూడు రోజుల్లో ఎన్ని కోట్ల వచ్చాయంటే..
కల్కి 2898 ఏడీ సినిమా ర్యాంపేజ్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథో సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరస్టిక్ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ప్రశంసలతో పాటు వసూళ్లను సైతం ఈ చిత్రం భారీగా దక్కించుకుంటోంది. కల్కి 2898 ఏడీ సినిమాకు రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు కలెక్షన్లు పెరిగాయి.
మూడు రోజుల్లో..
కల్కి 2898 ఏడీ సినిమాకు మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.415 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూన్ 30) అధికారికంగా ప్రకటించింది. నాలుగో రోజైన ఆదివారం కూడా కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బుకింగ్స్ ట్రెండ్ అలాగే ఉన్నాయి.
రెండు రోజు కంటే ఎక్కువ
కల్కి 2898 ఏడీ మూవీకి రెండో కంటే మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.107 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మూడో రోజు రూ.117 కోట్ల కలెక్షన్లు దక్కాయి. అంతకు ముందు తొలి రోజు ఈ చిత్రం రూ.191.5 కోట్లతో బంపర్ ఓపెనింగ్ అందుకుంది. మొత్తంగా మూడు రోజుల్లో రూ.415 కోట్లతో దుమ్మురేపింది.
కనిపించని ఫైనల్ ఎఫెక్ట్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ శనివారం (జూన్ 29) జరిగింది. అయితే, కల్కి 2898 ఏడీ కలెక్షన్లపై ఈ ఫైనల్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. మూడో రోజైన శనివారం కల్కికి భారీ కలెక్షన్లు వచ్చాయి. సాయంత్రం షోలకు కూడా మంచి ఆక్యుపెన్సీ ఉంది. కాగా, ఫైనల్‍లో దక్షిణాఫ్రికాను ఓడించి టీమిండియా టైటిల్ కైవసం చేసుకుంది.
జవాన్ రికార్డు బ్రేక్
బుక్‍మైషోలో గంటకు టికెట్ల బుకింగ్ విషయంలో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమా రికార్డును కల్కి 2898 ఏడీ బద్దలుకొట్టింది. ఓ దశలో కల్కికి గంటలో బుక్‍మైషోలో 95.71 టికెట్లు బుక్ అయ్యాయి. గంటకు ఎక్కువ టికెట్లు (86వేలు) బుక్ అయిన విషయంలో ఇప్పటి జవాన్ పేరిట రికార్డు ఉండేది. దాన్ని కల్కి ఇప్పడు బద్దలుకొట్టేసింది.
కల్కి 2898 ఏడీ సినిమాకు చాలా మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. చిరంజీవి, రజినీకాంత్ సహా ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఈ చిత్రంపై ట్వీట్లు చేశారు. భారతీయ మూవీ స్థాయిని పెంచిందని రాసుకొచ్చారు. ముఖ్యంగా అద్భుతమైన విజువల్స్, ఆలోచనతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్‍పై ప్రశంసలు వస్తున్నాయి.
కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్ మెయిన్ రోల్స్ చేయగా.. సస్వత ఛటర్జీ, శోభన, దిశా పటానీ, పశుపతి కీరోల్స్ చేశారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ క్యామియో పాత్రల్లో కనిపించారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. కల్కి 2 కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.