Shaitan Web Series Trailer: బాబోయ్...ఇవేం బూతులు - సైతాన్ ట్రైల‌ర్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు-shaitan web series trailer out mahi v raghav series streaming on disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaitan Web Series Trailer: బాబోయ్...ఇవేం బూతులు - సైతాన్ ట్రైల‌ర్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

Shaitan Web Series Trailer: బాబోయ్...ఇవేం బూతులు - సైతాన్ ట్రైల‌ర్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

HT Telugu Desk HT Telugu

Shaitan Web Series Trailer: మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సైతాన్ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. ఈ ట్రైల‌ర్ బూతు డైలాగ్స్ ఎక్కువ‌గా ఉండ‌టంపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి.

సైతాన్ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్

Shaitan Web Series Trailer: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ బూతుకు, బోల్డ్ కంటెంట్‌కే కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయాయ‌నే వాద‌న‌లు చాలా కాలంగా వినిపిస్తోన్నాయి. క‌థ‌, కాన్సెప్ట్‌ల కంటే బూతునే న‌మ్ముకొని సిరీస్‌లు, సినిమాల్ని తెర‌కెక్కిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు బ‌లంగానే వినిపిస్తోన్నాయి. సోమ‌వారం రిలీజైన సైతాన్ ట్రైల‌ర్ బోల్డ్ కంటెంట్‌తో టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ ట్రైల‌ర్‌ మొత్తం బూతు డైలాగ్స్‌, హింసాత్మ‌క స‌న్నివేశాల‌తోనే నిండిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు క్లీన్ సినిమాలు, సిరీస్‌ల‌ను తీసిన మ‌హి.వి.రాఘ‌వ్ త‌న శైలికి భిన్నంగా కంప్లీట్‌గా ర‌స్టిక్‌గా సైతాన్‌ సిరీస్‌ను తెర‌కెక్కించిన‌ట్లుగా ట్రైల‌ర్ చూస్తే క‌నిపిస్తోంది.

త‌మ ల‌క్ష్యం ఎంత‌మందినైనా చంప‌డానికి వెనుకాడ‌ని క్రూర మ‌న‌స్త‌త్వ‌మున్న వ్య‌క్తులుగా ప్ర‌ధాన పాత్ర‌ధారులు క‌నిపిస్తోన్నాయి.

బూతు డైలాగ్స్ ఎక్కువ‌గా వినిపించ‌డంపై సైతాన్ ట్రైల‌ర్‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తోన్నారు. ఫ్యామిలీ అంద‌రూ క‌లిసి చూసే సిరీస్ కాదంటూ కామెంట్స్ పెడుతోన్నారు. సైతాన్ సిరీస్‌లో కామాక్షి భాస్క‌ర్ల‌, రిషి, దేవ‌యాని, జాఫ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

త‌నకు అన్యాయం చేసిన వారిపై బాలి అనే వ్య‌క్తి త‌న కుటుంబంతో క‌లిసి ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో జూన్ 15 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సేవ్ ది టైగ‌ర్స్ త‌ర్వాత మ‌హి.వి. రాఘ‌వ్ నుంచి వ‌స్తోన్న సిరీస్ ఇది.