Guppedantha Manasu August 23rd Episode: గుప్పెడంత మనసు- రంగానే రిషి అని తెలుసుకున్న శైలేంద్ర- నిలదీసిన బుజ్జి- సరోజ రచ్చ-guppedantha manasu serial august 23rd episode saroja devises a scheme shailendra shock guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 23rd Episode: గుప్పెడంత మనసు- రంగానే రిషి అని తెలుసుకున్న శైలేంద్ర- నిలదీసిన బుజ్జి- సరోజ రచ్చ

Guppedantha Manasu August 23rd Episode: గుప్పెడంత మనసు- రంగానే రిషి అని తెలుసుకున్న శైలేంద్ర- నిలదీసిన బుజ్జి- సరోజ రచ్చ

Sanjiv Kumar HT Telugu
Aug 23, 2024 08:43 AM IST

Guppedantha Manasu Serial August 23rd Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌లో నువ్ మా రంగా అన్నవి కాదు రిషివే కదా. చెప్పమని రంగాను నిలదీస్తాడు బుజ్జి. రిషి నచ్చజెబుతాడు. శైలేంద్ర దగ్గర సరోజ రచ్చ రచ్చ చేస్తుంది. దాంతో రంగానే రిషి అనే నిజం తెలుసుకుంటాడు శైలేంద్ర.

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో శైలేంద్ర గురించి రిషి అనేవాడికి తెలియదు. కానీ, రంగాకు తెలుసు. అన్ని తెలుసుకున్నాడు. ఏం వసుధార కన్‌ఫ్యూజన్‌గా ఉందా. చెప్పాను కొన్నిరోజులు అలాగే ఉంచుతాను అని. రిషిగా చేయలేని పనులు రంగా చేయగలడు. అందుకే ఇంకా ఆ పాత్ర పోషిస్తున్నా. ఇప్పుడు కూడా నేను చేయాల్సినవి, చక్కదిద్దాల్సినవి చాలా ఉన్నాయి. అవి రంగాల చేస్తున్నాను అని రిషి అంటాడు.

ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు. ఎంతకాలం ఈ దోబుచులాటలు అని వసుధార అంటుంది. కథ ముగింపు వచ్చేసరికి క్యారెక్టర్లు బయటపడతాయి. చూస్తూ ఉండు. శూన్యంలోకి కాదు నక్షత్రాల్లోకి అని రిషి అంటాడు. మరోవైపు రంగా చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్న సరోజ వస్తా అన్న బావ ఇంకా రావట్లేదు. ఈ బుజ్జిగాడికి అన్ని తెలుసు. కానీ, వాడు చెప్పడు. వీడితో నిజం చెప్పించాలి అని ఓ ప్లాన్ వేస్తుంది సరోజ. బుజ్జి దగ్గరికి వెళ్లి నువ్వే నాకు సరైనా జోడి అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు చాలా లేట్‌గా తెలుస్తాయి కదా అని సరోజ అంటుంది.

సంబంధం ఉందా

ముందు ఎగిరి గంతేసిన బుజ్జి తర్వాత సరోజ అబద్ధం చెబుతుంది. అది ఎందుకో నాకు అర్థమైంది అని బుజ్జి మనసులో అనుకుంటాడు. బావ వెళ్లినప్పుడే వసుధార వెళ్లిపోయింది. బావను శైలేంద్ర తీసుకెళ్లాడా వసుధారనా అని సరోజ అడిగితే.. శైలేంద్రనే అని బుజ్జి అంటాడు. మరి శైలేంద్రకు వసుధారకు సంబంధం ఉందా అని సరోజ అడిగితే ఏమని చెప్పాలి అనుకున్న బుజ్జి తనకు తెలియదు అంటాడు. శైలేంద్ర డబ్బులిచ్చి తీసుకెళ్తే వసుధారతో ఎందుకు ఉంటున్నాడు అని సరోజ అంటుంది.

మంచి పాయింటే పట్టుకున్నావ్ అని బుజ్జి అంటాడు. వసుధార బావను తీసుకెళ్లింది అని సరోజ అంటుంది. లేదు మేడమ్ గారు అన్నను తీసుకెళ్లలేదు. కానీ, మేడమ్ గారికి ఇవ్వమని అన్న ఒకటి ఇచ్చాడు అని శైలేంద్రతో రంగా ఉన్న ఫొటో ఇవ్వమని చెప్పింది చెబుతాడు బుజ్జి. అంటే బావే వసుధారను అక్కడికి తీసుకెళ్లాడన్న మాట. ఇందులో ఏదో మతలబు ఉంది. అది కనుక్కోవాలి. దానికి ఆ శైలేంద్రను కలవలాలి. ఆయన్ను కలిస్తే తెలిసిపోతుంది అని వెళ్లిపోతుంది సరోజ.

కట్ చేస్తే రంగాను కలుస్తాడు బుజ్జి. ఇద్దరు క్షేమసమాచారాలు, సరోజ, నానమ్మ గురించి మాట్లాడుకుంటారు. నానమ్మ చాలా గొడవ చేస్తుంది. మందులు వేసుకోవట్లేదు అని అంటాడు. నువ్ ఎప్పుడు వస్తావ్ అన్న. ఇంకా ఇక్కడ పని అయిపోలేదా. నేను సరోజ నోరు మూయించలేకపోతున్నాను. చాలా విషయాల్లో ఆరా తీస్తుంది. నువ్ చెప్పినట్లే చేశాను. ఇప్పుడు ఆ శైలేంద్రను సరోజ కలవడానికి రెడీ అయింది అని బుజ్జి అంటుంది. శైలేంద్రను సరోజ కలిసేలా నువ్ చేయి అని రంగా అంటాడు.

రంగావి కాదు రిషివి కదా

అలా చేస్తే సరోజ రచ్చ రచ్చ చేస్తుంది కదా అని బుజ్జి అంటాడు. చెప్పింది చేయు అని చెబుతాడు రంగా. వారి మాటలను వసుధార వింటూ ఉంటుంది. ఎందుకు శైలేంద్రను సరోజ కలిసేలా చేస్తున్నారు. సార్ ఏం ప్లాన్ వేస్తున్నారు అని వసుధార డౌట్ పడుతుంది. అన్నా నిన్ను ఒకటి అడుగుతా చెబుతావా. నువ్ రంగావి కాదు కదా అని బుజ్జి అంటాడు. దాంతో రంగా, వసుధార ఇద్దరూ షాక్ అవుతారు. చెప్పన్న నువ్ మా రంగా అన్నవి కాదు కదా. నాకు బలంగా అనిపిస్తుంది. నువ్ రిషివి అనిపిస్తుంది అని బుజ్జి అంటాడు.

ఎందుకు అన్న మా దగ్గర రంగాల ఉన్నావ్. కచ్చితంగా నేను చెబుతున్నాను. నువ్ మా రంగా అన్నవి కాదు. ముసల్దాని దగ్గరికి నువ్ వచ్చి సంవత్సరం అవుతుంది. చిన్నప్పుడే రంగా ఊరి వదిలి వెళ్లిపోయాడు. తర్వాత నువ్ రంగా అని వచ్చావ్. నువ్ వచ్చి రాగానే అందరిని గుర్తు పట్టినట్లు మాట్లాడావ్. రంగాలాగే ఉన్నావ్. అందరు నిన్ను రంగానే అనుకున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. మేడమ్ గారు వచ్చాక ఆ ఉంగరం ఇచ్చాకే నాకు పక్కాగా అర్థమైంది నువ్ రంగావి కాదు రిషివని అని బుజ్జి అంటాడు.

చెప్పన్న నువ్ రంగాల ఎందుకు వచ్చావ్. మా రంగా అన్న ఎక్కడ ఉన్నాడు అని బుజ్జి అంటాడు. అరేయ్ బుజ్జి నువ్ అనవసరంగా ఆలోచిస్తున్నావ్. ఏదేదో ఊహించుకుంటున్నావ్. అలాంటిదేం లేదురా. నాకు చెప్పిందంతా నానమ్మ దగ్గర చెప్పావా అని రంగా అడుగుతాడు. లేదు నీ దగ్గరే చెప్పాను అని బుజ్జి అంటాడు. మంచిపని చేశావ్ అని రంగా అంటే.. ఎందుకున్న అదే నిజం కదా. ముసల్ది నీపై పాణం పెట్టుకుందన్న. తను ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తుంది. నేను ఎవరికి చెప్పను. చెప్పన్న అని బుజ్జి అంటాడు.

మీ అన్నయ్యకు ఇష్టం లేదు

నేను నీతో తర్వాత మాట్లాడుతాను. నానమ్మ జాగ్రత్త అని రంగా అంటాడు. నేను అన్నదానికి కాదనో అవుననో చెప్పట్లేదు అంటే ఇతనే రిషినా. మరి రంగా ఎక్కడ ఉన్నాడు అని బుజ్జి అనుకుంటాడు. నువ్ ఎక్కువగా మనసు పాడుచేసుకోకు. ఇక్కడి నుంచి వెళ్లు అని రంగా అంటే.. బుజ్జి వెళ్లిపోతాడు. వసుధార కూడా అదంతా విని వెళ్లిపోతుంది. మరోవైపు ధన్‌రాజ్‌కు కాల్ చేసి సరోజ ముందు ప్రేమగా మాట్లాడుతుంది. మన పెళ్లి విషయం మీ అన్నయ్యకు ఓకే కాదని సరోజ చెబుతుంది.

మీరు వెళ్లాక మీ అన్నయ్య వచ్చి మా బావను తీసుకెళ్లాడు. మీతో నేను కూడా వచ్చాను కదా. చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మమ్మ కోసం మా బావను వెతుకుతున్నాను. మీ అన్నయ్య మా బావ గురించి చెప్పట్లేదు. ఇందులో ఏదో తిరకాసు ఉంది. మీకు పెళ్లి ఇష్టంలేకుంటే లేదని చెప్పండి. లేకపోతే ఇలా చేయడం ఏంటండి అని సరోజ అంటుంది. మనం కలిసి ఒకటిగా బతకాలని అనుకుంటున్నాను అని ధన్‌రాజ్ అంటాడు. మన పెళ్లి జరగాలంటే మీ అన్నయ్య వచ్చి తనకు పెళ్లి అంటే ఇష్టమని చెబితే నాకు ఓకే అని సరోజ అంటుంది.

ముందు ఎందుకుని అన్న ధన్‌రాజ్ తర్వాత సరే అని అంటాడు. శైలేంద్రకు కాల్ చేసి ఓసారి కలవాలి. అర్జంట్ అని చెబుతాజు ధన్‌రాజ్. మరోవైపు బుజ్జిని కలిసారా. ఏం మాట్లాడాడు. బామ్మ ఎలాగున్నారు అని రిషితో వసుధార అడుగుతుంది. నా గురించి దిగులుపడుతుందట. అన్ని తెలిసి నన్ను ఎందుకు తీసుకొచ్చావ్. సరే ఇప్పుడంటే శైలేంద్ర అన్నయ్య తీసుకొచ్చాడు. కానీ, దానికంటే ముందు నువ్ కూడా తీసుకురావాలని అనుకున్నావ్ కదా అని రిషి అంటాడు.

మా పెళ్లి ఇష్టం లేదా

ఎన్నాళ్లు అని రంగాలా ఉంటారు. నిజం బయటపెట్టేయొచ్చు కదా అని వసుధార అంటుంది. అన్నిసార్లు నిజం మనం బయటపెట్టాల్సిన అవసరం లేదు. దానంతటే అదే నిజం బయటపడుతుంది. ఇప్పటికే బుజ్జి అడుగుతున్నాడు. కొన్నిసార్లు ఇతరులను బాధపెట్టకుండా ఉండటానికి కూడా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అని రిషి అంటాడు. ఎందుకు చేస్తున్నారో దేనికి చేస్తున్నారో నాకు కూడా చెప్పకూడదా. నా దగ్గర ఎందుకు దాస్తున్నారు అని వసుధార అంటుంది.

ఎందుకు రమ్మన్నావ్. ఏంటీ నీ ప్రాబ్లమ్ అని అడుగుతాడు. నేనే రప్పించాను. నన్ను చూసి షాక్ అయ్యావా. నిజాలు తెలుసుకోవాలని. నా బావను నువ్వే తీసుకొచ్చావ్ కదా. నువ్వేనా ఇంకెవరైనా తీసుకొచ్చారా అని సరోజ అడుగుతుంది. నేను తీసుకొచ్చాను అయితే ఏంటీ ఇప్పుడు అని శైలేంద్ర అంటాడు.

ఆటో ఏం నడుపుతావ్. ఉద్యోగం చేసుకో అని డబ్బులిచ్చి మరి తీసుకొచ్చాను అని శైలేంద్ర అంటాడు. నీకు మా పెళ్లి ఇష్టం లేదా. ఉందని చెప్పండి అని ధన్‌రాజ్ అంటాడు. పెళ్లి టాపిక్ తర్వాత ముందు మా బావ టాపిక్ కాని అని సరోజ గట్టిగా చెబుతుంది. నువ్ మా ఊరికి రాకముందే ఆ వసుధార వచ్చింది. మా బావను అడ్డుపెట్టుకుని రిషి సార్ రిషి సార్ అంటూ వేధించింది. మనకు కాలేజీ ఉంది ఫ్యామిలీ ఉంది. ఇంటికి పదండి అంటూనే ఉండేది. కానీ, మా బావ మాత్రం నేను రిషిని కాదు. రంగాను అని నచ్చజెప్పేవాడు అని సరోజ అంటుంది.

నేను భ్రమపడ్డనా

ఇప్పుడు వసుధారతోనే మా బావ ఉంటున్నాడు. సూటు బూటు వేసి మా బావను మార్చేసింది. తనే కదా నీతో మా బావను తీసుకొచ్చేలా చేసింది. మీ ఇద్దరు ఒక్కటేకదా అని సరోజ అంటుంది. నీతో మా బావకు డబ్బు లిచ్చి రిషి సార్‌లా నటించేలా చేసింది. మీ ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నావా అని సరోజ అంటుంది. దాంతో తెగ షాక్ అయిపోతాడు శైలేంద్ర. నువ్ ఏం మాట్లాడుతున్నావ్ అని వసుధార ఫొటో చూపిస్తాడు శైలేంద్ర.

వసుధార ఫొటో చూపిస్తావేంటీ. తనను ఒక్కసారి చూస్తేనే మర్చిపోం. అలాంటిది మా ఇంట్లో నెలరోజులు ఉంది. మా బావను రిషి సార్ రిషి సార్ అంటూ వేధించింది. అలాంటిది నేను ఎలా మర్చిపోతాను అని సరోజ అంటుంది. దాంతో షాక్ అయిన శైలేంద్ర.. వాడు నిజంగానే రిషినా. నేను రంగా అని భ్రమపడ్డానా అని శైలేంద్ర అనుకుంటాడు. నిజం చెప్పు ఈరోజు వసుధార అంతు చూడాల్సిందే అని సరోజ అంటుంది. దాంతో శైలేంద్ర వెళ్లిపోతాడు.

ఏంటీ వెళ్లిపోతున్నావ్. నువ్ సమాధానం చెప్పకుండా వెళ్లేది లేదు. మీరు మా జీవితాల్లో నిప్పులు పోస్తున్నారు అని సరోజ అంటుంది. నేను మీ బావను మీ ఊరు పంపిస్తాను. రంగాను ఊరికి పంపిచ్చే బాధ్యత నాది అని శైలేంద్ర అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.