Syed Sohel On Rishi: రిషి పర్సనాలిటీకి ఇది కరెక్ట్ సినిమా.. బిగ్ బాస్ సోహైల్ కామెంట్స్-bigg boss fame syed sohel comments on rishi in rudra garuda puranam teaser launch kannada actor rishi comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Syed Sohel On Rishi: రిషి పర్సనాలిటీకి ఇది కరెక్ట్ సినిమా.. బిగ్ బాస్ సోహైల్ కామెంట్స్

Syed Sohel On Rishi: రిషి పర్సనాలిటీకి ఇది కరెక్ట్ సినిమా.. బిగ్ బాస్ సోహైల్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 22, 2024 12:39 PM IST

Bigg Boss Syed Sohel Comments On Hero Rishi: హీరో రిషి పర్సనాలిటీకి, హైట్‌కు ఇది కరెక్ట్ సినిమా అని బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ ఫేమ్ సయ్యద్ సోహెల్ అన్నాడు. రుద్ర గరుడ పురాణం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సయ్యద్ సోహైల్ ఇలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

రిషి పర్సనాలిటీకి ఇది కరెక్ట్ సినిమా.. బిగ్ బాస్ సోహైల్ కామెంట్స్
రిషి పర్సనాలిటీకి ఇది కరెక్ట్ సినిమా.. బిగ్ బాస్ సోహైల్ కామెంట్స్

Syed Sohel Rishi Rudra Garuda Puranam: రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో రూపొందుతోన్న కన్నడ చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. అశ్విని ఆర్ట్స్ బ్యానర్‌‌పై అశ్విన్ విజయ్ లోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు.

yearly horoscope entry point

ముఖ్య అతిథిగా సయ్యద్ సోహెల్

బుధవారం (ఆగస్ట్ 21) రుద్ర గరుడ పురాణం చిత్ర టీజర్‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో రుద్ర గరుడ పురాణం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత మధుర శ్రీధర్ అశ్విన్ ఆర్ట్స్ బ్యానర్ లోగోను లాంచ్ చేశారు. అలాగే మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన బిగ్ బాస్ ఫేమ్, హీరో సోహైల్ మూవీ తెలుగు టీజర్‌‌ను విడుదల చేశారు.

రుద్ర గరుడ పురాణం టీజర్ లాంట్ ఈవెంట్‌లో హీరో సయ్యద్ సోహైల్ మాట్లాడుతూ.. "కన్నడ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్ చాలా బాగుంది. కొత్త కంటెంట్‌ను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. కేజీయఫ్, కాంతారా దగ్గర నుంచి రీసెంట్‌గా వచ్చిన లవ్ టుడే, మహారాజా, 777 ఛార్లీ, మంజుమ్మల్ బాయ్స్ లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులుగా మేం హిట్ చేశాం" అని అన్నాడు.

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

"ఈ రుద్ర గరుడ పురాణం మూవీ టీజర్ చూశాక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌లా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. నందీశ్వర్ గారు చాలా బాగా తీశారు. రిషి గారి హైట్, పర్సనాలిటీకి ఇది కరెక్ట్‌ సినిమా. నాలుగు భాషల్లో ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా" అంటూ ఆల్ ద బెస్ట్ చెప్పాడు బిగ్ బాస్ సయ్యద్ సోహైల్.

"కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే మధుర శ్రీధర్ గారికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన సోహైల్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు మహి వి రాఘవ గారు ‘సైతాన్’ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు నన్ను పరిచయం చేశారు. గరుడ పురాణం ఎలిమెంట్స్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది" అని రుద్ర గరుడ పురాణం హీరో, కన్నడ యాక్టర్ రిషి చెప్పాడు.

చనిపోయిన వారు తిరిగి వస్తే

"రుద్ర అనే పవర్‌‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నా. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన ఒక బస్.. దానిలో చనిపోయిన వారంతా తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా సినిమా ఉంటుంది. చాలా ప్యాషనేట్‌గా నందీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు తమ సపోర్ట్‌ను మరోసారి అందిస్తారని కోరుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని తెలుగు ప్రాజెక్టులు చేస్తున్నా" అని రిషి తెలిపాడు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. "రిషి నటించిన కన్నడ సినిమాలు కొన్ని చూశా. ఆయన టెర్రిఫిక్ ఆర్టిస్ట్. తనతో పాటు టీమ్ అందరికీ ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని కోరారు.

రుద్ర గరుడ పురాణం హీరోయిన్

"ఈ చిత్రంలో భాగమవడం చాలా హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. ఈ సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది" అని రుద్ర గరుడ పురాణం హీరోయిన్ ప్రియ చెప్పుకొచ్చింది.

Whats_app_banner