Kalki: ఎంట్రీ లేటైనా అరుపులే.. విజయ్, దుల్కర్ కన్ఫర్మ్.. క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్: ప్రభాస్, నాగ్అశ్విన్ చెప్పిన విశేషాలు
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పారు హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇన్‍స్టాగ్రామ్ లైవ్‍లోకి వచ్చి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఇద్దరి క్యామియో రోల్స్, భైరవ ఎంట్రీ సహా మరిన్ని విషయాల గురించి మాట్లాడారు.
కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్‍కు ఒక్క రోజు ముందు కొన్ని విశేషాలు వెల్లడించారు రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ రేపు (జూన్ 27) విడుదల కానుండగా.. నేడు ఆ ఇద్దరూ ఇన్‍స్టాగ్రామ్ లైవ్‍లోకి వచ్చారు. కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. క్యామియో రోల్స్, భైరవ (ప్రభాస్) ఎంట్రీ, క్లైమాక్స్ గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఇవే..
20 నిమిషాల తర్వాతే
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంట్రీ 20 నిమిషాల సమయంలో ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. భైరవ (ప్రభాస్) ఎంట్రీకి అందరూ అరుపులు పెట్టడం ఖాయమని తెలిపారు. సాధారణంగా తాను థియేటర్లలో కేకలు పెట్టనని, కానీ భైరవ ఎంట్రీకి అరుస్తానని అన్నారు.
సర్‌ప్రైజింగ్‍గా క్లైమాక్స్
కల్కి 2898 ఏడీ సినిమా క్లైమాక్స్ ప్రభాస్‍కు కూడా సర్‌ప్రైజ్‍గా ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పారు. క్లైమాక్స్‌లో వచ్చే పాట ఆల్‍టైమ్ ఫేవరెట్‍గా మారుతుందని తెలిపారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఓ భారీ ట్విస్ట్ ఉంటుందని కొంతకాలంగా రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు నాగీ కూడా అలానే చెప్పారు.
విజయ్, దుల్కర్‌కు థ్యాంక్స్
కల్కి 2898 ఏడీ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ క్యామియో రోల్స్ ఉంటాయని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేశారు ప్రభాస్, నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో నటించిన విజయ్, దుల్కర్‌కు థ్యాంక్స్ చెప్పారు. వారి వల్ల ఈ చిత్రం మరింత భారీగా అయిందని ప్రభాస్ ఇన్‍స్టాగ్రామ్ లైవ్‍లో అన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారని నాగీ అన్నారు. ఈ చిత్రంలో నాని, మృణాల్ ఠాకూర్, దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా కనిపిస్తారనే టాక్ ఉంది.
సీక్వెల్ గురించి..
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్ కూడా ఫిక్స్ అయింది. కల్కి పార్ట్ 2 ఉందని, పది రోజులు రెస్ట్ తీసుకొని దాని కోసం పని చేయాలని నాగ్ అశ్విన్‍తో ప్రభాస్ అన్నారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో మహాభారతం సీక్వెన్స్ ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పారు. ఈ చిత్రం వల్ల పురాణాలపై ప్రజలకు ఆసక్తి కలగడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
తాను 2008లోనే ప్రభాస్‍తో సినిమా చేయాలనుకున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు. ప్రభాస్ సినిమాల్లో తనకు ఎక్కువ నచ్చింది బుజ్జిగాడు అని నాగీ తెలిపారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో భైరవ పాత్ర పోషిస్తున్నారు ప్రభాస్. అయితే, ఈ క్యారెక్టర్‌కు ట్విస్టులు ఉంటాయనే రూమర్లు ఉన్నాయి. ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్ర చేశారు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్. కమల్ హాసన్, దీపికా పదుకొణ్ కూడా ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన కల్కి 2898 ఏడీ.. అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం వస్తోంది.
టాపిక్