Guppedantha Manasu August 28th Episode: అసలు రంగాను కలుసుకున్న రాధమ్మ- వణికిపోయిన శైలేంద్ర- మను నిజమైన తల్లి జగతి!-guppedantha manasu serial august 28th episode ranga meets his family by rishi guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 28th Episode: అసలు రంగాను కలుసుకున్న రాధమ్మ- వణికిపోయిన శైలేంద్ర- మను నిజమైన తల్లి జగతి!

Guppedantha Manasu August 28th Episode: అసలు రంగాను కలుసుకున్న రాధమ్మ- వణికిపోయిన శైలేంద్ర- మను నిజమైన తల్లి జగతి!

Sanjiv Kumar HT Telugu
Aug 28, 2024 08:15 AM IST

Guppedantha Manasu Serial August 28th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 28వ తేది ఎపిసోడ్‌లో అసలు రంగాను రాధమ్మకు, సరోజకు చూపిస్తాడు రిషి. దాంతో వాళ్లు తనే తన మనవడు అని నమ్ముతారు. అదంతా చూసిన శైలేంద్ర వణికిపోతాడు. మిగతావాళ్లను మిగల్చకూడదని అనుకుంటాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 28వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 28వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తాను రంగా కాదని, రిషి అని రాధమ్మ, సరోజకు చెబుతాడు రిషి. దాంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. లేదు బావ నువ్ అబద్ధం చెబుతున్నావ్ అని సరోజ అంటే.. నిన్ను ఏదో మాయ చేసినట్లు ఉన్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్. అమ్మ వసుధార నిన్ను నా సొంత బిడ్డలా చూసుకున్నాను . వీడు నా మనవడిని కాదంటున్నాడు. సరోజ ముందు నుంచి చెప్పిందే నిజం చేసేలా ఉన్నావ్ అని రాధమ్మ అంటుంది.

మీతేనే ఉంటాను

బామ్మా ఒక్కసారి రిషి సార్ చెప్పింది వినండి అని వసుధార అంటుంది. సరోజ వెళ్లిపోతుంది. నేను మీ రంగాను కాదు అని రిషి అంటాడు. అయితే ఇన్నాళ్లు మా దగ్గర రంగాగా ఎందుకు ఉన్నావ్. మా రంగా ఎక్కడ అని రాధమ్మా అంటుంది. నాతో రండి అని రిషి అంటే.. ఎక్కడికి రావాలి నాన్నా. నువ్వే మా రంగావి అని రాధమ్మ అంటుంది. అయ్యో నానమ్మా నాతో రండి. అప్పుడు కూడా మీకు నేను మీ రంగానే అనిపిస్తే మీతోనే ఉంటాను అని రిషి అంటాడు.

పక్కకు వచ్చిన సరోజ శైలేంద్రకు కాల్ చేస్తుంది. మీ బావను కలిసావా. ఏమంటున్నాడు అని శైలేంద్ర అడుగుతాడు. నేను మీ రంగాను కాదు. రిషి అంటున్నాడు. మీ ఇద్దరు కలిసి నా బావను మార్చారు. మీ బావ నోటితోనే నేను రిషి అని చెప్పిస్తాను అని వసుధార పందెం కాసింది. ఇప్పుడు అలాగే జరిగింది. వామ్మో వామ్మో నేను మీలాంటి వాళ్లను ఎక్కడ చూడలేదు. మోసం దగ కుట్ర. మనిషినే మార్చరంటే మీరు మాములోళ్లు కాదు అని సరోజ అంటుంది.

ఎహే.. ఏదో వాగకు. సరిగా చెప్పు అని శైలేంద్ర అంటుంది. వసుధార రిషి సార్ రిషి సార్ అంది. నువ్వు డబ్బులిచ్చి రిషిలా మార్చావ్. మీ ఇద్దరు ఒక్కటే అని సరోజ అంటుంది. మేము ఇద్దరం ఒక్కటికాదు అని శైలేంద్ర అంటాడు. మీ ప్లాన్ నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఇంకొకరిని చూపించి తనే రంగా అంటారు. ఇప్పుడు మా బావ అసలైన రంగాను చూపిస్తాడట. మా ఇద్దరిని అక్కడికే తీసుకెళ్తాడట. తను రిషి అట అని సరోజ అంటుంది.

బాడీ అంతా షివరింగ్

దాంతో శైలేంద్ర షాక్ అవుతాడు. ఇప్పుడు ఎక్కడున్నారని శైలేంద్ర అడిగితే.. నువ్ ఇచ్చిన అడ్రస్ దగ్గరే ఉన్నాం. మాకు రంగాను చూపిస్తాడట సరోజ చెబుతుంది. సరే లొకేషన్ పెట్టు అని శైలేంద్ర అంటే.. సరే పంపిస్తా. నువ్ రా. నీ సంగతి చెబుతా. సరోజకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని సరోజ అంటుంది. అమ్మో వీడు నిజంగా రంగా కాదా రిషినా. వీడు రిషి అంటేనే నా బాడీ అంతా షివరింగ్ అవుతుంది. గుండెల్లో దడ పుడుతుంది. ముందు వాడు రంగానా రిషినా క్లారిటీ తెచ్చుకోవాలి అని సరోజ పంపించిన లొకేషన్‌కు వెళ్దామనుకుంటాడు.

రాధమ్మ, సరోజను రిషి తీసుకెళ్లిపోతాడు. ఏంటమ్మా ఇది అని మహేంద్ర అడిగితే.. అంతా చెబుతాను అని జరిగింది చెబుతుంది వసుధార. రౌడీల నుంచి రిషి కాపాడినప్పటినుంచి ఇంట్లో ఉండటం వరకు, రిషికి దొరికిన జగతి లెటర్, అప్పుడు రిషిపై అటాక్ జరగడం, తనను రంగా కాపాడటం, రంగా ప్లేసులో రిషి వెళ్లడం అంతా చెబుతుంది. అయితే, నాకు తెలియకుండా చాలా జరిగిందన్నమాట అని మహేంద్ర అంటాడు. ఇంతకీ ఆ లెటర్ ఎవరు రాశారు మహేంద్ర అడిగితే.. అత్తయ్య రాశారట అని వసుధార అంటుంది.

దాంతో మహేంద్ర షాక్ అవుతాడు. నువ్ ఆ లెటర్ చదివావ. నేను ఓసారి ఆ లెటర్ చదవాలి అని మహేంద్ర అంటాడు. రిషి సార్ రాగానే ఆ లెటర్ చదువుదామని వసుధార అంటుంది. వసుధార ఇంటికి రాధమ్మ వాళ్లను తీసుకెళ్తాడు రిషి. రంగాను వసుధార తండ్రి తీసుకొస్తాడు. అదంతా కిటికి నుంచి చాటుగా శైలేంద్ర చూస్తాడు. నిజమైన రంగాను అలాగే చూస్తుంది రాధమ్మ. అలా చూస్తావేంటీ ఇతనే మీ రంగా అని రిషఇ అంటాడు. శైలేంద్ర షాక్ అవుతాడు.

అతనెందుకు వచ్చాడు

నానమ్మ అంటూ అసలు రంగా దగ్గరికెళ్లి హగ్ చేసుకుంటాడు. ఎలా ఉన్నావ్. ఏంటీ ముసలి అలా నోరెళ్లిబెట్టి చూస్తున్నావ్. ముందే వద్దామనుకున్నానే. కానీ, ఇలా జరగడంతో ఆగాల్సి వచ్చిందని రంగా అంటాడు. ఏం జరిగిందని రాధమ్మ అడిగితే.. అదంతా ఇంటికెళ్లాక మాట్లాడుకోవచ్చు అని రంగా అంటాడు. ఏంటీ మాట్లాడుకునేది నువ్ రంగావో దొంగవో. నువ్ రంగావి అయితే అతనెందుకు వచ్చాడు అని సరోజ అంటుంది. నానమ్మ కన్నీళ్లు తుడవడానికి, మీ నాన్న అప్పు తీర్చడానికి అని జరిగిందంతా అసలైన రంగా చెబుతాడు.

అంటే నువ్ నిజంగానే రిషివా అని సరోజ అడుగుతుంది. తను నిజంగా రిషిసారే అని రంగా అంటాడు. మా నాయనే మాకోసం అంత ఆస్తి వదిలి వచ్చి ఆటో నడిపావా అని రాధమ్మ రిషిని అంటుంది. ఇప్పుడు కొత్త వ్యక్తిని మా బావ అంటే నమ్మలేకపోతున్నాను అని సరోజ అంటుంది. నేను కొత్త వ్యక్తి ఏంటే.. పద కొట్టుకెళ్లి కొబ్బరిబొండాలు కొట్టుకుందాం అని రంగా అంటే.. నీకు ఇంకా అది గుర్తుందా బావా అని ప్రేమగా దగ్గరికెళ్తుంది సరోజ.

నా మనవడిని కాపాడావు అని రాధమ్మా అంటే.. లేదు మీ రంగానే నా ప్రాణాలు కాపాడాడు. నీకు ఏ సహాయం కావలన్నా నేను చేస్తాను అని రిషి అంటాడు. సరే అన్నయ్య.. ఇప్పుడు నేను ఊరికి వెళ్తాను అని రంగా అంటాడు. నువ్ కూడా వీలు చూసుకోని ఇంటికి రా అని రాధమ్మ అంటుంది. ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి. చూసుకుని వస్తాను అని రిషి అంటాడు. అదంతా విన్న శైలేంద్ర షాక్ అయిపోతాడు. సరోజ వాళ్లకు ఎదురెళ్లి రేయ్ నువ్ నిజంగానే రంగానా అని అడుగుతాడు.

చెబితే అయిపోయేదానికి

అవును. ఇతనే రంగా అని సరోజ అంటే.. మరి ఇన్నాళ్లు వాడిని రంగా అన్నావ్. ఊరంతా అన్నారు అని ఇరిటేట్ అవుతాడు శైలేంద్ర. మీకు థ్యాంక్స్ అని చెప్పి సరోజ వాళ్లు వెళ్లిపోతారు. తప్పు చేశావ్. చాలా పెద్ద తప్పు చేశావ్. నేను మిగలాలంటే మిగతా వాళ్లను ఉంచకూడదు అని శైలేంద్ర వెళ్లిపోతాడు. రిషి ఇంటికి వస్తాడు. మహేంద్రకు జరిగింది చెప్పినట్లు వసుధార చెబుతుంది. ఎందుకు నాన్న నువ్ చెబితే అయిపోయేదానికి నటించావ్ అని మహేంద్ర అడుగుతాడు.

మనవడి కోసం ప్రాణాలు పెట్టుకున్న ఆమెకు తన మనవడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిస్తే బతకగలదా. గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అందుకే నటించాను. అది ఒక్కోసారి నన్ను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసింది అని రిషి అంటాడు. నువ్ భూషణ్ ఫ్యామిలీ వారసుడివి ఆటో నడపడం ఏంటీ నాన్నా అని మహేంద్ర అంటాడు. ఆటో నడపడం తప్పు కాదు నాన్నా అని రిషి అంటాడు. రంగాను వాళ్ల ఊరికి తీసుకెళ్లారా అని వసుధార అడిగితే.. వెళ్లిపోయారు. ఇక ఆ విషయంలో ఎలాంటి సమస్య లేదని రిషి అంటాడు.

మను తల్లి జగతే

అమ్మా నీకు లెటర్ రాసిందట కదా. ఏం రాసింది అని మహేంద్ర అడుగుతాడు. ఇంట్లో జరిగిన విషయాల గురించి, దుర్మార్గుల గురించి, మీ గురించి, అనుపమ మేడమ్ గురించి అని రిషి చెబుతాడు. ఏది ఆ లెటర్ ఓసారి నేను చదవచ్చా అని మహేంద్ర అడుగుతాడు. అవును అన్నట్లుగా రిషి తల ఊపుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ లెటర్‌లో మను అసలు కన్నతల్లి ఎవరో రాసి ఉంటుందని తెలుస్తోంది. అది జగతి అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.