Guppedantha Manasu August 22nd Episode: గుప్పెడంత మనసు- ఇక రిషి వర్సెస్ మను- తండ్రికోసం అన్నదమ్ముల ఫైట్- నెల డెడ్‌లైన్-guppedantha manasu serial august 22nd episode vasudhara expresses regret rishi vs manu guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 22nd Episode: గుప్పెడంత మనసు- ఇక రిషి వర్సెస్ మను- తండ్రికోసం అన్నదమ్ముల ఫైట్- నెల డెడ్‌లైన్

Guppedantha Manasu August 22nd Episode: గుప్పెడంత మనసు- ఇక రిషి వర్సెస్ మను- తండ్రికోసం అన్నదమ్ముల ఫైట్- నెల డెడ్‌లైన్

Sanjiv Kumar HT Telugu
Aug 22, 2024 09:09 AM IST

Guppedantha Manasu Serial August 22nd Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌లో శైలేంద్రను రంగా ఏమార్చుతాడు. దాంతో శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. నెల పూర్తయ్యేలోపు గన్‌లో బుల్లెట్స్ అన్ని ఖాళీ అయిపోతాయని మను అంటాడు. తండ్రిని దాటాలంటే ముందు తనను దాటాలని రిషి అంటాడు.

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 22వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో నువ్ నాకు డబ్బులు ఇచ్చావ్. కాలేజీలో ఎండీ పోస్ట్ ఇచ్చావ్. మళ్లీ ఈ పోస్ట్ నేను నీకు ఇచ్చి, ఈ కాలేజీ నుంచి ఎలా బయటపడాల అని ఆలోచిస్తున్నాను తప్పా నీ గురించి తెలుసుకుని నేను ఏం చేస్తాను. అది నాకు అనవసరమైన మ్యాటర్ కదా. అంతే కదా అన్నయ్య అని శైలేంద్రను ఏమారుస్తాడు రంగా.

అంతే తమ్ముడు నువ్ ఇలాగే ఉండు అని శైలేంద్ర అంటాడు. కానీ, నేను ఇక్కడ కూరుకుపోతున్నాను అన్నయ్య. ఆ ఫైల్స్ నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ దొరికిపోతానో అని భయంగా ఉంది. నువ్వే ఇక్కడి నుంచి బయటపడాలన్నయ్య. నాకు ఈ బంధాలు అస్సలు పడట్లేదు. నీకు ఎండీ పదవి ఎలా ఇవ్వాలో చెప్పు అన్నయ్య అని రంగా అంటాడు. దాంతో శైలేంద్ర ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటన్నయ్య ఏడుస్తున్నారు అని రంగా అడుగుతాడు.

శైలేంద్ర ఎమోషనల్

ఇవి కన్నీళ్లు కాదు. ఆనంద భాష్పాలు. నేను కచ్చితంగా ఎండీ అవుతాను అవుతాను అనుకుంటూ వెళ్లిపోతాడు శైలేంద్ర. అప్పుడే వచ్చిన వసుధార మీ అన్నయ్యకు ఏం చెప్పారు అంతలా ఎమోషనల్ అయి వెళ్తున్నారు అని అడుగుతుంది. అన్నయ్య గురించి అన్నయ్యకే చెప్పాను. తనకు కావాల్సింది తొందర్లోనే ఉందని చెప్పాను అంతే ఎమోషనల్‌గా వెళ్లిపోయాడు. నాకో చిన్న పని ఉంది. వెళ్లొస్తాను. ఒక్కన్నే వెళ్తాను. వచ్చాక చెబుతాను అని రిషి వెళ్లిపోతాడు.

సార్‌కు మను తండ్రి గురించి చెప్పాక కూడా కూల్‌గా ఉన్నారు. సార్‌కు చెప్పలేదని నేను చాలా గిల్ట్‌గా ఫీల్ అయ్యాను. కానీ, సార్ ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది. సార్ ఏదో దాస్తున్నారు అని రిషిని అనుమానిస్తుంది వసుధార. మరోవైపు మహేంద్ర చేసిన మెసేజ్‌ను మను చదువుతాడు. కోపంతో ఫోన్ పగులగొట్టాలని అనుకుంటాడు. కానీ, అనుపమ రావడంతో ఆగిపోతాడు. జ్యూస్ గ్లాస్ పెట్టి అనుపమ వెళ్లిపోతుంటే నాకేం వద్దని అంటాడు మను.

తాగితే తాగు లేకుంటే లేదు అని అనుపమ అంటుంది. దాంతో కోపంగా ఫోన్ పగులగొడతాడు మను. ఇవాళ ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. రిషి, వసుధార వచ్చారని ఇంకెవరు రాలేదని చెబుతుంది అనుపమ. అయితే రిషికి చెప్పారా నా తండ్రి ఎవరనేది అని మను అడుగుతాడు. నాకేం చెప్పలేదు. కానీ, నాకు తెలిసింది. తర్వాత నేను చెప్పాల్సి వచ్చింది అని అనుపమ అంటుంది. ఏం చెప్పావ్. ఏమని చెప్పావ్ అని మను అంటాడు.

బుల్లెట్స్ ఖాళీ అవుతాయి

ఇప్పటికే నేను చిరాకులో ఉన్నాను విసిగించకు అని అనుపమ అంటుంది. నేను విసిగించాను అమ్మ. నా బాధ కనిపించట్లేదా. రిషికి ఏమని చెప్పావ్ అని మను అడుగుతాడు. మహేంద్ర నీ తండ్రి అని చెప్పాను అని అనుపమ అంటుంది. అందుకు రిషి ఏమన్నాడు అని మను అడుగుతాడు. ఏం అనలేదు. ఆ విషయం చెప్పాక నా మొహం చూపించలేక నేను నా రూమ్‌లోకి వెళ్లిపోయాను అని అనుపమ అంటుంది. మా నాన్న ఇంటికి వచ్చాడా అని మళ్లీ అడుగుతాడు మను.

ఒకసారి చెబితే అర్థం కాదా అని అనుపమ అంటుంది. మరి ఎందుకు ఆయన పదే పదే మెసేజ్‌లు చేస్తున్నాడు. ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటున్నారు. ఆయనకు రిషి చెప్పారా. లేదా ఇంకేలా అయిన విషయం తెలిసే అవకాశం ఉందా అని మను అంటాడు. లేదని అనుపమ అంటుంది. దాంతో గన్ పట్టుకుని పోని నేను తెలుసుకోనా. డైరెక్ట్ ఆయన్నే అడిగి తెలుసుకుంటాను. ఈ ఆగస్ట్ నెల అయిపోయే లోగా ఈ గన్‌లోని బుల్లెట్స్ ఖాళీ అయిపోతాయ్. ఇది కచ్చితం అని మను కోపంగా వెళ్లిపోతాడు.

నిజం తెలుసుకుందామంటే అనుపమ, మను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే అని మహేంద్ర ఆలోచిస్తుండగా.. రిషి, వసుధార వస్తారు. అనుపమను కలిశారా. మను తండ్రి గురించి అడిగారా. తన తండ్రి ఎవరో తెలుసుకున్నారా. నీకు కూడా చెప్పలేదా అని వసుధారను అడుగుతాడు మహేంద్ర. మను తండ్రి విషయం అప్పుడు ఇప్పుడు తెలుసుకునే అవకాశం రాలేదు మావయ్య అని వసుధార అంటుంది. మరి ఎలా తెలుసుకున్నావ్ అమ్మా అని మహేంద్ర అంటాడు.

ప్రాబ్లమ్ ఏమవుతుందా అని

దాంతో వసుధార షాక్ అవుతుంది. అదేనమ్మా తెలుసుకునే అవకాశం లేనప్పుడు ఎలా తెలుసుకున్నావ్. ఎందుకు నా దగ్గర నిజం దాచావ్. మను తండ్రి విషయం. నా విషయం ఎందుకు దాచావ్ అని నిలదీస్తాడు మహేంద్ర. డాడ్‌కు నిజం తెలిసింది వసుధార. డాడ్ మన వెనుకాలే అనుపమ ఇంటికి వచ్చారు. అఫ్‌కోర్స్ నేనే రమ్మన్నాను. మనకు తెలియాల్సిన విషయం డాడ్‌కు తెలియకుండా ఉండే విషయం ఏమై ఉంటుందా అనుకున్నాను. ప్రాబ్లమ్ ఏమవుతుందా అని అనుకున్నాను అని రిషి అంటాడు.

ప్రాబ్లమ్ అవుతుందనే కదా ఇన్నాళ్లు ఆగింది. సారీ మావయ్య నన్ను క్షమించు. నేను చాలా సార్లు చెబుదామని ట్రై చేశాను. కానీ, ఏం జరుగుతుందో అని అనుపమ గారే నన్ను ఆపారు. ఆవిడను కాదని రిషి సార్‌కు కూడా చెప్పలేదు. ఎన్నోసార్లు అడిగిన చెప్పలేదు అని వసుధార చెబుతుంది. ఇన్నాళ్లు నిజం తెలిస్తే సమస్య అనుకున్నావ్. కానీ, నిజం తెలియడమే సొల్యూషన్ అని తెలుసుకోలేకపోయావ్. మనుకు కూడా తెలియాలి అని రిషి అంటాడు.

వద్దు సార్ మను గారికి తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఇన్నాళ్లు తండ్రిమీద ద్వేషంతో పెరిగిన మను ఈరోజు నిజం తెలియగానే ఏమైనా జరగొచ్చు అని వసుధార అంటుంది. ఏమైనా జరగాలి అంటే ముందు నన్ను దాటాలి. డాడ్‌ను టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి అని రిషి అంటాడు. చూస్తుంటే తండ్రి కోసం రిషి వర్సెస్ మను వార్ జరిగేలా ఉంది. ఇదంతా ఏంటో నాకే షాకింగ్‌గా ఉంది. నేనేంటి నేను మను తండ్రిని ఏంటని ఆశ్చర్యపోయాను. నాకు అసలు ఏం తెలియట్లేదు అని మహేంద్ర అంటాడు.

మను తల్లి ఎవరై ఉంటారు

మీకు తెలియకుండా ఎలా మావయ్య అని వసుధార అంటుంది. అదేకదా చెబుతుంది. ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే అనుపమ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అసలు ఈ విషయం అనుపమే చెప్పిందా. పోని ఎక్కడైనా మిస్ కమ్యునికేషన్ జరిగిందా అని మహేంద్ర అంటాడు. అలాంటిదేం లేదు. మేము చాలా సార్లు విశ్లేషించుకున్నాం. మనం మాట్లాడుకోవాల్సింది మను తండ్రి గురించి కాదు. మను తల్లి గురించి. తన తప్పేం లేదంటుంది అంటే తను తల్లి కాదనేగా అర్థం. మరైతే మను తల్లి ఎవరై ఉంటారు అని వసుధార అనుమానపడుతుంది.

అసలు అనుపమ నిజం ఎలా దాస్తుంది. తననే అడగాలని అని మహేంద్ర బయలుదేరుతుంటే రిషి ఆపుతాడు. కొంచెం ఓపికగా ఉండండి. మీరేం చెయొద్దు. మీరు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం. మీకు నిజం కావాలి. నేను కనుక్కుంటాను. అనుపమ గారితోనే నేను చెప్పిస్తాను. అంతవరకు ఈ విషయం గురించి మీరు ఎవరిని కలవద్దు అని రిషి అంటాడు. తర్వాత వసుధార ఆలోచిస్తుంటే రిషి వచ్చి పలకరిస్తాడు.

శూన్యం విలువ గురించి చెబుతుంది అని వసుధార. మీరు లేనప్పుడు నా మానిస్థిక స్థితి అంతా గుర్తుకు వచ్చింది. మీరు ఎంతో ఆవేశంగా ఉంటారు కదా. కానీ, మీరు ఇప్పుడు ఇంత కూల్‌గా ఎలా ఉంటున్నారు. దేనికి రియాక్ట్ కావట్లేదు. చిన్నగా తల ఊపి ఊరుకుంటున్నారు. అన్ని విషయాలను పాజిటివ్‌గా చూస్తున్నారు అని వసుధార అడుగుతుంది. మనకు విషయంపై క్లారిటీ లేనప్పుడే రియాక్ట్ అవుతాం. క్లారిటీ ఉంటే రియాక్ట్ అవ్వం అని రిషి అంటాడు.

క్లారిటీ వచ్చింది

ఎవరు తప్పు చేసిన క్లారిటీ ఉంటే డిస్టర్బ్ అవ్వం. ఆ తప్పులను సరిదిద్దాలి అని రిషి అంటాడు. మరి కాలేజీలో ఉన్నప్పుడు నా తప్పులను సరిదిద్దకుండా ఎందుకు పనిష్ చేశారు అని వసుధార అడుగుతుంది. అప్పుడు నాకు క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు నాకు అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చిందని రిషి అంటాడు. అదేలా నాకు చెప్పండని వసు అడుగుతుంది. చెప్పను కొన్నాళ్లు నిన్ను కన్‌ఫ్యూజన్‌లో ఉంచుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రిషి అంటాడు.

నీకు జీవితాంతం ప్రేమ ఇద్దామనుకుంటున్నా. అంతా నేను చనిపోయానంటే నువ్ మాత్రమే నమ్మావ్ అని రిషి అంటాడు. నాకు లాగే మీరు రంగా అని తెలిసినవాళ్లకు రిషి అని తెలిస్తే.. సరోజ, మీ ఊరు వాళ్లు అని వసుధార అంటుంది. ఏదో ఒక రోజు నిజం తెలియాల్సిందే. కానీ, దాన్ని అంతా అంగీకరించాల్సిందే అని రిషి అంటాడు. నిజాన్ని అంగీకరించలేని మీ అన్నయ్య శైలేంద్ర, పెద్దమ్మ దేవయాని ఉన్నారు. వాళ్లకు నిజం తెలిస్తే అని వసుధార అంటుంది.

నిజం తెలిస్తేనే కదా ఈ నాటకానికి అంతం అని రిషి అంటాడు. మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు అని వసుధార అంటుంది. నిజమే. రిషి అనేవాడికి తెలియదు. వాడు తెలుసుకోలేకపోయాడు. కానీ, రంగాకు తెలుసు అని రిషి అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.