Kalki 2 Update: కల్కి 2 షూటింగ్ గురించి అప్‍డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్.. అప్పడే ఎంత శాతం పూర్తయిందంటే..-kalki 2 shooting completed 60 percent kalki 2989 ad may get this much collection producer ashwini dutt gave updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2 Update: కల్కి 2 షూటింగ్ గురించి అప్‍డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్.. అప్పడే ఎంత శాతం పూర్తయిందంటే..

Kalki 2 Update: కల్కి 2 షూటింగ్ గురించి అప్‍డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్.. అప్పడే ఎంత శాతం పూర్తయిందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 29, 2024 03:21 PM IST

Kalki 2 Update: కల్కి 2 సినిమా గురించి నిర్మాత అశ్వినీదత్ కీలక అప్‍డేట్ చెప్పారు. ఇప్పటికే ఎంత శాతం చిత్రీకరణ పూర్తయిందో వెల్లడించారు. అలాగే, కల్కి 2898 ఏడీ సినిమా ఎంత కలెక్షన్లను రాబడుతుందో అంచనాలను వెల్లడించారు.

Kalki 2 Update: కల్కి 2 షూటింగ్ గురించి అప్‍డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్.. అప్పడే ఎంత శాతం పూర్తయిందంటే..
Kalki 2 Update: కల్కి 2 షూటింగ్ గురించి అప్‍డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్.. అప్పడే ఎంత శాతం పూర్తయిందంటే..

కల్కి 2898 ఏడీ సినిమా అంచనాలను నిలబెట్టుకుంటూ బంపర్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మైథో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. జూన్ 27వ తేదీన భారీస్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లకు సమీపించింది. అద్భుతమైన విజువల్స్, వీఎఫ్‍ఎక్స్‌తో ఆకట్టుకుంటోంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంటూ కల్కి 2898 ఏడీ మూవీకి సీక్వెల్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ తరుణంలో కల్కి 2 గురించి నిర్మాత అశ్వినీదత్ కీలక అప్‍డేట్ వెల్లడించారు.

yearly horoscope entry point

60 శాతం పూర్తి

కల్కి 2898 ఏడీ క్లైమాక్స్.. సీక్వెల్‍పై భారీగా ఆసక్తిని, అంచనాలను పెంచేసింది. దీంతో కల్కి 2 ఎప్పుడు వస్తుందోనని సినీ ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో సీక్వెల్ గురించి నిర్మాత అశ్వినీదత్ అప్‍డేట్ ఇచ్చారు. కల్కి 2కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయిందని నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

కల్కి 2 చిత్రీకరణ 60 శాతం అయినా.. కొన్ని ముఖ్యమైన పోర్షన్స్ షూటింగ్ జరగాల్సి ఉందని అశ్వినీదత్ వెల్లడించారు. ఇంకా సీక్వెల్ రిలీజ్ డేట్‍ను నిర్ణయించలేదని స్పష్టం చేశారు. అయితే, 2025 వేసవిలో వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. 

కల్కి 2898 ఏడీకి ఎంత కలెక్షన్లు రావొచ్చు!

కల్కి 2898 ఏడీ సినిమా భారీ ఓపెనింగ్ దక్కించుకోవడంతో ఈ చిత్రం ఫుల్ రన్‍లో ఎంత కలెక్షన్లను రాబడుతుందో నిర్మాత అశ్వినీదత్ అంచనా వేశారు. ఈ సినిమా రూ.1,400 కోట్ల నుంచి రూ.1,500 వరకు కలెక్షన్లను సాధిస్తుందని అన్నారు.

కల్కి 2898 ఏడీ సినిమాపై ప్రేక్షకులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి విజువల్స్ భారత సినీ చరిత్రలో తొలిసారి చూస్తున్నామంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్‍కు సలాం అంటున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ నటనకు చాలా ప్రశంసలు దక్కుతున్నాయి. భైరవ పాత్రలో డార్లింగ్ దుమ్మురేపగా.. అశ్వత్థామగా అమితాబ్ ఆకట్టుకున్నారు. దీపిక పదుకొణ్ కూడా అద్భుతంగా నటించారు. కమల్ హాసన్ కూడా మరోసారి తన మార్క్ డిఫరెంట్ రోల్ చేశారు. శోభన, సస్వస్త ఛటర్జీ, పశుపతి, దిశాపటానీ, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు చేశారు.

కల్కి 2898 ఏడీ రెండు రోజుల కలెక్షన్లు

కల్కి 2899 ఏడీ సినిమాకు రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.298.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ దిశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్‍లో చాలా చోట్ల రికార్డులను ఈ మూవీ సృష్టించింది. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ భారీ బడ్జెట్‍తో నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Whats_app_banner