Guppedantha Manasu July 10th Episode: గుప్పెడంత మనసు.. రంగానే రిషి, మరోసారి కన్ఫర్మ్.. బెదిరించేది ఎవరో కనిపెట్టిన అనుపమ-guppedantha manasu serial july 10th episode anupama finds who threatening her on phone guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu July 10th Episode: గుప్పెడంత మనసు.. రంగానే రిషి, మరోసారి కన్ఫర్మ్.. బెదిరించేది ఎవరో కనిపెట్టిన అనుపమ

Guppedantha Manasu July 10th Episode: గుప్పెడంత మనసు.. రంగానే రిషి, మరోసారి కన్ఫర్మ్.. బెదిరించేది ఎవరో కనిపెట్టిన అనుపమ

Sanjiv Kumar HT Telugu
Jul 10, 2024 08:15 AM IST

Guppedantha Manasu Serial July 10th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 10వ తేది ఎపిసోడ్‌లో రంగాను తన ఉండే సిటీకి తీసుకొస్తుంది వసుధార. అక్కడ మరోసారి రంగానే రిషి అని కన్ఫర్మ్ అవుతుంది. మరోవైపు తనను బెదిరించేది ఎవరో కనిపెడుతుంది అనుప. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 10వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 10వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాధమ్మను రంగా గురించి అడుగుతుంది వసుధార. అసలు రంగా మీ మనవడేనా అని వసుధార అడుగుతుంది. దాంతో అదేంటమ్మా అలా అడిగావ్. నన్ను ఎవరు ఇలా అడగలేదు. రంగా నా మనవడే. నువ్ కూడా చాలామందిని అడిగావ్. ఇంకా నమ్మకం కుదరట్లేదా అని రాధమ్మ అంటుంది. మీ మనవడి విషయంలో మీరు ఏదైనా దాస్తున్నారా అని వసుధార అడుగుతుంది.

వాడు నీ భర్త కాదు

దాంతో చేతిలో ఉన్న కుండ పడేస్తుంది రాధమ్మ. కంగారుపడుతుంది. దాంతో ఎందుకు కంగారుపడుతున్నారు. అసలు రంగా ఇక్కడే మీ దగ్గరే పెరిగారా. ఇక్కడ ఏం చేసేవారు. ఎంతవరకు చదువుకున్నారు అంటూ చాలా ప్రశ్నలు వేస్తుంది వసుధార. అమ్మా నీ భర్తల నా మనవడు ఉండటంతో నీకు ప్రశ్నలు వస్తున్నాయి. నీ భర్తల నా మనవడు ఉంటాడనేది నాకు తెలియదు. కానీ, వాడు నీ భర్త రిషి కాదమ్మా అని రాధమ్మ చెబుతుంది.

ఇన్నిరోజులుగా చూస్తున్నావ్ కదా. వాడికి నేను, నాకు వాడు తప్పా ఇంకెవరం లేము అని రాధమ్మ అంటుంది. లేదు బామ్మ. తను మా రిషి సారే. తన ఆవేశం, మాట తీరు అంతా ఒకటే. కానీ మీకు మా రిషి సార్ అంటే ప్రాణం అని అర్థమైంది. నేను రిషి సార్‌తోపాటు మిమ్మల్ని కూడా మా ఇంటికి తీసుకెళ్తాను అని వసుధార అంటుంది. దాంతో రాధమ్మ నవ్వేస్తుంది. ఏంటీ నా మనవడిని మీ ఇంటికి తీసుకెళ్తావా. నవ్వొస్తుంది అని రాధమ్మ అంటుంది.

వసు రాధమ్మ మాటలు విన్న రంగా

నా మనసుకు తెలుస్తుంది తనే మా రిషి సార్ అని వసుధార అంటుంది. సరేనమ్మా రంగా నీ భర్త రిషి అంటున్నావ్ కదా. రేపు మీ ఇంటికి వెళ్లాక అక్కడ నీ భర్త రిషి ఉంటే.. ఏంటమ్మా పరిస్థితి. అప్పుడు కూడా నా మనవడినే రిషి అంటావా అని రాధమ్మ అడుగుతుంది. దాంతో షాక్ అయిన వసుధార ఇక్కడ రిషి సార్ ఉంటే అక్కడ ఎలా ఉంటారు అని అంటుంది. అదంతా పక్కన ఉన్న రంగా వింటాడు. ఏంటి బామ్మ నేను అనేది నిజమేనా అని వసుధార అంటుంది.

ఏంటోనమ్మా నీ పిచ్చి నమ్మకం. వెళ్లి పడుకో. నాకు కూడా నిద్రొస్తుందని రాధమ్మా అంటుంది. వసుధార వెళ్లగానే రాధమ్మ కంగారు పడినట్లు చూపిస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు వసుధార, రంగా వెళ్తుంటే.. సరోజ వచ్చి ఒక్క నిమిషం అని ఆపుతుంది. రాత్రి చెప్పాగా ఒక గిఫ్ట్ ఇస్తానని. చెప్పకుండా వెళ్లిపోతున్నారు. నాకు చిన్నప్పటినుంచి నా బావ అంటే చాలా ఇష్టం. కళ్లు మూసిన తెరిచిన తనే కనిపిస్తాడు. చిన్నప్పుడు నా బావకు గాయమైంది. అది చూసి కళ్లు తిరిగి పడిపోయాను. తనకు గాయమైతేనే విలవిల్లాడిపోతాను అని సరోజ అంటుంది.

దూరమైతే బాధగా ఉంటుంది

నీ బాధ, నీ ప్రేమ అర్థం అవుతోంది. కానీ, రిషి సార్ గుండె చప్పుడు నేను. మా బంధానికి మేము ఓ పేరు కూడా పెట్టుకున్నాం. దాని పేరు రిషిధార. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక్కసారి వచ్చి మా ప్రపంచంలోకి చూడు. ప్రతిది మా ప్రేమకు సాక్ష్యంగా ఉంటుంది. నువ్ ఎక్కువగా మీ బావపై ప్రేమ పెంచుకోకు. మనకు ఇష్టమైంది దూరమైతే బాధగా ఉంటుంది అని వసుధార అంటుంది. దూరం కావడం ఏంటీ. ఇప్పటికీ రిషినే అనుకుంటున్నావా అని సరోజ అంటుంది.

అనవసరంగా ఆశలు పెట్టుకోకని చెబుతున్నాను. ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం కదా. అక్కడ తేలిపోతుంది. రిషి సార్ అని తెలిస్తే.. ఇక్కడికి రారు. ఒకవేళ తేలకపోతే నా బావ రంగానే. ఇక్కడికి వస్తారు. కానీ, రారు. ఎందుకంటే తనే రిషి సార్ కాబట్టి అని వసుధార అంటుంది. చూడు బావ ఎలా మాట్లాడుతుందో. నువ్ రావా బావ. అక్కడే ఉంటావా అని సరోజ అంటుంది. ఊరుకోవే. మేడమ్ గారి సంగతి తెలుసు కదా అని రంగా అంటాడు.

బావ నాకు మాటిచ్చాడు

దీంతో నిన్ను ఒంటరిగా పంపడం కరెక్ట్ కాదు. నేను కూడా నీతో వస్తాను. తనను ఇంట్లో దింపి మనం వద్దాం అని సరోజ అంటుంది. నా గురించి నీకు తెలుసు కదా. నువ్ రావడం బాగోదు. ఈ బావ మాట వింటావు కదా అని రంగా అడిగితే.. నువ్ కచ్చితంగా వస్తావ్ కదా అని సరోజ అంటుంది. వస్తానని రంగా అంటే.. వసుధార రాడని తల ఊపుతుంది. ఇది ఏమంటే మనకేంటీ.. బావ నాకు మాటిచ్చాడు అని సరోజ మనసులో అనుకుంటుంది.

వసుధారకు బొట్టు పెట్టి వసుధారకు గిఫ్ట్ ఇస్తుంది సరోజ. అందులో ఉంది నాకిష్టం లేని కలర్ చీర. చాలా కాస్ట్‌లిది. ఎక్కడ పడేయాలో తెలియక నీకు పడేస్తున్నాను. దాంతోపాటు వెళ్లు. నా జీవితంలోంచి కూడా అని సరోజ అంటుంది. సరే వెళ్లొస్తాను. మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ధైర్యంగా ఉండు అని వసుధార అంటుంది. తర్వాత ఇద్దరూ వెళ్లిపోతారు. ఏం జరుగుతుందో ఏమై. అది ఏదేదో అంటుంది. నా బావ తిరిగి వచ్చేవరకు భయంగానే ఉంది అని సరోజ అనుకుంటుంది.

నాలుగో మనిషికి ఎలా తెలిసింది

మరోవైపు ఫోన్ కాల్స్‌లో వచ్చే బెదిరింపు గురించి గురించి పెద్దమ్మను అడుగుతుంది అనుపమ. మను తండ్రి మహేంద్ర అని నీకు నాకు వసుధారకు తప్పా ఇంకెవరికి తెలియదు అని పెద్దమ్మ అంటుంది. పెద్దమ్మ నువ్వు అని అనుపమ అనుమానంగా అంటుంది. నన్ను అనుమానిస్తున్నావా. మను ఎన్నిసార్లు అడిగిన చెప్పలేదు. తెలిస్తే మహేంద్రకు ప్రమాదం. వసుధార కూడా చెప్పేరకం కాదని పెద్దమ్మ అంటుంది. మరి నాలుగో మనిషికి ఎలా తెలిసిందని అనుపమ అంటుంది.

ఆ బెదిరించినవాడు ఏమంటున్నాడని పెద్దమ్మ అడుగుతుంది. మను తీసుకుని సిటీ విడిచిపెట్టి వెళ్లిపోవాలట అని అనుప అంటుంది. ఇదేదో కుట్రలా ఉంది. మీ వల్ల వాళ్లకు ఏదో ఇబ్బంది ఉంది. అందుకే ఇలాంటి కథ అల్లి పంపించాలని చూస్తున్నారు. బెదిరింపులకు భయపడొద్దు అని పెద్దమ్మ అంటుంది. దీని వెనుక ఎవరున్నారో నాకు అర్థమైంది. నేను కన్ఫర్మ్ చేసుకుని చెబుతాను అని అనుపమ కాల్ కట్ చేస్తుంది. నన్నే బెదిరించాలని చూస్తారా. చెబుతాను అని అనుపమ అనుకుంటుంది.

రంగా అడుగులో వసుధార అడుగు

మరోవైపు బస్‌స్టాప్‌లో వసుధార, రంగా ఎదురుచూస్తుంటారు. జ్ఞాపకాలు ఏమైన గుర్తుకు వస్తున్నాయా అని వసుధార అడిగితే.. ఇక్కడ నాకేం ఉంటాయి. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఎలా వెళ్లడం అని రంగా అడుగుతాడు. ఎలాగైన వెళ్లొచ్చు. ఆటోలో వెళ్దాం అని ఇద్దరూ వెళ్తారు. ఆటోలో రంగానే చూస్తూ ఉంటుంది వసుధార. నేను తిరిగి రావడం అంటూ జరిగితే అది రిషి సార్‌తోనే అని వసుధార చెప్పిన మాట గుర్తు చేసుకుంటుంది.

నేను మీకు తెలియదా. చెబుతా మీ సంగతి అని ఓ చోట ఆటో ఆపిస్తుంది వసుధార. ఇక్కడేనా మీ ఇల్లు అని రంగా అడిగితే.. కాదు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్దాం అని వసుధార అంటుంది. రంగా నడుస్తుంటే నీడలో తనను చూస్తూ తన వెనుకే నడుస్తుంది వసుధార. అది గమనించిన రంగా ఆగిపోతాడు. పదండని వసుధార అంటుంది. మళ్లీ రంగా వెనుకే వసుధార నడుస్తుంది. దాంతో మళ్లీ ఆగిన రంగా పక్కకు నడవచ్చు కదా అంటాడు.

మళ్లీ రిషి అని కన్ఫర్మ్

నాకు మీ అడుగులో అడుగు వేసి నడవడం ఇష్టమని వసుధార చెబుతుంది. వాళ్లిద్దరూ నడుస్తున్న చోట కారు పక్కకు ఎవరితోనే మహేంద్ర మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరు మహేంద్రను దాటి వెళ్లిపోతారు. మహేంద్ర చూసేలోపు పక్కన మరో కారు వచ్చి ఆగుతుంది. దాంతో చూడకుండానే మహేంద్ర వెళ్లిపోతాడు. కాసేపటికి ఓ చోట ఆగి.. ఎటువైపు వెళ్లాలని రంగా అడుగుతాడు. మీకు తెలియదా సార్ అని వసుధార అంటే.. నాకెల తెలుస్తుందండి అని రంగా అంటాడు.

అటువైపు అని వసుధార చెబుతుంది. ఆ.. అటువైపు కాదనుకుంటా.. ఇటు వైపు అనుకుంటా అని రంగా అంటాడు. దాంతో వసుధార షాక్ అవుతుంది. తనే రిషి అని వసుధార మరోసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నట్లు చూపించారు.

WhatsApp channel