Guppedantha Manasu August 20th Episode: కన్నతండ్రిపై మాట తూలిన రిషి- మను తండ్రి తానేనన్న నిజం తెలుసుకున్న మహేంద్ర-guppedantha manasu serial august 20th episode shocking news for mahendra on manu father guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 20th Episode: కన్నతండ్రిపై మాట తూలిన రిషి- మను తండ్రి తానేనన్న నిజం తెలుసుకున్న మహేంద్ర

Guppedantha Manasu August 20th Episode: కన్నతండ్రిపై మాట తూలిన రిషి- మను తండ్రి తానేనన్న నిజం తెలుసుకున్న మహేంద్ర

Sanjiv Kumar HT Telugu
Aug 20, 2024 08:35 AM IST

Guppedantha Manasu Serial August 20th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌లో మనును శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకుంటాడు. మరోవైపు మను తండ్రి ఎవరో తెలియక కన్నతండ్రినే తిడతాడు రిషి. తర్వాత మను తండ్రి తానే అనే నిజం మహేంద్రకు తెలుస్తుంది.

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అనుపమ వాళ్ల ఇంటికి వెళ్దాం అని మహేంద్ర అంటాడు. మీరు వద్దు మేము వెళ్తాం అని రిషి అంటాడు. నువ్వే కదా రమ్మన్నావ్ అని మహేంద్ర అడిగితే.. ఇప్పటికైతే మేము వెళ్తాం. మీరు తర్వాత వద్దురు. ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అని రిషి అంటాడు.

వసుధారపై డౌట్

వసుధార నన్ను అవాయిడ్ చేసి అనుపమను కలవాలని అనుకుంటుంది. వసుధార నా దగ్గర ఏదో దాస్తుంది అని మహేంద్ర అనుమానపడతాడు. మరోవైపు శైలేంద్ర, దేవయాని చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంటాడు మను. ఇంతలో శైలేంద్ర కాల్ చేసి బ్రదర్ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. ఎవర్రా నీకు బ్రదర్, తమ్ముడు అని మను ఫైర్ అవుతాడు. ఏది ఏమైనా నేను అన్నయ్యను. నువ్ రక్తసంబంధాన్ని కాదనలేవు అని శైలేంద్ర అంటాడు.

ఏంట్రా. నీకు ఏం కావాలి అని మను అడుగుతాడు. ఓసారి మనిద్దరం కలుద్దాం. ఫోన్‌లో చెప్పలేను. నా నుంచి విలువైన సమాచారం వస్తుందని నీకు తెలుసు కదా అని శైలేంద్ర అంటాడు. నువ్ ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావో నాకు తెలుసు. ఫోన్ పెట్టేయమని మను కసురుకుంటాడు. నేను చెప్పేది విని కట్ చేయి. నేను ఏదోటి చేస్తాను అన్నాను కానీ, ఏం చేస్తానో చెప్పలేదు కదా అని శైలేంద్ర అంటాడు. ఏం చేస్తావ్ అని మను అంటాడు. అప్పుడే కిందకు వచ్చిన అనుపమ ఆ మాటలు వింటుంది.

ముందుకు నడిపిస్తాను

నువ్విప్పుడు కలవడానికి నా దగ్గరికి రాకపోతే మీ అమ్మకు కాల్ చేసి నిజం చెప్పేస్తాను. నువ్ నన్ను కిడ్నాప్ చేయించి నీకు కావాల్సిన విషయం గురించి తెలుసుకున్నావని, ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నావని పూస గుచ్చినట్లు చెబుతాను అని శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో ఛ అని కాల్ కట్ చేస్తాడు. ఫోన్ ఎవరు చేశారు. మను ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుపమ ఆలోచిస్తుంది. నువ్ వస్తావని నాకు తెలుసు. ఇప్పుడు కథ ముందుకు నడిపిస్తాను అని శైలేంద్ర అనుకుంటాడు.

అనుపను రిషి, వసుధార కలుస్తారు. మను గురించి వసుధార అడుగుతుంది. తెలియదు. ఇంతకుముందే ఫోన్ మాట్లాడి హడావిడిగా వెళ్లిపోయాడని అనుపమ అంటుంది. ఎక్కడికి వెళ్లాడో అడగలేదా అని వసుధార అంటుంది. ఈ మధ్య వాన్ని ఫేస్ చేయలేకపోతున్నాను. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. వాడి ప్రవర్తన మారిందని అనుపమ అంటుంది. తర్వాత అనుపమ, వసుధార ఇద్దరూ కిచెన్‌లోకి వెళ్లిపోతారు. నేనొక నిర్ణయం తీసుకున్నాను అని వసుధార చెబుతుంది.

గన్ గురిపెట్టిన మను

నేను ఆందోళన పడుతుంటే రిషి సార్ నన్ను చాలా సార్లు అడిగారు. ఇక సార్‌కు మను తండ్రి విషయం చెబుదామని నిర్ణయించుకున్నాను. మీ సమక్షంలోనే ఆ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను సార్‌కు అబద్ధం చెప్పలేకపోతున్నాను అని వసుధార అంటుంది. రిషికి తెలిస్తే సమస్యలు వస్తాయని అనుపమ అంటుంది. భయపడకండి మేడమ్. సార్‌కు తెలిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. భయపడి ఆగిపోతే ముందు వచ్చే పరిస్థితులను ఊహించలేం. ఇప్పుడు సార్‌కు విషయం చెప్పేస్తాను అని వసుధార అంటుంది.

ఏ విషయం వసుధార అని రిషి వస్తాడు. కట్ చేస్తే శైలేంద్రపై మను గన్ గురిపెట్టి ఉంటాడు. ఇంకోసారి ఫోన్ చేసి బెదిరిస్తే మర్యాదగా ఉండదు అని మను అంటాడు. నువ్ వార్నింగ్ ఇవ్వడం తప్ప చేసేదేం లేదని నాకు తెలుసులే. నీ దగ్గరే కాదు నా దగ్గర కూడా గన్ ఉంది. నీలా చీటికి మాటికి వాడను. రాజీవ్ గాడి విషయంలో ఇలాగే వాడి ఇరుక్కున్నావ్. సరే వదిలేయ్. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. నాకు తెలిసిన విషయాలు ఎవరికీ తెలియవు తెలుసా అని శైలేంద్ర అంటాడు.

ఏం చేయాలని అనుకుంటున్నావ్

తెలిసిన ఏం చేయలేవు. నన్నెందుకు పిలిచావ్ అని మను అంటాడు. మీ నాన్న ఎలా ఉన్నారు అని శైలేంద్ర అంటాడు. మను మరింత కోప్పడతాడు. ఇలాగే మనును ఇరిటేట్ చేస్తాడు శైలేంద్ర. నువ్ నీ తండ్రిమీద కోపం, ద్వేషం పెంచుకున్నావ్. తండ్రి ఎవరో తెలియగానే తనను అంతమొందిస్తాననే దృఢ సంకల్పంతో ఉన్నావ్ కదా. మరి ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసింది కదా. ఏం చేయబోతున్నావ్. అదే మా బాబాయ్‌ను ఏం చేయాలని అనుకుంటున్నావ్ అని శైలేంద్ర అంటాడు.

నువ్ మారిపోయావ్ మను. బాబాయ్ మీ తండ్రి ఎవరు అని తెలియగానే నీ ప్రతిజ్ఞలు మర్చిపోయావా. లేకుంటే బాబాయ్ నీ తండ్రి అని బయటపడితే ఆయన నీకు వారసత్వం, పేరు అన్ని ఇస్తారని ఆశపడుతున్నావా. అంటే వీటికోసమే నువ్ వెనక్కి తగ్గుతున్నావా. నీ నిర్ణయాన్ని మార్చుకునేది అని శైలేంద్ర అంటాడు. నేను మనుని శైలేంద్రను కాదు. ఆస్తుల కోసం అయినావళ్లను ఇబ్బంది పెట్టను. ఇలా తప్పుడు కూతలు కూస్తే ఊరుకోను అని మను అంటాడు.

మను వార్నింగ్

ఏం చేస్తావ్ అని శైలేంద్ర అడుగుతాడు. ఇంకోసారి నాకు ఫోన్ చేసినా ఈ విషయం గురించి మాట్లాడిన గన్‌లో ఉన్న బుల్లెట్లు నీ గుండెల్లోకి దూసుకెళ్తాయి. జాగ్రత్త. నాకు నిజం తెలిసిందని మా అమ్మకు చెబుతా అన్నావ్ కదా. సరే అలాగే చెప్పేసేయ్. మా అమ్మకే కాదు. నీకు ఎవరికి చెప్పాలనిపిస్తే వాళ్లకు చెప్పు. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఆగస్ట్ నెల అయిపోయేలోగా నేను ఏం చేస్తానో నువ్వే చూస్తావ్ అని వార్నింగ్ ఇచ్చి వెల్లిపోతాడు మను.

మరోవైపు చెప్పు వసుధార అని రిషి అంటాడు. మను గారికి తండ్రి ఎవరో తెలియదు. అది తెలియక చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్నారు. కానీ, ఆయనకు సమాధానం దొరకట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఓపికగా వినండి అని వసుధార అంటుంది. వసుధారను ఆపిన రిషి మేడమ్ మీరు మీ కొడుకు దగ్గర నిజం దాచిపెట్టారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని నాకు అర్థమైంది. తన తండ్రి ఎవరో చెప్పమని నేను అడగను. ఎందుకు చెప్పకూడదని అనుకుంటున్నారో మాత్రమే అడుగుతున్నాను అని రిషి అంటాడు.

తండ్రిని తిట్టిన రిషి

చెప్పలేనని అనుపమ అంటుంది. ఎందుకు చెప్పలేరు. మను తండ్రి మంచివారు కాదా. తనకు బాధ్యతలు తెలియవా. తను తాగుబోతా, తిరుగుబోతా.. లేక తనైమైనా నీచుడా, దుర్మార్గుడా అని తన తండ్రిని తానే అంటాడు రిషి. సర్ ఇక చాలు ఆపండి. మీరేం మాట్లాడుతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను అని వసుధార అంటుంది. నేను ఏమన్నాను. చెడ్డవాడా ఏంటీ అని అడుగుతున్నాను అని రిషి అంటాడు. సార్ మీరు మాట తూలకండి. మను తండ్రి ఎవరో కాదు.. మావయ్యేనే అని వసుధార చెబుతుంది.

దాంతో రిషి షాక్ అవుతాడు. అప్పటివరకు అక్కడికి వచ్చి పక్కనే ఉండి ఆ మాటలు విన్న మహేంద్ర కూడా చాలా షాక్ అవుతాడు. అంటే మను తండ్రి మా డాడ్ అంటావా. అసలు నువ్ ఏం మాట్లాడుతున్నావ్ అని రిషి అంటాడు. నేనా అని మహేంద్ర అనుకుంటాడు. వసుధార ఈ ఒక్క విషయమే దాచిపెట్టారా లేకుంటే ఇంకా ఏమైనా ఉందా అని రిషి అడుగుతాడు. మను తండ్రి మా డాడ్ అని చెబుతుంది. నిజమేనా అని రిషి అడుగుతాడు.

పాపిష్టిదాన్ని

నిజం. మహేంద్రే మను తండ్రి. నేనొక పాపిష్టి దాన్ని. ఇదంతా కాల నిర్ణయం. ఇందులో నా తప్పులేదు. కానీ, నేను తప్పు చేశాను అని అనుపమ వెళ్లిపోతుంది. మహేంద్ర షాక్‌లో ఉండి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.