Guppedantha Manasu July 2nd Episode: గుప్పెడంత మనసు.. వసుధార కోసం అప్పు చేసిన రంగా.. సరోజ గొడవ.. పెళ్లి చేయనన్న రాధమ్మ
Guppedantha Manasu Serial July 2nd Episode: గుప్పెడంత మనసు సీరియల్ జూలై 2వ తేది ఎపిసోడ్‌లో వసుధార కోసం కొత్త బట్టలు కొనుక్కొని తీసుకొస్తాడు రంగా బుజ్జి. తర్వాత వీటికి డబ్బులు ఎక్కడివి, ఆటో కూడా తీయట్లేదు అని రంగాను రాధమ్మ అడుగుతుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో సరోజ బట్టలు అంతగా కంఫర్ట్ లేవని, అలా రోజు తన బట్టలే వేసుకోలేనని వసుధార చెబుతుంది. తన బట్టలు వేసుకుంటే సరోజ కూడా ఫీల్ అవుతుంది. అమ్మాయిలు ఏదైనా షేర్ చేసుకుంటారు కానీ, బట్టలు షేర్ చేసుకోలేరు. అది అమ్మాయిగా నాకు తెలుసు అని వసుధార అంటుంది. ఇప్పుడు ఏమంటారు. కొత్త బట్టలు తీసుకురావాలా అని బుజ్జి అంటాడు.
ఏం కావాలన్న తీసుకురావాలి
అవును అని వసుధార అంటే.. సరే తీసుకొద్దాం అని రంగా అంటాడు. నువ్ ఎప్పుడు అమ్మాయిల బట్టలు తీసుకొచ్చిందే లేదు. ఎలా తెస్తావు అని బుజ్జి అంటాడు. రేయ్ ఎలాగోలా తీసుకొద్దామని రంగా అంటాడు. ఇంతలో డబ్బులు అడుగుతాడు బుజ్జి. దాంతో అది ఇది అని వసుధార నసుగుతుంది. దాంతో అరెయ్ మేడమ్ మన గెస్ట్. అలా డబ్బులు అడగొచ్చా. ఏం కావాలన్న తీసుకురావాలి అని రంగా అంటాడు. ఇవాళ బట్టలు, రేపు నగలు, తర్వాత ముత్యాలు ఇవన్నీ అడిగితే తెస్తావా అని బుజ్జి అంటాడు.
దాంతో అలా ఏం అడగనులెండి అని వసుధార అంటుంది. తర్వాత రంగా, బుజ్జి వెళ్లిపోతారు. అనంతరం వసుధార కూరగాయలు కట్ చేస్తుంది. నీతో ఇలా పని చేయిస్తున్నానని తెలిస్తే నా మనవడు నాపై కోప్పడతాడు అని రాధమ్మా అంటుంది. ఆయన కోపం అంతంతమాత్రమే. ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు అని వసుధార అంటుంది. నీది మంచితనమో పిచ్చితనమో అర్థం కావట్లేదని రాధమ్మ అంటుంది.
పువుల్లో పెట్టి చూసుకుంటా
బావా అనుకుంటూ సరోజ వస్తుంది. బావ ఎందుకుని రాధమ్మ అంటే.. మాకు మాకు లక్ష ఉంటాయి నీకెందుకే అని విడగొట్టినట్లు మాట్లాడుతుంది సరోజ. వామ్మో ఇప్పుడే ఇలా అంటున్నావంటే రేపు పెళ్లయ్యకా నా పరిస్థితి ఏంటో.. నీకు నా మనవడిని ఇచ్చి పెళ్లి చేయను అని రాధమ్మ అంటుంది. నువ్ నీ మనవడిని నాకు ఇస్తే.. ఇద్దరినీ పువుల్లో పెట్టుకుని చూసుకుంటాను అని సరోజ అంటుంది. తర్వాత బావ ఎక్కడ అని అడిగితే.. తనకు బట్టలు కొనడానికి వెళ్లాడని వసుధార చెబుతుంది.
నీకు కొనడమేంటీ అని సరోజ ఫైర్ అవుతుంది. నాకు ఇక్కడ బట్టలు లేవు కాబట్టి అని వసుధార చెబుతుంది. ఏంటీ ఇలా బావను నీకు దగ్గరగా చేసుకోవాలని చూస్తున్నావా. మాయమాటలు చెప్పి బుట్టలో పడేసుకోవాలని చూస్తున్నావా అని సరోజ అంటుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోను అని వసుధార అంటుంది. ఏం చేస్తావ్. నోరు లేపుతున్నావ్ అని సరోజ అంటే.. ఇద్దరి ఆపుతుంది రాధమ్మా. అసలు తను వెళ్లడమేంటీ. వెళ్లాడు. తర్వాత కొద్దిరోజులకు నువ్ వెళ్తావ్ అని సరోజ అంటుంది.
నా ముందు బచ్చగాడు
అసలు నీకోసం వెళ్లడానికి బావ ఎవరు అని సరోజ అంటే.. నా భర్త అని సరోజ అంటుంది. ఆపు.. ఇక ఆపు.. ఎప్పుడూ చూడు అవే మాటలు. రాని చెప్తా అని సరోజ వెళ్లిపోతుంది. మరోవైపు మను దగ్గర చేసింది శైలేంద్ర అవమానంగా ఫీల్ అవుతాడు. దేవయానికి చెప్పుకుంటాడు. వాడు నా ముందు బచ్చగాడు. నాకు ముచ్చటమలు పట్టించాడు. వాడిని వదిలిపెట్టను అని శైలేంద్ర అంటాడు. వాడి పాపాన వాడే పోతాడు. వదిలేయ్ అని దేవయాని అంటుంది.
అలా అంటావ్ ఏంటీ మామ్. వాడిని నామ రూపంలేకుండా చేస్తాను. వాడు భయపడేలా చేస్తాను అని శైలేంద్ర అంటాడు. నీకంటే నాకు పదిరెట్లు కోపంగా ఉన్నాను. నీకు మట్టి అంటకుండా పెంచాను. అలాంటిది నిన్ను బెదిరించాడు. కానీ, ఊరుకుంటున్నాను. అది మీ నాన్న కోసం అని దేవయాని అంటుంది. అప్పుడు డాడ్ వచ్చాడు కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు అలా జరగదు. వాడిని లేపేస్తాను అని శైలేంద్ర అంటాడు. అలా చేయకు. అది మిస్ అయితే మళ్లీ మీ డాడ్‌కు చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు అని దేవయాని అంటుంది.
సరిగా లేనట్టున్నాయి
ఇప్పుడు ఏం చేయకు. టైమ్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఎండీ సీటు. అది ఎలా దక్కించుకోవాలో ఫోకస్ చేయు అని దేవయాని చెబుతుంది. మరోవైపు సరోజ విసుగ్గా ఉంటే.. రంగా వస్తాడు. బావ నీకు అసలు బుద్ధుందా. తనకు బట్టలు ఎందుకు తెచ్చావ్ అని నిలదీస్తుంది సరోజ. అవి తనకు సరిగా లేనట్టుందని రంగా అంటాడు. ఆమెకు అన్ని సరిగ్గా ఉండాలా. కొన్నాళ్లు ఉండి పోయేదానికి ఎందుకు అని సరోజ అంటుంది.
ఎందుకు గొడవ చేస్తావ్. బట్టలే కదా తెచ్చాను అని రంగా అంటాడు. మేడమ్ గారు అని వసుధారను పిలిచి తీసుకొచ్చిన బట్టలు ఇస్తాడు రంగా. ఇది నాకు నచ్చిన కలర్. నాకు నచ్చిన డిజైన్ అని చాలా సంతోషిస్తుంది వసుధార. రంగా ఇన్ని బట్టలకు డబ్బులు ఎక్కడివి. ఆటో కూడా తీయడం లేదని రాధమ్మ అడుగుతుంది. అప్పు చేసి తీసుకొచ్చానని రంగా చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా అని రాధమ్మ అంటుంది.
బేరం కూడా ఆడలేదు
తను కావాలంది. తను మన అతిథి. మనం తిన్న తినకున్నా తనకు పెట్టాలి. మన దగ్గర ఉన్నా లేకున్నా తను అడిగింది ఇవ్వాలి అని రంగా అంటాడు. కాసేపు కాస్తా గొడవ పెట్టి ఆనందిద్దాం అని బుజ్జి అనుకుంటాడు. వెళ్లి సరోజ దగ్గర కావాలనే లేనిపోని మాటలు చెబుతాడు బుజ్జి. చాలా టైమ్ పట్టింది వీటన్నింటికి. బేరం కూడా ఆడలేదు. ఎంత చెబితే అంత ఇచ్చాడు. నీకు ఏరోజైనా ఇలా తెచ్చాడా. పుట్టినరోజుకు అయినా తెచ్చాడా అని బుజ్జి ఫిటింగ్ పెడతాడు.
దాంతో బావ లేవని తీసుకొచ్చావ్ కదా. అయితే ఇప్పుడు నా దగ్గర కూడా బట్టలు లేవు. తీసుకురా అని సరోజ అంటుంది. నా దగ్గర డబ్బులు లేవని రంగా అంటాడు. తనకు అప్పు చేసి తీసుకొచ్చావ్ కదా. అలాగే తీసుకురా. నేను నీ మరదలిని. నాకంటే తను ఎక్కువైపోయిందా. తనకోసం అన్ని షాపులు తిరిగాడట. డిజైన్స్ చూసి తీసుకొచ్చాడట. నాకు తీసుకురమ్మంటే ఎందుకు అలా అంటాడు అని సరోజ అంటుంది. దాంతో అది బుజ్జి చెప్పాడని రంగాకు అర్థం అవుతుంది.
వాడి వెంట ఎందుకు పడుతున్నావ్
ఇంకోసారి తీసుకొస్తాడని రాధమ్మ చెబుతుంది. ఇప్పుడే కావాలని సరోజ అంటే.. నేనైతే తీసుకురానే అని రంగా వెళ్లిపోతాడు. నాకు తీసుకురమ్మంటే తీసుకురావా. నీ సంగతి చెప్తా అని వసుధారనే చూస్తుంది సరోజ. చూశావా సరోజ నేను చెప్పలే చెప్పలే అని బుజ్జి అంటాడు. కట్ చేస్తే తండ్రికి భోజనం పెడుతూ చిరాకుగా ఉంటుంది సరోజ. బావ నన్ను పట్టించుకోవట్లేదని సరోజ అంటుంది. నువ్వెందుకు వాడి వెంట పడుతున్నావ్. వాడికంటే డబ్బున్నవాన్ని, అందమైన వాన్ని చూస్తాను అని తండ్రి అంటాడు.
కానీ, గుణమున్న వాన్ని తీసుకురాలేవని సరోజ అంటుంది. అది దేనికి అన్నం పెడుతుందా డబ్బు ఇస్తుందా అని సరోజ తండ్రి అంటాడు. అర్థ ఆకలితో ఉన్న సరే గుణమున్న వాడిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది అని చెప్పిన సరోజ జరిగింది చెబుతుంది. తర్వాత రంగా బట్టలు సర్దుకుంటాడు. ఇవేనా మీ బట్టలు అని వసుధార అంటుంది. నాలుగు జతలు. రోజుకు ఒకే జత. అంతకంటే ఎక్కువ వేసుకోం కదా అని రంగా అంటాడు.
స్టైలిష్‌గా ఉండేవారు
ఎందుకు సర్ ఇదంతా. ఎందుకు ఇలా ఉంటున్నారు అని వసుధార అడుగుతుంది. కలలు కంటున్నారా మేడమ్. మీ కలలో నేను ఎలా ఉండేవాన్ని రంగా అడుగుతాడు. సూట్ వేసుకుని రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని యాటిట్యూడ్‌తో చాలా స్టైలిష్‌గా ఉండేవారు. ఎప్పుడూ అలాగే ఉండాలి అని వసుధార అంటుంది. హో.. మీ కలలో అలా కనిపించేవాన్నా అని రంగా అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్