Guppedantha Manasu August 27th Episode: నానమ్మకు నిజం చెప్పిన రిషి- తండ్రి మాటలతో శైలేంద్రకు ముచ్చెటమలు- మనుకు షాక్-guppedantha manasu serial august 27th episode rishi disclose his identity to radhamma guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 27th Episode: నానమ్మకు నిజం చెప్పిన రిషి- తండ్రి మాటలతో శైలేంద్రకు ముచ్చెటమలు- మనుకు షాక్

Guppedantha Manasu August 27th Episode: నానమ్మకు నిజం చెప్పిన రిషి- తండ్రి మాటలతో శైలేంద్రకు ముచ్చెటమలు- మనుకు షాక్

Sanjiv Kumar HT Telugu
Aug 27, 2024 09:50 AM IST

Guppedantha Manasu Serial August 27th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో మహేంద్రపై అటాక్ జరగడంపై ఫణీంద్ర కోప్పడతాడు. నేను ఇక వాడిని పట్టుకునే పనిలోనే ఉంటాను. నేను ఊరుకున్నా రిషి ఊరుకోడు. తన కళ్లలో కోపం చూస్తే నాకే భయమేసింది అని ఫణీంద్ర చెబుతాడు.

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మహేంద్రపై ఎందుకు అటాక్ చేశారని మనును నిలదీస్తుంది వసుధార. తానేందుకు చేస్తాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు కదా. ఎందుకు చంపాలని అనుకుంటాను అని మను అంటాడు. ఎందుకంటే అని చెప్పబోయి అని వసుధార ఆగిపోతుంది.

నిజమైన తండ్రి కాదు కదా

ఇప్పుడు కూడా మీ మావయ్య నా కన్నతండ్రి అని చెప్పట్లేదు అని మను అనుకుంటాడు. మీరు శైలేంద్రను కలిసి నిజం తెలుసుకున్నారని నాకు తెలుసు అని వసుధార అంటుంది. దానికి అటాక్ జరగడానికి సంబంధం ఏంటని మను అంటాడు. ఇన్నాళ్లు తండ్రిపై కోపం పెంచుకున్నారు. ఇప్పుడు తండ్రి ఎవరోతెలిసాక చంపేస్తానని మీరు అన్నారు అని వసుధార అంటుంది. అన్నాను. అయినా మహేంద్ర సార్ నా నిజమైన తండ్రి కాదు కదా అని మను అంటాడు.

కాదు. ఆయనే మీ తండ్రి. ఆ విషయం మీకు తెలుసు అని నాకు తెలుసు. ఆ శైలేంద్రకు మీ తండ్రి గురించి తెలుసు కాబట్టే మీరు తెలుసుకున్నారు. కానీ, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది. మీ తల్లి ఎవరనేది. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒక్క అనుపమ మేడమ్‌కి తప్పా అని వసుధార అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు. అనుపమ మేడమే మా అమ్మ. నన్ను చిన్నప్పటినుంచి పెంచారు. నాకు తెలియదా అని మను అంటాడు.

మీకు తెలియదు. మిమ్మల్ని పెంచింది అనుపమ మేడమే. కానీ కన్నతల్లి కాదు. మా మావయ్యపై దాడులు చేయడం ఆపేసి మీ అమ్మ ఎవరో తెలుసుకోండి అని వసుధార అంటుంది. దాంతో కన్ఫ్యూజ్‌ అయిన మను కాసేపటికి నేను ఏ అటాక్ చేయలేదు. దానికి నాకు సంబంధం లేదు. అసలు మీరు చెప్పేవరకు కూడా సార్‌పై అటాక్ జరిగిందని నాకు తెలీదు. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం అని మను వెళ్లిపోతాడు.

మనునే అటాక్ చేస్తాడు కదా

మను గారు చేయలేదా.. మరి ఎవరు చేశారు అని వసుధార అనుమాన పడుతుంది. మరోవైపు మహేంద్రపై అటాక్ చేసింది ఎవర్రా. ఆ మను గాడా అని దేవయాని అడుగుతుంది. కాదు. బాబాయ్‌పై అటాక్ చేయించింది నేనే. కానీ, బట్ నో యూజ్ అని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు ఆ అవసరం ఏముంది. కొన్నిరోజులకు మను గాడే అటాక్ చేస్తాడు కదా అని దేవయాని అంటుంది. ఇప్పుడు ఆ అటాక్ మను గాడే చేసి ఉంటాడని వసుధార అనుకుంటుంది. మను గాడికి నిజం తెలిసినట్లు వసుధారకు కూడా తెలుసు అని శైలేంద్ర అంటాడు.

బాబాయ్‌ను మట్టిలో కలిపేసి ఆ తర్వాత వసుధారను పైకి పంపిద్దామనుకున్నాను. ఆ తర్వాత రంగా నుంచి కాలేజీ మొత్తం లాక్కుని వాడిని కూడా పైకి పంపిద్దామనుకున్నాను. డాడ్‌ను అందుకే అక్కడికి తీసుకెళ్లాను. కానీ, బాబాయ్‌కు ఇంకా నూకలు ఉన్నాయి అని శైలేంద్ర అంటాడు. నువ్ ఇలా చెత్త ప్లాన్స్ వేయడం వల్లే మన బతుకులు ఇలా ఉన్నాయి. నాకు చెప్పమని చెప్పాను కదా అని దేవయాని అంటుంది. ఆ పరిస్థితులో చెప్పాలనిపించలేదు. పని పూర్తయ్యకా చెబితే బాగుంటుందని అనుకున్నాను అని శైలేంద్ర అంటాడు.

ఇప్పుడు నిన్ను తిట్టిన లాభం లేదని అర్థమైంది. సరే ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయకు అనవసరంగా ఇరుక్కుంటాం అని దేవయాని అంటుంది. ఇప్పుడు ఇరుక్కునేది ఆ మనుగాడు. లేకుంటే ఆ రంగాగాడు అని అన్న శైలేంద్ర రంగా మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. బాబాయ్‌పై అటాక్ జరిగినప్పుడు రంగాగాడు నాపై కోపంగా చూశాడు. వాడే రిషి అన్నట్లు ఫీల్ అయ్యాడు అని శైలేంద్ర అంటాడు. వాడే రిషి అయితే మనం రోడ్డుమీద పడతాం అని దేవయాని అంటుంది.

అదే పనిలో ఉంటాను

లేనిపోని డౌట్స్ పెట్టకు మామ్ అని శైలేంద్ర అంటుంటే.. ఫణీంద్ర వస్తాడు. అది చూసి ఇద్దరు జాగ్రత్త పడతారు. మహేంద్రపై అటాక్ జరగడం ఏంటని అడుగుతుంది దేవయాని. మేం మంచిచేసేవాళ్లమే కానీ చెడు చేసేవాళ్లం కాదు. మాకెందుకు శత్రువులు ఉన్నారో తెలియట్లేదు. నా తమ్ముడికి ఏమైనా జరిగితే ఆ క్షణమే నా గుండె ఆగిపోయేదు. వాడెవడో దొంగచాటుగా దెబ్బ తీయాలని చూశాడు. వాడెవడే రేపు మాపో కచ్చితంగా తెలుస్తుంది అని ఫణీంద్ర అంటాడు.

నా పనులన్ని పక్కనపెట్టి వాడిని పట్టుకుంటాను. ఇక అదే పనిలో ఉంటాను. నేను కాకపోయినా రిషి వదలడు. రిషి కళ్లలో కోపం చూస్తే నాకే భయమేసింది. అటాక్ చేసింది. చేయించినవాడిని రిషి కచ్చితంగా పట్టుకుంటాడు. ఇక వాడికి చివరి రోజులే. రిషి పట్టుకుని నా ముందు నిల్చుండబెడతాడు. అప్పుడు వాడిని నా కసితీర కొడతాను. తర్వాత వాడికి రిషి శిక్ష వేస్తాడు అని ఫణీంద్ర అంటాడు. మీరెందుకు భయపడుతున్నారు. ఇంత కూల్‌ వెదర్‌లో మీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి అని ధరణి అంటుంది.

బాబాయ్‌పై అటాక్ జరగడం చూశా కదా. అందుకే చెమటలు పడుతున్నాయి అని లేచి వెళ్లిపోతాడు శైలేంద్ర. వసుధార మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు మను. కోపంతో పిల్లోను విసిరేస్తాడు మను. ఏమైంది అని అనుపమ అడుగుతుంది. నువ్ ఏం చెప్పవు. ఏం చేయవు. ఎందుకు అడగడం. సమస్యను అలాగే ఉంచుతావ్. ఏదో చేసినదానిలా అడుగుతున్నావ్ అని మను అంటాడు. మొన్న నేను మాట వరుసలో నా బాధను అర్థం చేసుకోవట్లేదని అడిగాను నువ్ నా తల్లివేనా అని. ఇప్పుడు నిజంగా అడుగుతున్నాను. నువ్ నా కన్నతల్లివేనా అని మను అంటాడు.

నేను అనుభవిస్తున్నాను

నువ్ నా కన్నతల్లివేనా. లేదా ఇంకెవరైనా ఉన్నారా. ఇన్నాళ్లు నా తండ్రి గురించి నిజం దాచావ్. సంవత్సరాలు వేదన చూశాను. అదంతా వదిలేయ్. ఇప్పుడు అడుగుతున్నాను. చెప్పమ్మా నువ్వేనా నా కన్నతల్లివి. లేదా పెంచిన తల్లివా. లేదా నేను ఏదైనా చెత్త కుప్పలో దొరికానా. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్. ఏదైనా తప్పు చేశావా. మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో తెలీదు కానీ, నేను అనుభవిస్తున్నాను. ఇంకా నన్ను జీవితాతం బాధపెట్టాలని అనుకుంటున్నావా అని మను అడుగుతాడు.

రోడ్డు మీదే నన్ను వదిలేసి ఉంటే నా చావు నేను చచ్చేవాడిని కదా. ఈరోజు నువ్ నిజం చెప్పాల్సిందే. నేను వినాల్సిందే అని మను అక్కడే కూర్చుంటాడు. మరోవైపు డాడ్‌పై అటాక్ చేసింది ఎవరో తెలుసని వెళ్లావ్. ఏమైంది అని రిషి అంటాడు. నేను తప్పుగా ఆలోచించాను సార్. మను గారు చేసి ఉంటారని వెళ్లాను. కానీ, తను చేయలేదని అనిపిస్తుంది అని వసుధార అంటుంది. అనిపించడం కాదు. మను చేయలేదు. చేసింది అన్నయ్య అని రిషి అంటాడు.

వసుధార షాక్ అవుతుంది. మీకెలా తెలుసు అని వసుధార అంటుంది. నాకు తెలుసు. ఇలా చేతికి మట్టి అంటకుంటే చేసేది అన్నయ్య. నేను గమనిస్తూనే ఉన్నాను. నేను చూశాను కాబట్టే డాడ్‌ను కాపాడుకోగలిగాను అని రిషి అంటాడు. మరి ఇంత జరుగుతుంటే మీరెందుకు సైలెంట్‌గా ఉంటున్నారు అని వసుధార అంటుంది. న్యాయం జరిగేలా చేస్తాను. శిక్ష పడేలా చేస్తాను. కాస్తా ఓపికగా ఉండు. అన్నయ్య చేసిన పాపాలకు శిక్ష పడేలా చేస్తాను. నీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతుంది అని రిషి అంటాడు.

పొరపాటు పడుతున్నారు

ఇంతలో రాధమ్మతో సరోజ అక్కడికి వస్తుంది. రంగా అని అంటుంది. అది చూసి రిషి, వసుధార షాక్ అవుతారు. నాన్నా రంగా ఎలా ఉన్నావ్. నాకు చెప్పపెట్టకుండా ఇలా వచ్చావ్. అప్పటినుంచి నాకు ఏవోవో భయాలు. ప్రతిక్షణం నీ ధ్యాసే. ఇప్పుడు నిన్ను చూశాకా నాకు సంతోషంగా ఉంది అని రాధమ్మ అంటుంది. నేను ఎంత చెప్పిన అమ్మమ్మ వినలేదు. నీ అడ్రస్ తెలుసుకుని వచ్చాను అని సరోజ అంటుంది. మన ఇంటికి మనం పోదాం రా రంగా అని రాధమ్మ అంటుంది.

రంగా ఎవరు అని మహేంద్ర అంటాడు. ఇతనే మా రంగా అని రాధమ్మ అంటుంది. మీ మనవడు ఏంటీ. రంగా ఏంటీ. మీరు పొరపాటు పడుతున్నారు. తను రిషి. నా కొడుకు అని మహేంద్ర అంటాడు. మావాడికి ఏవో మాయ మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. వసుధార నువ్వైనా చెప్పు అని రాధమ్మ అంటుంది. తనేందుకు చెబుతుంది. మీరనుకుంటున్నట్లు తను రిషి కాదు. రంగా. నా బావ అని సరోజ అంటుంది. ఏంటమ్మా ఇది నీకు పరిచయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. తను రిషి అని చెప్పొచ్చు కదా అని మహేంద్ర అంటాడు.

తను మీ రంగా కాదు. నా కొడుకు రిషీంద్ర భూషణ్ అని మహేంద్ర అంటాడు. డాడ్ మీరు ఆగండని రిషి అంటాడు. ఏంటీ రంగా ఇన్నాళ్లు నువ్ ఇంటికే దూరమైపోతున్నావ్ అనుకున్నా. ఇప్పుడు మాక్కూడా దూరమైపోతున్నావా. నువ్ రిషి కాదు రంగా అని చెప్పరా అని రాధమ్మ అంటుంది. అలా చెప్పలేను నానమ్మ. నేను రంగాను కాదు రిషినే. నేను మీ మనవడిని కాదు. వసుధార భర్తను అని రిషి చెబుతాడు. దాంతో రాధమ్మ, సరోజ షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.