Vijay Deverakonda: లేట్‍గా కల్కి మూవీ చూసిన విజయ్ దేవరకొండ.. ట్రోలర్లకు సైలెంట్‍గానే గట్టి బదులిచ్చేశారు!
Vijay Devarakonda - Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ ముఖ్యమైన క్యామియో రోల్ చేశారు. అయితే, ఈ మూవీని కాస్త లేట్‍గా చూశారు. అలాగే, ట్రోలర్లకు కూడా సైలెంట్‍గానే బదులిచ్చారు.
సినీ ప్రపంచమంతా ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మ్యానియా ఉంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. జూన్ 27న రిలీజైన ఈ చిత్రం హైప్‍కు తగ్గట్టే అదిరిపోవటంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. కాగా, కల్కి 2898 ఏడీ చిత్రం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్యమైన క్యామియో రోల్ చేశారు. అర్జునుడి పాత్రను పోషించారు. అయితే, రిలీజైన మూడో రోజు సినిమా చూశారు విజయ్.
రూ.1,000కోట్ల దాటుతుంది
తాను కల్కి 2898 ఏడీ సినిమాను ఇప్పుడు చూశానంటూ నేడు (జూన్ 29) ట్వీట్ చేశారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం రూ.1,000 కోట్ల కలెక్షన్లు మార్కును దాటుతుందని తాను ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
కల్కి చిత్రంతో భారతీయ సినిమా మరోస్థాయికి వెళ్లిందని విజయ్ పేర్కొన్నారు. “ఇప్పుడు సినిమా చూశా. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇండియన్ సినిమా మరోస్థాయి అన్‍లాక్ అయింది. ఈ చిత్రం రూ.1000 కోట్ల అంత కంటే ఎక్కువ సాధిస్తుందని ఆశిస్తున్నా” అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. తాను క్యామియో రోల్ చేసిన మూవీనే లేట్‍గా మూడో రోజు వీక్షించారు విజయ్.
ట్రోలర్లకు స్పందనగానేనా!
కల్కి 2898 ఏడీ సినిమాలో మహాభారతం సీక్వెన్స్‌లో విజయ్ దేవరకొండ.. అర్జునుడిగా నటించారు. క్యామియో రోల్‍గా కాసేపే కనిపించారు. థియేటర్లలో ఈ పాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అర్జునుడిగా విజయ్ ఆహార్యం, డైలాగ్ డెలివరీ కూడా చాలా మంది ప్రేక్షకులను మెప్పించింది.
అయితే, అర్జునుడి పాత్రను విజయ్ దేవరకొండ చేయడంపై సోషల్ మీడియాలో మాత్రం దేవరకొండపై ట్రోల్స్ వచ్చాయి. నెగెటివిటీ వ్యాప్తి చెందింది. అయితే, ఈ ట్రోల్స్‌కు బదులిచ్చేలా ఆయన నేడు ఓ పని చేశారు. తన ఇన్‍స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లకు డీపీ (డిస్‍ప్లే పిక్చర్)ని నేడు మార్చుకున్నారు. కల్కిలో తాను పోషించిన అర్జునుడి పాత్ర ఫొటోను ప్రొఫైల్ ఫొటోగా సెట్ చేసుకున్నారు. ఇలా.. ట్రోలర్లకు సైలెంట్‍గానే గట్టిగా బదులిచ్చేశారు విజయ్.
కల్కికి రజినీ ప్రశంసలు
కల్కి 2898 ఏడీ సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. వావ్.. ఎపిక్ మూవీ అంటూ ట్వీట్ చేశారు. భారతీయ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ మరోస్థాయికి తీసుకెళ్లారని రజినీ రాసుకొచ్చారు. తాను పార్ట్ 2 కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. చాలా మంది ప్రముఖులు కూడా కల్కి చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ కలిపి విజువల్ వండర్‌గా ఈ మూవీని తెరకెక్కించారనే ప్రశంసలు దర్శకుడు నాగ్ అశ్విన్‍కు దక్కుతున్నాయి. సుమారు రూ.600 బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసింది.