Guppedantha Manasu July 6th Episode: గుప్పెడంత మనసు- అనుపమను క్షమించమన్న ఫణీంద్ర- తగ్గని దేవయాని- హడలిపోయిన శైలేంద్ర-guppedantha manasu serial july 6th episode anupama confronts devayani phanindra apology guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu July 6th Episode: గుప్పెడంత మనసు- అనుపమను క్షమించమన్న ఫణీంద్ర- తగ్గని దేవయాని- హడలిపోయిన శైలేంద్ర

Guppedantha Manasu July 6th Episode: గుప్పెడంత మనసు- అనుపమను క్షమించమన్న ఫణీంద్ర- తగ్గని దేవయాని- హడలిపోయిన శైలేంద్ర

Sanjiv Kumar HT Telugu
Jul 06, 2024 08:31 AM IST

Guppedantha Manasu Serial July 6th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 6వ తేది ఎపిసోడ్‌లో ఏంజెల్, మనులను దేవయాని అన్నమాటలకు ఫణీంద్ర ఇంట్లో గొడవ పెట్టుకుంటారు మహేంద్ర, అనుపమ. దాంతో వాళ్ల తరఫున క్షమించమని అంటాడు ఫణీంద్ర. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 6వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 6వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో సరోజ నీకు మళ్లీ చెబుతున్నాను. మేడమ్ గారి విషయంలో నువ్ అనవసరంగా మళ్లీ గొడవ చేయకు అని రంగా అంటాడు. ఏంటీ బావా నువ్వు. ఆ పిల్ల కోసం నా మీద అరుస్తున్నావేంటీ అని సరోజ అంటుంది. మళ్లీ అదే చేస్తున్నావ్. ఎన్నిసార్లు చెప్పినా నా ఉద్దేశం అర్థం చేసుకోకపోతే ఎలా అని రంగా వెళ్లిపోతాడు.

వాడిని అర్థం చేసుకోకుంటే ఎలా

ఏంటీ అమ్మమ్మ బావ అలా అంటుంటే ఏం మాట్లాడవేంటీ. మాకు పెళ్లి చేయాలని నీకు లేదా అని సరోజ అంటుంది. ఎందుకు లేదు. మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఉంది. కానీ, వాడి మనసు కాదని ఏం చేయలేను. అయినా నీ తొందరపాటుతోనే వాడికి కోపం తెప్పిస్తున్నావ్. ఇష్టమైనవాడిని చుట్టూ తిప్పుకోవాలి కానీ వాడిని అర్థం చేసుకోకుంటే ఎలా అని రాధమ్మ అంటుంది. తనను నువ్ అయినా పంపించొచ్చు కదా అని సరోజ అంటుంది.

వాడు ఇన్ని చెప్పాకా ఎలా పంపిస్తానే. వాడి మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. వాడి పెళ్లి నీతోనే. నిన్నే ఏలుకుంటాడు. సరేనా అని రాధమ్మ చెబుతుంది. అమ్మమ్మ నాకు ధైర్యం చెబుతుంది గానీ, ఆ వసుధారకే సపోర్ట్ చేస్తుంది. నేను సైలెంట్‌గా ఉంటే ఆ వసుధార బావను నా నుంచి తుడిసిపెట్టేస్తుంది. ఎలాగైనా సరే ఆ వసుధారను వదిలించుకోవాలి అని సరోజ వెళ్లిపోతుంటుంది.

నా బాధ నాది

ఆపిన రాధమ్మ అది కాదే ఇలా చిన్నపిల్లల బెట్టు చేయకు. పెళ్లయ్యాకా కూడా ఇలా సమస్యలు వస్తుంటాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఆవేశపడకు. కాపురం కూలిపోతుంది తప్పా. ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తులు అయినా సరే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. లేకుంటే బంధం విడిపోతుంది. నువ్ కాస్తా ఓపికగా ఉండు అని రాధమ్మ చెబుతుంది. పో అమ్మమ్మ నువ్ ఎప్పుడు ఇలానే చెబుతావ్ గానీ బాధ అనుభవించేది నేను. అది నాకు మాత్రమే తెలుసు అని సరోజ అంటుంది.

మరోవైపు దేవయాని అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది ఏంజెల్. ఏమైందని, ఎందుకు అలా ఉన్నావని మహేంద్ర, అనుపమ అడుగుతారు. దాంతో నీవల్లే అత్తయ్య. నీవల్లే ఏదో ఒక ఇష్యూ వస్తుంది. ఆ దేవయాని వచ్చి ఏం మాట్లాడిందో తెలుసా అని ఏెంజెల్ అంటుంది. నువ్ సైలెంట్‌గా ఉండు, ఏదైనా మనం చూసుకుందాం అని మను అంటాడు. నేను బావను కలవడానికి కాలేజీకి వెళ్తే.. కాలేజ్ పాడు చేస్తున్నాని, గెస్ట్ హౌజ్ చేస్తున్నాని నీచంగా మాట్లాడిందని ఏంజెల్ చెబుతుంది.

సొసైటీకి ఏదైనా నష్టమా

పక్కనే ఆ శైలేంద్ర ఉన్నాడు. ఇద్దరూ కలిసి మాట్లాడారు. మను బావని తండ్రి లేడని అంటున్నారు. అలాంటి వాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వాలి అత్తయ్య. నిజమేంటో చెబితే.. ఇంకొకరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు కదా అని ఏంజెల్ అంటుంది. ఎందుకు చెప్పాలి. అది నా వ్యక్తిగత విషయం. దానివల్ల నీకు ఏమైనా నష్టమా. తనకేమైనా సమస్య. సొసైటికీ ఏదైనా సమస్య. నా వల్ల సొసైటీకి ఏదైనా సమస్య వచ్చింటే మాట్లాడేదాన్ని. అంతేగానీ ఎవరి కోసమో నేనెందుకు చెప్పాలి అని అనుపమ అంటుంది.

మా వదినకు బుద్ధి లేదు. తను అలాగే మనుషులను గుచ్చి గుచ్చి అడుగుతుంది. పద అనుపమ. వెళ్లి కడిగేద్దాం పదా అని మహేంద్ర అంటుంది. ఇప్పుడు ఎందుకు సర్ అని మను అంటాడు. లేదు. తను చాలా ఎక్స్‌ట్రాలు చేస్తుంది. ఇప్పుడు లేకుంటే తర్వాత మళ్లీ అంటుంది. ఎప్పుడోసారి కంట్రోల్ చేయాల్సిందే కదా అని మహేంద్ర అంటాడు. మీరు ఆవేశంలో ఉన్నారు. రేపు కాలేజీలో తీరిగ్గా మాట్లాడుకుందాం అని మను అంటాడు.

ఎన్నాళ్లని సైలెంట్‌గా ఉంటాం

అక్కడ మీ అన్నయ్య ఉంటారేమో అని అనుపమ అంటుంది. ఆయన ముందే అడుగుదాం. అలా అయితేనే నోరు మెదపదు. ఆయనకు తెలియకుండా ఇవన్ని చేస్తుంటుంది అని మహేంద్ర అంటాడు. మహేంద్ర వెళ్తుంటే మను ఆపుతాడు. కానీ, ఇలా ఉంటే తను అలాగే రెచ్చిపోతుందని అనుపమను తీసుకుని బయలుదేరుతాడు. ఎందుకు చెప్పావ్, అక్కడ ఏం గొడవ జరుగుతుందో అని మను అంటాడు.

జరగాల్సిందే జరుగుతుంది. ఎన్నాళ్లని సైలెంట్‌గా ఉంటాం. నీ తప్పు లేకున్న నిన్ను అన్ని మాటలు అనట్లేదా అని ఏంజెల్ అంటుంది. కట్ చేస్తే.. ఇంట్లో వదినా గారు అంటూ మహేంద్ర అరుస్తాడు. దాంతో ఫణీంద్ర బయటకు వస్తాడు. ఏమైంది. ఎందుకు అంత కోపంగా ఉన్నావ్. మళ్లీ మీ ఇద్దరిని ఏమైనా తను అందా అని ఫణీంద్ర అడుగుతాడు. హుమ్ అన్నట్లుగా తల ఊపిన మహేంద్ర తను వస్తే మీకు తెలుస్తుందని అంటాడు.

ఎలాగైన బయటపడాలి

దేవయాని అని ఫణీంద్ర పిలిస్తే.. దేవయాని వస్తుంది. ఎప్పుడొచ్చారు అని దేవయాని మర్యాదలు చేస్తుంది దేవయాని. శైలేంద్ర కూడా వస్తాడు. అవన్నీ వద్దన్న మహేంద్ర.. మర్యాదలు చేయడమే కాదు వదినా గారు. మాట్లాడటం కూడా తెలియాలి అని మహేంద్ర అంటాడు. ఏంటీ మహేంద్ర గొడవ పెట్టుకోవాలని వచ్చావా అని దేవయాని అంటుంది. మీరు గొడవ పెట్టుకున్నారు కాబట్టే మేము ఇక్కడికి వచ్చామని మహేంద్ర అంటాడు.

అనుపమ అన్నయ్య ఇక్కేడ ఉన్నారుగా చెప్పు. భయపడకు అని మహేంద్ర అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ అని దేవయాని అంటుంది. మీరు మాట్లాడినదాని గురించి అని అనుపమ అంటుంది. వామ్మో ఇప్పుడు ఈవిడ నిజం చెప్పేస్తే డాడ్ మమ్మల్ని బతకనిస్తాడా. లేదు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలి అని అనుకున్న శైలేంద్ర.. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు. లేదు ఇప్పుడే మాట్లాడాలి. నువ్ ఎందుకు అడ్డు పడుతున్నావ్ అని ఫణీంద్ర అంటాడు.

ఆవేదనకు గురి చేస్తున్నారు

లేదు వాళ్లు ఆవేశంగా ఉన్నారు. ఇప్పుడు మాట మాట పెరిగి గొడవ పెద్దదై పోతుందని అని శైలేంద్ర కవర్ చేస్తాడు. లేదు. నా వెనుక మీకు మీకు బాగానే జరుగుతున్నాయని అర్థమైంది. ఇప్పుడే అవన్ని తెలియాలి. అనుపమ నువ్ చెప్పు అని ఫణీంద్ర అంటాడు. దాంతో ఎందుకు నా కొడుకును బాధపెడుతున్నారు. ఆవేదనకు గురి చేస్తున్నారు. అలా ఎవరైనా మాట్లాడుతారా. వాడి తండ్రి గురించి అడిగి ఎందుకు మాటలు అంటున్నారు అని అనుప అంటుంది.

ఫణీంద్ర కోపంగా చూస్తాడు. ఏదైనా ఉంటే నన్ను అడగండి. వాడిని ఎందుకు అడుగుతున్నారు. నన్ను అడగండి. నా కొడుకు మీద పడిపోకండి అని అనుపమ అంటుంది. సరే నిన్నే అడుగుతాను. మను తండ్రి ఎవరు అని దేవయాని అంటుంది. దాంతో అనుపమ సైలెంట్ అయిపోతుంది. చెప్పు. మనును కన్నతండ్రి ఎవరు. అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు. అసలు బతికే ఉన్నాడా. చనిపోయాడా అని దేవయాని అంటుంది.

జోక్యం చేసుకోవద్దు

నోరు అదుపులో పెట్టుకోను మాట్లాడు. ఇంకోసారి మను తండ్రి గురించి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను అని అనుపమ అంటుంది. నువ్ ఇలా నిజం దాచేస్తే అందరూ ఇలాగే అనుకుంటారు. అందుకే నిజం చెప్పు. నీ ఇష్టప్రకారం నడవదు. నువ్ సమాజంలో బతుకున్నావ్. ముఖ్యంగా ఒక బిడ్డకు తల్లిదండ్రులు ఎవరని తెలియాలి అని దేవయాని అంటుంది. అదంతా నాకు తెలియదు. ఇంకోసారి మా విషయంలో జోక్యం చేసుకోకు. మీకే మంచిది అని అనుపమ అంటుంది.

జోక్యం చేసుకుంటాను. నాకు మను తండ్రి తెలిసి తీరాలి అని దేవయాని అంటుంది. ఇక ఆపు దేవయాని. నువ్ నీ కొడుకు చేసే పనికి నా తల కొట్టేసినట్లు అవుతుంది. మీ ఇద్దరికి చాలా సార్లు చెప్పాను. ముందు వెనుక తెలియకుండా ఎదుటివాళ్లకు ఇబ్బంది పడేలా మాట్లాడొద్దని. కానీ, మీరు ఇలాగే ఉన్నారు ఛీ ఛీ.. మీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో అర్థం కావట్లేదు. అమ్మా అనుపమ వాళ్లు చేసినదానికి నేను క్షమాపణ చెబుతున్నాను అని చేతులతో దండం పెడతాడు ఫణీంద్ర.

రాద్దాంతం చేస్తుంది

అయ్యయ్యో మీరు అంతపెద్ద మాట అనొద్దు సార్. వీళ్లు నా జోలికి, నా కొడుకు జోలికి రాకుంటే సరిపోద్ది సార్. పద మహేంద్ర అని అనుపమ అంటుంది. ఒక్క నిమిషం ఆగమని చెప్పిన ఫణీంద్ర.. మీరిద్దరు ఒకింట్లో ఉంటున్నారు. మీ మధ్య సంబంధం, మను కన్నతండ్రి ఎవరనేది కుటుంబ పరువు పోతుందన్న భయంతో తను అలా అడిగి ఉండొచ్చు. మీ వదిన క్యారెక్టర్ నీకు బాగా తెలుసు కదా. చిన్న వాటికే పరువు అని రాద్దాంతం చేస్తుంది. మీరు ఎలాంటి తప్పు చేయరని నాకు తెలుసు అని ఫణీంద్ర అంటాడు.

నాకు మీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను దేవయానికి సర్ది చెప్పగలను. కానీ, బయట ఎంతోమంది దేవయానిలు ఉన్నారు. వాళ్లకు ఎలా సర్దిచెబుతారు. త్వరగా దీనికి పరిష్కారం వెతకండి. నలుగురి నోళ్లలో చెడుగా నానడం మంచిది కాదు. సరే మీరు వెళ్లి రండి అని ఫణీంద్ర అంటాడు. మహేంద్ర, అనుపమ వెళ్లిపోతారు. ఇలాంటి గొడవ ఇంకొకసారి పెట్టకండి. ఇకనైన ఇతరులపై దృష్టి పెట్టకుండా మీ పని చూసుకోండని చెప్పి వెళ్లిపోతాడు ఫణీంద్ర.

కుట్రలు చేయడం ఈజీ అనుకున్నావా

మామ్ ఒక్కసారిగా గుండె ఆగినంత పనైపోయిందని శైలేంద్ర అంటే.. అవునురా నాకు కూడా అలాగే ఉంది దేవయాని అంటుంది. డాడ్‌కు నీ మీద కోపంతో పాటు సానుభూతి, ప్రేమ ఉందని శైలేంద్ర అంటాడు. దాంతో సిగ్గుపడిన దేవయాని తెలుసురా. అందుకే ఇన్నాళ్లుగా ఆయనకు తెలియకుండా ఇలాంటి పను చేస్తున్నాను అని దేవయాని అంటుంది. ఇంతలో ఎలాంటి పనులు అని ధరణి అంటుంది. ఏంటీ ధరణి ఎప్పుడు లాస్ట్ వచ్చి పంచ్ వేసి పోతావ్. ముందే ఎందుకు రావు అని శైలేంద్ర అంటాడు.

ముందే వస్తే తెలియాల్సిన వాళ్లకు తెలియాల్సింది తెలిసిపోతుంది కదా. అలా జరగకూడదనే దేవుడు ఇలా మిమ్మల్ని కాపాడుతున్నాడు అనుకుంటా. మొన్నే చెప్పాను కదా కుట్రలు కుతంత్రాలు చేయకుండా పని చేసుకుంటే అయిపోతుంది కదా అని ధరణి అంటుంది. కుతంత్రాలు చేయడం అంత ఈజీ అనుకున్నావా. తను వేసే ప్లాన్స్‌కు ఎంత టెన్షన్ పడుతాడో ఫ్రస్టేషన్‌గా చెబుతాడు శైలేంద్ర. ఎప్పుడూ బెటర్ ప్లాన్ వేసినా నువ్ వచ్చి ధర్మమే గెలుస్తుందని మా ఆశలు సన్నగిల్లేలా చేస్తావ్ అని శైలేంద్ర అంటాడు.

ధరణి పంచ్

చాలు చాలు ఇంకాస్తా చెబితే మీ ప్రాణాలకు నష్టం అని తాళి కళ్లకు అద్దుకుంటుంది. మీరు లెంతీ డైలాగ్స్ చెప్పకండి. చిన్న చిన్నగా బాగా చెబుతారు అని ధరణి అంటుంది. నువ్ ఏంటీ ఎప్పుడు సీన్ లాస్ట్‌లో వస్తావని దేవయాని అంటే.. సినిమా చూశాకే కదా రివ్యూ ఇచ్చేదని ధరణి అంటుంది. నువ్ మా సినిమా చూడకముందే రివ్యూ ఇస్తున్నావ్ కదా అని శైలేంద్ర అంటాడు. దాని రివ్యూ నాకు ముందే తెలుసు కదండి అని పంచ్ వేసి వెళ్లిపోతుంది ధరణి. శైలేంద్ర, దేవయాని ఇద్దరు మొహాలు చూసుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

WhatsApp channel