Guppedantha Manasu August 21st Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రకు వసుధారతో సారీ చెప్పించిన రిషి- మను అటాక్‌పై రంగా ఆరా
Guppedantha Manasu Serial August 21st Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 21వ తేది ఎపిసోడ్‌లో మను గురించి రిషి, వసుధార మాట్లాడుకుంటారు. ఏంటా పెద్ద విషయం అని ఎంట్రీ ఇచ్చిన శైలేంద్రపై వసుధార ఫైర్ అవుతుంది. దాంతో సారీ చెప్పిస్తాడు రిషి. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఆ మను గాడు నాకు అర్థం కావట్లేదు మామ్. నేను వాన్ని ఎంత రెచ్చగొట్టిన రెచ్చిపోలేదు. పైగా నాకే వార్నింగ్. నేను వాడికి షాక్ ఇద్దామని వెళితే.. నాకే వాడు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు అని దేవయానితో శైలేంద్ర చెబుతాడు.
తల్లిని నిందించారు
ఏమన్నాడురా అని దేవయాని అడిగితే.. ఆగస్ట్ అయిపోయేలోపు ఏం జరుగుతుందో చూడు అని అన్నాడు. అంటే ఏం చేస్తాడు మామ్ అని శైలేంద్ర అంటాడు. వాడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు. మొన్నటివరకు తండ్రి ఎవరో తెలియగానే చంపేస్తా అన్నవాడు ఏం చేయట్లేదనే కదా నీ బాధ. అదేరా రక్తసంబంధం అంటే. తండ్రిమీద ప్రేమే ఉంటుంది కానీ, ద్వేషం ఉండదురా. మనుకు తండ్రి ఎవరో తెలియదు. అంతా తనను అవమానించారు. తల్లిని నిందించారు. దాంతో ఆవేశంతో అలా మాట్లాడాడు అని దేవయాని అంటుంది.
తండ్రి ఎవరో తెలిశాకా ఆవేశం తగ్గిపోయింది. పైగా మహేంద్ర అంటే మనుకు అభిమానం. అందుకే ఏం చేయలేకపోతున్నాడు. వాన్ని నువ్ ఇలాగే రెచ్చగొడుతూ ఉండు. మహేంద్రపై ఉసిగొలుపు అని దేవయాని అంటుంది. అది కష్టం మామ్. ఇంకోసారి ఈ విషయం మాట్లాడిని కలవడానికి చూసిన వెంటనే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అని శైలేంద్ర అంటాడు. అంటే ఇప్పుడు మనుతో ఏం ప్లాన్ చేయలేనని అంటున్నావ్. అయితే ఇది ఆలోచించాల్సిన విషయమే అని దేవయాని అంటుంది.
మనుగాడు ఏమైనా చేయొచ్చు
మనుగాడు చాలా ముదురు మామ్. తెలియకుముందు ఒకలా తెలిసాకా మరోలా ఉంటున్నాడు అని శైలేంద్ర అంటాడు. ఆ తండ్రీకొడుకులు ఒకరినొకరు కొట్టుకుని చస్తారు. ఈ విషయం తెలిస్తే మహేంద్ర ఎలా రియాక్ట్ అవుతాడనేది చాలా ఇంపార్టెంట్. మను, అనుపమతో మహేంద్ర దీనిపై డిస్కస్ చేస్తే మాట మాట పెరిగే వాడు మనుగాడు మహేంద్రను ఏమైనా చేయొచ్చు. వాడికి అసలే ఆవేశం ఎక్కువ అని దేవయాని అంటుంది. మరోవైపు తాను మను తండ్రి అన్న విషయంపై మహేంద్ర ఆలోచిస్తుంటాడు.
నేను మను తండ్రిని ఏంటీ. వసుధార అంటే అనుపమ ఎందుకు అలా రియాక్ట్ అయింది. నేను మను తండ్రిని కాదు కదా. అనుపమ చెప్పకుండా వసుధార అంత కచ్చితంగా మాట్లాడదు కదా. జగతి ఏంటిది. మనం ముగ్గురం మంచి ఫ్రెండ్స్ కదా. తనను మంచి ఫ్రెండ్‌లాగే చూశాను కదా. కానీ, ఎప్పుడు ప్రేమ అనే మాట రాలేదు. జగతి నా మనసులో నీకు తప్పా ఎవరికి చోటు ఇవ్వలేదు. ఎక్కడో పొరపాటు జరిగింది. దానికి మీరిద్దరే సమాధానం చెప్పాలి. అనుపమ నోరు తెరవదు. నువ్ లేవు ఎలా అని మహేంద్ర అనుకుంటాడు.
మహేంద్ర మెసేజ్
వసుధార గతంలో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. ఈ విషయం గురించి రిషి ఎలా రియాక్ట్ అవుతాడో. అసలు మనుకు ఈ విషయం తెలుసా. తెలియకపోతే నేనే మాట్లాడుతాను. నేను కలిసి చెబుతాను అని మహేంద్ర అనుకుని మనుకు కాల్ చేస్తాడు. అది చూసి మను కోపంతో రగిలిపోతాడు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మహేంద్ర మళ్లీ కాల్ చేస్తాడు. అయినా మను లిఫ్ట్ చేయడు. మను నీతో మాట్లాడాలి. కాల్ లిఫ్ట్ చేయి అని మహేంద్ర మెసేజ్ పంపిస్తాడు.
నేను మీతో మాట్లాడలేను. మిమ్మల్ని కలవలేను. కలిస్తే ఏం జరగుతుందో భయంగా ఉంది. ఇది కోపమా బాధ అని తేల్చుకోలేకపోతున్నాను అని మను అనుకుంటాడు. ఇది నీకు తెలియాలి. ఇది నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని మహేంద్ర అనుకుంటాడు. నా భవిష్యత్ గురించి ఆలోచించట్లేదు. నేను అనుకుంది, జరిగింది వేరు. ఈ గుప్పెడంత మనసులో ఇంత అలజడి ఏంటో అర్థం కావట్లేదు అని ఒకరి గురించి మరొకరు అనుకుంటూ ఉంటారు.
నేరుగా మాట్లాడాలి
ఇంతలో అనుపమ వచ్చి మను ప్రవర్తను చూస్తుంది. మనుకు నిజం తెలిసిపోయింది. ఎలా తెలిసిందో ఏమో గానీ తెలిసిపోయింది. ఇప్పుడు వాడికి రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వాడిని ఫేస్ చేయలేను. చేయలేకపోతున్నాను. వాడి కన్నీళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను అని అనుపమ అనుకుంటుంది. అనుపమకు మహేంద్ర కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు అంటే ఏమనుకోవాలి. ఇలా కాదు. నేరుగా మాట్లాడాలి అని మను గురించి అనుకుంటాడు మహేంద్ర.
ఇంతలో రిషి కాల్ చేసి డాడ్ మీరు ఇవాళ ఇంటి గడప దాటకూడదు. నేను వచ్చేవరకు ఇంట్లోనే ఉండాలి. నేను చెప్పేది వినండి అని మహేంద్రతో రిషి అంటాడు. సరేనని మహేంద్ర అంటాడు. మీరు ఇంత కూల్‌గా ఎలా ఉంటున్నారు. ఇంతపెద్ద విషయం తెలిసాక కూడా అని వసుధార అంటుంది. ఏ విషయం వసుధార అని మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు. నాకు తెలియాలి వసుధార చెప్పు అని శైలేంద్ర అంటాడు. నీకు అసలు బుద్ధి ఉందా. ఇంగిత జ్ఞానం ఉందా. చదువుకున్నావ్ కదా. క్యాబిన్‌లోకి వచ్చేముందు అడగాలని తెలియదా అని ఫైర్ అవుతుంది వసుధార.
వసుధార అంటూ రిషి లేచి నిల్చుంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. పర్మిషన్ తీసుకోకుండా క్యాబిన్‌లోకి రావడమే కాకుండా మమ్మల్ని ప్రశ్నిస్తున్నావ్ అని వసుధార అంటుంది. వసుధార తను మా అన్నయ్య. తనను నువ్ ఇలా ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదు. మీరు అని పిలవాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. మా అన్నయ్య నా క్యాబిన్‌కు ఎప్పుడైనా రావొచ్చు. ఎప్పుడైనా వెళ్లొచ్చు అని రిషి అంటాడు. తన గురించి తెలిసి కూడా ఇలా అంటున్నారా అని వసుధార అంటుంది.
సారీ చెప్పమంటున్నారు
తెలుసు వసుధార. నువ్ నాకేం చెప్పొద్దు. ముందు మా అన్నయ్యకు సారీ చెప్పు అని రిషి అంటాడు. నేను సారీ చెప్పాలా అని వసుధార షాక్ అవుతుంది. చెప్పాలి. ఇప్పుడు సారీ చెప్పి తీరాల్సిందే. నువ్ కరెక్ట్‌గానే విన్నావ్. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మా అన్నయ్యకు సారీ చెప్పు అని రిషి అంటాడు. అర్థమైంది సార్. మీరెందుకు సారీ చెప్పమంటున్నారో అని అనుకున్న వసుధార శైలేంద్ర గారు సారీ అంటుంది. ఏమన్నావ్ వినపడలేదని శైలేంద్ర అంటాడు.
శైలేంద్ర గారు సారీ అని వసుధార అంటుంది. పర్లేదు. ఇప్పటికైనా మా అన్నదమ్ముల అనుబంధం అర్థమైందా. మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని శైలేంద్ర అంటాడు. తర్వాత రంగా పదా అని శైలేంద్ర అంటే.. సరే అన్నట్లుగా రిషి వెళ్తాడు. రంగానా అని వసుధార అంటుంది. కాదు రిషి. నోరు జారి.. నోరు జారింది. సరే రిషి నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అని శైలేంద్ర అంటాడు. అలా కాదు నా ముందే మాట్లాడాలి అని వసుధార అంటుంది.
అటాక్‌లు చేయడం
అన్నయ్య ఏదో పర్సనల్ అంటున్నారు కదా అని వెళ్తాడు రిషి. వెళ్లేముందు సారీ సారీ. కాస్తా ఓవరాక్షన్ చేశాను. బుంగమూతి పెట్టకు అని రిషి బుజ్జిగించి వెళ్తాడు. దాంతో నవ్వేస్తుంది వసుధార. ఇంతకుముందు వసుధార ఏదో పెద్ద విషయం అంటుంది. ఏంటది అని శైలేంద్ర అడుగుతాడు. మను గురించి. ఇంతకీ ఎవరు అన్నయ్య మను అని రంగా అంటాడు. మను గాడు మీ డాడ్‌ను అదే మా బాబాయ్‌ను ఏమైనా చేయడానికి వచ్చాడా. అదే వార్నింగ్ ఇవ్వడం. లేదా బెదిరించడాలు. అటాక్‌లు చేయడం అని శైలేంద్ర అంటాడు.
అయినా మను ఎందుకు చేస్తాడు అలా అని రంగా అంటాడు. చేస్తాడు. ఎందుకంటే బాబాయ్‌పై మనుకు పీకల్లోతు పగ ఉంది అని శైలేంద్ర అంటాడు. ఎందుకని పగ. అది తెలిస్తేనే కదా మీ బాబాయ్‌ను కాపాడేది అని రంగా అంటాడు. నీకెందుకు తెలియాలి. నువ్వేందుకు కాపాడాలి. నువ్వేమైనా రిషివా అని శైలేంద్ర అడుగుతాడు. కాదనుకో కానీ రిషిలా నటిస్తున్నాను. నా ఎదురు అలాంటి సిచ్యువేషన్ జరిగితే ఏం చేయాలో తెలియాలి కదా అని రంగా అంటాడు.
వీడు చెప్పేది నిజమే. నువ్ సైలెంట్‌గా ఉండు. జరగరానిది ఏమైనా జరిగితే నువ్ సాక్ష్యం చెప్పాలి. మను గాడికి వ్యతిరేకంగా అని శైలేంద్ర అంటాడు. అంటే మీ బాబాయ్‌ను కాపాడకూడదంటావ్. కాపాడితే. ఎవరైనా బాబాయ్ ప్రమాదంలో ఉంటే కాపాడని చెబుతారు. మీరేంటీ కాపడకూడదంటున్నారు అని రంగా అంటాడు. నీకేదైన జరిగితే ఎలా. నీ మేలు కోసమే చెబుతాను అని శైలేంద్ర అంటాడు. మరి నా ముందు జరగపోతే ఏం చేయాలి అని రంగా అడుగుతాడు.
రిషిని చంపబోయావట
అది అప్పుడు ఆలోచిద్దాం. అసలు విషయం చెప్పలేదు. వసుధార దేని గురించి మాట్లాడిందని శైలేంద్ర అడుగుతాడు. నువ్ ఒక వెధవ్వి. దుర్మార్గుడివి అని రంగా అంటాడు. దాంతో షాకైన శైలేంద్ర ఏమంటున్నావురా అని అంటాడు. అది నేను కాదు. మేడమ్ గారు అంటున్నారు. మీకు అర్హత లేకపోయినా ఎండీ పదవి కోసం చాలా అరాచకాలు చేశావట. ఆఖరికి రిషిని కూడా చంపబోయావట అని రంగా అంటాడు. వీడు రిషి అనుకుని అన్ని చెబుతుంది వసుధార. కానీ, వీడు రంగా అని తెలియదు పాపం అని అనుకుంటాడు శైలేంద్ర.
నీ గురించి పూస గుచ్చినట్లు చెబుతుంటే నాకు అంతా తెలుసులే అన్నాను అని రంగా అంటాడు. దాంతో శైలేంద్ర షాక్ అయి నీకేం తెలుసు అని అడుగుతాడు. నాకేం తెలుసు అన్నయ్య. ఆమె చెప్పేది నాకెందుకు. నాకు నువ్వేంటో తెలుసు కదా. వినాల్సిన అవసరమే నాకు లేదు. నిన్ను ఎండీని చేసి నేను వెళ్లడం గురించి తప్పా నీ గురించి తెలుసుకుని ఏం చేస్తాను. అది నాకు అవసరం లేని మ్యాటర్ కదా అని రంగా అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్