Guppedantha Manasu July 30th Episode: గుప్పెడంత మనసు- మహేంద్ర కాళ్లు మొక్కిన రంగా- భయపడిన శైలేంద్ర- రిషికి వసుధార హగ్-guppedantha manasu serial july 30th episode vasudhara rishi reunite vasu hugs rishi guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu July 30th Episode: గుప్పెడంత మనసు- మహేంద్ర కాళ్లు మొక్కిన రంగా- భయపడిన శైలేంద్ర- రిషికి వసుధార హగ్

Guppedantha Manasu July 30th Episode: గుప్పెడంత మనసు- మహేంద్ర కాళ్లు మొక్కిన రంగా- భయపడిన శైలేంద్ర- రిషికి వసుధార హగ్

Sanjiv Kumar HT Telugu
Jul 30, 2024 08:32 AM IST

Guppedantha Manasu Serial July 30th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 30వ తేది ఎపిసోడ్‌లో ఇంటికి రంగాను తీసుకెళ్తాడు శైలేంద్ర. అక్కడ మహేంద్ర కాళ్లకు నమస్కరిస్తాడు రంగా. ఆ తర్వాత రిషిని వెనుక నుంచి హగ్ చేసుకుంటుంది వసుధార. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 30వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 30వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మా బాబాయ్ పేరు మహేంద్ర అని నీకెలా తెలుసు అని రంగాను శైలేంద్ర అడుగుతాడు. దాంతో సైలెంట్‌గా ఉండిపోతాడు రంగా. సైలెంట్‌గా ఉంటావేంటీ అని శైలేంద్ర కంగారుగా అడుగుతాడు. మీరే కదా సార్ చెప్పారు. రిషి కథ గురించి, అమ్మ నాన్నల గురించి చెప్పారు కదా. మర్చిపోయి ఉంటారు అని రంగా అంటాడు.

తప్పు చేసి దొరికిపోతే

హో.. ఓకే. సరే ఇది మా ఫ్యామిలీ. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా అని శైలేంద్ర అడిగితే.. ఓ ఫొటోకు క్రాస్ మార్క్ చేసి ఉందేంటి. ఎవరది అని రంగా అడుగుతాడు. ఆ పాత్ర పని అయిపోయిందిలే. ఇక రాదు. తను రాదనే నీ అవసరం పడిందని వసుధార గురించి చెబుతాడు శైలేంద్ర. సరే వీళ్లను ఓసారి చూడాలి. ఇప్పుడే చూడాలి. లేకుంటే మీకు సమస్య. రేపు ఏదైనా నేను తప్పు చేసి దొరికిపోతే మీరే కదా చిక్కుల్లో పడేది అని రంగా అంటాడు.

వాళ్లు నిన్ను చూస్తే ప్లాబ్లమ్ అవుద్ది అని శైలేంద్ర అంటాడు. వాళ్లు నన్ను చూడకుండా నేను వాళ్లను చూస్తాను. ఏం తేడా రాదు సర్ అని రంగా అంటాడు. నువ్ మాటి మాటికి నన్ను సర్ అన కూడదు. అన్నయ్య అని పిలువు. మనిద్దరి మధ్య బంధం ఇలాగే ఉండాలి అని శైలేంద్ర అంటాడు. సరే అన్నయ్య అని రంగా అంటాడు. తర్వాత ఇల్లు చూపిస్తాడు శైలేంద్ర. దాంతో రిషి ఎమోషనల్ అవుతాడు. ఏంటీ అలా చూస్తున్నావ్. ఇలాంటి ఇల్లు చూసిండవులే. రేపు ఇది మనిల్లు అవుతుందని శైలేంద్ర అంటాడు.

దాక్కున్న రంగా

సరే ఆ కిటికీ దగ్గరుండి చూడు. నేను అందరిని పిలిచి చూపిస్తాను శైలేంద్ర చెబుతాడు. సరే అని కిటికీ దగ్గరికి వెళ్తాడు రంగా. ఇంట్లోకి వెళ్లిన శైలేంద్ర అందరినీ పిలుస్తాడు. అంతా వస్తారు. అప్పుడే మహేంద్రను ఆప్యాయంగా చూస్తాడు రిషి. ఏంట్రా ఎందుకు పిలిచావ్ అని శైలేంద్రను అంతా అడుగుతారు. కాలేజీ గురించి, కాలేజీ చేయిదాటడం గురించి శైలేంద్ర చెబుతుంటాడు. ఇంతలో మహేంద్ర అటు ఇటు చూస్తాడు. రంగా దాక్కుంటాడు.

ఏమైందని శైలేంద్ర అడుగుతాడు. నన్నెవరో పిలిచినట్లు. నన్ను చూస్తున్నట్లు అనిపిస్తుంది అని మహేంద్ర అంటే.. అమ్మో.. ఇప్పుడు రంగా కనిపిస్తే ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుందని శైలేంద్ర భయపడిపోతాడు. నాకు ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. నా కొడుకు కోడలు తిరిగి వస్తారని అనిపిస్తోందని, పడిపోయిన నన్ను నా కొడుకు నిలబెడతాని అనిపిస్తోందని మహేంద్ర అంటాడు. మా అందరికీ నీలాగే రిషి రావాలని ఉందని, కానీ, అది అసాధ్యం అని ఫణీంద్ర అంటాడు.

సంతోషపెట్టలేకపోయాను

తెలుసు అన్నయ్య. నా కోరిక తీరనిదని, ఊహల్లో బతకడం అలవాటు అయిందని మహేంద్ర అంటాడు. దాంతో లేదు డాడ్ మీ కోరిక నెరవేరుతుంది. రేపు కచ్చితంగా తీరుతుంది. నీ కొడుకు తిరిగి వస్తున్నాడు అని రిషి అంటాడు. మనిషి ఆశజీవి. పైనున్న తధాస్తు దేవతలు తధాస్తు అంటే రిషి వస్తాడేమో అని దేవయాని అంటుంది. ధరణి నీకు నాపై కోపం ఉండొచ్చు. నేను నిన్ను ఎప్పుడు సంతోషపెట్టలేకపోయాను అని శైలేంద్ర అంటాడు.

మీపై నాకు కోపం లేదు. కానీ, కాలేజీ దూరం అయిపోతుందని బాధగా ఉందని ధరణి అంటుంది. లేదు వదినా. కాలేజీ దూరం కాదు అని రిషి అంటాడు. ఏ చిన్ని ఆస్కారం ఉన్నా. ఏ చిన్న అవకాశం ఉన్న కాలేజీని నేను తీసుకొచ్చుకునేవాన్ని. ఇంకా ఏం చేయలేం. అంతా అయిపోయిందని అని ఫణీంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. పెద్దనాన్న డీబీఎస్టీ కాలేజీ ఎప్పటికీ మనదో, ఎక్కడికీ పోదు. మీరిలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను అని రిషి అంటాడు.

ఎవరో ఉన్నారంటూ

మీరు ఇలా బాధపడాలని నేను ఇలా చేయలేదు. ఓసారి అంతా కలిసి కాలేజీకి వెళ్దామని, మీరు కూడా రావాలని బాబాయ్ అని శైలేంద్ర అంటాడు. లేదు. నేను రాలేను అని మహేంద్ర అంటాడు. లేదు డాడ్ మీరు రావాలి. మీతో నేను మాట్లాడాలి అని రిషి అనుకుంటూ వెనక్కి జరుగుతాడు. అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ లాంటి వస్తువు కింద పడి చప్పుడు వస్తుంది. దాంతో అంతా కిటికీ వైపు చూస్తారు. రిషి చాలా కంగారుపడిపోతాడు.

ఏంటా సౌండ్. అక్కడో ఎవరో ఉన్నారు. ఎవరో ఉన్నారనిపిస్తోంది అని ధరణి అంటుంది. ఎవరు లేరని శైలేంద్ర కవర్ చేయాలని చూస్తాడు. ధరణి చెబుతుందిగా. ఎవరున్నారో చూస్తే తెలిసిపోతుంది కదా అని అక్కడికి వెళ్తారు. అక్కడ ఎవరు కనిపించరు. దాంతో ఎవరు లేరని చెప్పాను కదా. డాడ్ మీరు ఇక్కడే ఉంటే ఇంకా బాధపడిపోతారు. లోపలికి పదండి అని శైలేంద్ర అంటాడు. దాంతో ఫణీంద్ర, దేవయాని వెళ్లిపోతారు.

తండ్రి కాళ్లకు నమస్కరించిన రిషి

మహేంద్ర ఒక్కడే అక్కడ మెట్లపై కూర్చుంటాడు. నాన్నా రిషి నువ్ ఇక్కడే ఉన్నావనిపిస్తోంది. ఇది నిజమా భ్రమనా అని తల పట్టుకుని కూర్చుంటాడు మహేంద్ర. అప్పుడే అక్కడికి రిషి వచ్చి మహేంద్ర కాళ్లకు నమస్కరిస్తాడు. మహేంద్ర రిషి స్పర్శకు మేలుకుని చూస్తాడు. కానీ రిషి ఉండడు. రిషి నువ్ ఇక్కడే ఉన్నావనిపిస్తోంది. ఇక్కడికి వచ్చావని అనిపిస్తోంది. కానీ, ఎక్కడ కనిపించట్లేదని మహేంద్ర అనుకుంటాడు. మరోవైపు రిషి నడుచుకుంటూ మహేంద్ర మాటలు గుర్తు చేసుకుంటాడు.

ఇంతలో శైలేంద్ర కాల్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. ఇంటికి వెళ్తున్నానని రంగా అంటాడు. హమ్మయ్యా. నువ్ ఇక్కడే ఉంటే ప్లాన్ ఎక్కడ బయటపడుతుందో అని కంగారుపడిపోయాను. కాలేజీ స్టూడెంట్స్ భవిష్యత్ ఎక్కడ నాశనం అవుతుందో అని కంగారుపడ్డాను అని డ్రామా ప్లే చేస్తాడు. రేపు చెప్పిన టైమ్‌కు కాలేజీకి రా. ఎవరి కంట పడకూడదు. కాలేజీ పేరు గుర్తుందా. డీబీఎస్టీ కాలేజ్. సరే రేపు ఎలా వస్తావు అని శైలేంద్ర అడుగుతాడు.

గంట ముందే బయలుదేరు

సిటీ బస్సులో అని రంగా అడిగితే వద్దులే కారు పంపిస్తాను అని శైలేంద్ర అంటాడు. అలా అయితే డ్రైవర్ నన్ను చూస్తాడు. అప్పుడు మీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా అని రంగా అంటాడు. అవును కదా. ఆటోలో వచ్చేయ్. అలా అని నువ్వే ఆటో నడుపుకుంటూ రాకు. ఆటో మాట్లాడుకుని వచ్చేయ్. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. గంట ముందే బయలుదేరు అని శైలేంద్ర అంటాడు. అలా గంట ముందే రావాలి అంటే ఇప్పుడు మీరు నన్ను వదిలేయాలి అన్నయ్య అని రంగా అంటాడు.

ఓ అలాగా.. సరే ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. కట్ చేస్తే ఇంటికి వెళ్తాడు రంగా. డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయేంటీ.. ఎవరొచ్చారు అని రంగా అనుమానపడుతుంటాడు. ఇంతలో వెనుక నుంచి వసుధార వచ్చి హగ్ చేసుకుంటుంది. రంగా కూడా అలాగే ఉండిపోతాడు. ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. నాకు తెలుసు సార్. మీరు నా రిషి సార్ అని నాకు తెలుసు అని వసుధార అంటుంది. వసుధార అని రిషి పిలిస్తే.. ఐ లవ్యూ సార్ అని మళ్లీ హగ్ చేసుకుని రిషి గుండెలపై పడుతుంది వసుధార.

ఎవరైనా తల వంచాల్సిందే

ఐ లవ్యూ సో మచ్ అని హగ్ చేసుకుంటాడు రిషి. వసుధార ఏడుస్తూ ఉంటుంది. అది చూసి హే.. నేను మీ రిషి సార్ అని ఒప్పుకున్నాను కదా. మళ్లీ ఎందుకు ఈ కన్నీళ్లు. నువ్ బాధపడుతుంటే నేను చూడలేను అని రిషి అంటాడు. మరి ఇన్నాళ్లు ఎందుకు ఏడిపించారు సార్ అని వసుధార అంటుంది. నన్ను క్షమించు. నీ వ్యక్తిత్వానికి ఎవరైనా తలవంచాల్సిందే. నీకు బాధ్యత అప్పజెపితే.. నువ్ ఎన్ని అడ్డొంకులు వచ్చినా నిలబడ్డావ్ అని రిషి అంటాడు.

మరి నేను పారిపోయి వచ్చాను అని అన్నారు కదా. నేను మీకు కాలేజీకి ద్రోహం చేశాను అన్నారు కదా అని వసుధార అంటుంది. నేను అలా అంటే.. నువ్ ఇంటికి వచ్చి కాలేజి కాపాడుతావనుకున్నా. కానీ నువ్ పొగరు కదా. నా మాటలు కూడా కదిలించలేదు అని రిషి అంటాడు. ఆ పొగరే మిమ్మల్ని రిషి సార్ అని ఒప్పుకునేలా చేసింది. మీరు నన్ను అన్నారని బాధపడకండి. మీ మనసు చంపుకుని నన్ను అలా అని ఉంటారని నాకు తెలుసు అని వసుధార అంటుంది.

నాకు స్థానం దొరకడం

మనుషులను అర్థం చేసుకోవడంలో నీ తర్వాతే ఎవరైనా. నీ మనసులో నాకు చోటు దొరకడం చాలా అదృష్టం అని రిషి అంటాడు. లేదు సార్ మీ మనసులో నాకు స్థానం దొరకడం నా అదృష్టం. మీలాంటి వ్యక్తికి ఏ అమ్మాయికి భర్తగా రారు అని మళ్లీ హగ్ చేసుకుంటుంది వసుధార. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner