Guppedantha Manasu August 6th Episode: గుప్పెడంత మనసు- రంగా గురించి నిజం చెప్పిన శైలేంద్ర- బయటకు గెంటేసిన ఫణీంద్ర-guppedantha manasu serial august 6th episode shailendra nightmare about rishi as ranga guppedantha manasu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 6th Episode: గుప్పెడంత మనసు- రంగా గురించి నిజం చెప్పిన శైలేంద్ర- బయటకు గెంటేసిన ఫణీంద్ర

Guppedantha Manasu August 6th Episode: గుప్పెడంత మనసు- రంగా గురించి నిజం చెప్పిన శైలేంద్ర- బయటకు గెంటేసిన ఫణీంద్ర

Sanjiv Kumar HT Telugu
Aug 06, 2024 08:31 AM IST

Guppedantha Manasu Serial August 6th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 6వ తేది ఎపిసోడ్‌లో ఏంజెల్ వచ్చి రచ్చ చేయడంతో శైలేంద్రను ఫణీంద్ర నిలదీస్తాడు. దాంతో రిషిలా రంగాను నటించడానికి తీసుకొచ్చినట్లు శైలేంద్ర నిజం చెబుతాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 6వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 6వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రిషిని రంగా అంటూ హడావిడీ చేస్తుంది సరోజ. ఏంటమ్మా నువ్ మా రిషిని పట్టుకుని రంగా అంటున్నావ్ అని మహేంద్ర అంటాడు. వీళ్లే మా రంగాను రిషిలా నటించమంటున్నారు అని సరోజ చెబుతుంది. నాకు నమ్మకం లేదమ్మా అని మహేంద్ర అంటాడు.

రిషిలా మారిపోయావా

దేనికి తీసుకొచ్చారో తెలీదు కానీ మా బావకు ఈయన పది లక్షలు డబ్బు ఇచ్చి తీసుకువచ్చాడు. అక్కడ మా బావకు ఒక కుటుంబం ఉంది. మా అమ్మమ్మ తనకోసం ఎదురుచూస్తుంది. ఏంటీ బావ ఒక్క మాట మాట్లాడట్లేదు. నువ్ కూడా ఈ విలాసవంతమైన బతుక్కీ అలవాటు పడిపోయావా. ఈ కారులు వస్తాయని రిషిలా మారిపోయావా అని సరోజ నిలదీస్తుంది. పద బావ వెళ్దాం అని చేయి పట్టుకుంటే రంగా విడిపించుకుంటాడు.

ఏంటీ బావ నా చేయి విదిలించుకుంటున్నావ్. అంటే నాతో రావా. ఇక్కడే ఉంటావా. నాతో రాకుంటే నేను ఇక్కడే చస్తాను అని సరోజ అంటుంది. అమ్మా నువ్ ఏం చేసుకోకు నేను మాట్లాడుతాను. నిజమేంటో నీ ముందే తేలుస్తాను. అతను నిజంగా తను రంగా అయితే నీతోనే పంపిస్తాను అని ఫణీంద్ర అంటాడు. ఏంట్రా శైలేంద్ర తను నువ్ డబ్బు ఇచ్చాను అంటోంది. తప్పించుకోవాలని చూడకు. నిజం చెబితే బతుకుతావ్. లేకుంటే తండ్రి చేతిలో చనిపోయిన కొడుకుగా చరిత్రలో నిలుస్తావ్ అని ఫణీంద్ర వార్నింగ్ ఇస్తాడు.

ఎండీ సీటు ఇవ్వట్లేదు కదా

డబ్బు ఇచ్చావా లేదా అని ఫణీంద్ర అడిగితే.. ఇచ్చాను అని శైలేంద్ర అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అంటే తను చెప్పేది అని ఫణీంద్ర అంటే.. నిజమే డాడ్.. నిజమే.. మీరంతా అనుకుంటున్నట్లు తను రిషి కాదు.. రంగా. నేనే అతనికి డబ్బులిచ్చి రిషిలా నటించమని చెప్పాను అని శైలేంద్ర అంటాడు. ఎందుకురా అని ఫణీంద్ర అడుగుతాడు. ఎండీ సీటు కోసం. మరి ఏం చేయమంటారు. మీరంతా నాకు ఎండీ సీటు ఇవ్వట్లేదు కదా. ఆ మంత్రి ఏమో రిషి వచ్చి చెబితే కానీ ఇవ్వను అన్నాడు. ఇంకేం చేయమంటారు అని శైలేంద్ర అంటాడు.

ఇప్పుడు చెప్పండి సార్. భ్రమ పడుతుంది ఎవరు మీరా నేనా అని సరోజ అంటుంది. కాదు రంగా కాదు. రిషినే నా కొడుకు రిషినే. మీరు ఎన్నైనా చెప్పండి నేను నమ్మను. తను నా కొడుకు రిషి అని మహేంద్ర అంటాడు. బావ వీళ్లందరు అలాగే అంటారు. ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండకూడదు పదా అని మళ్లీ సరోజ తీసుకెళ్దామని చూస్తుంటే రంగా రాడు. వీళ్ల ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యావా. బాధపడతారని చూస్తున్నావా. అలాంటిదేం ఉండదు. వాళ్లకు అలవాటై పోయింది. అది వాళ్ల కర్మ అని సరోజ అంటుంది.

ఏ గొడవ చేయకు

ఊరికెళ్లాకా తను ఇచ్చిన డబ్బు ఏదోలాగా తన మొహం మీద కొట్టేద్దాం అని సరోజ అంటుంది. నేను రాను సరోజ. ఎందుకంటే నేను మీ బావ రంగాను కాదు కాబట్టి. నా పేరు రిషి. రిషీంద్ర భూషణ్ అని రంగా చెబుతాడు. దాంతో శైలేంద్ర, దేవయాని షాక్ అయిపోతారు. నేను చెబుతోంది నిజం. నేను కొన్ని రోజుల తర్వాత మీ ఊరికి వస్తాను. అప్పుడు అన్ని నిజాలు చెబుతాను. ఇక్కడ ఏ గొడవ చేయకుండా వెళ్లిపో అని రిషి అంటాడు.

రేయ్ శైలేంద్ర ఎండీ సీటు కోసం ఇంత దిగజారుతావా. చావరా చావు అని శైలేంద్రను కొడుతూ ఉంటాడు ఫణీంద్ర. నీలాంటి వాడు బతకకూడదు. నీ వల్ల నా ప్రాణం పోతుంది. ఇక నువ్ మారవని అర్థమైంది. నిన్ను క్షమించేదిలేదు. ఈ క్షణమే నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు ఇంట్లో స్థానమే లేదు అని కొడుతూనే ఉంటాడు ఫణీంద్ర. ఈ ఒక్కసారి క్షమించమని శైలేంద్ర అంటాడు. ఈ ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్లిపో అప్పుడే నీకు రక్త సంబంధాలు తెలుస్తాయి. నన్ను మెడపట్టి గెంటించమంటావా అని ఫణీంద్ర అంటాడు.

నిజంగా రంగానే

నా గురించి కాకపోయినా ధరణి గురించి ఆలోచించమని శైలేంద్ర అంటే.. మీ ఇష్టం మావయ్య అని ధరణి అంటుంది. దాంతో శైలేంద్రను మెడపట్టి బయటకు గెంటేస్తాడు ఫణీంద్ర. దాంతో ఒక్కసారిగా నో అంటూ నిద్రలోంచి లేస్తాడు శైలేంద్ర. ఇదంతా కల అయినా వాడు రిషి అంటున్నాడేంటీ. ఇలా నాకెందుకు కల వచ్చింది. వాడు రిషినే అంటావా. కాదు కాదు వాడు నిజంగానే రంగానే. అందులో అనుమానం లేదు అని శైలేంద్ర అనుకుంటాడు.

ఇంతలో ధరణి వచ్చి ఎందుకు అరిచారు అని అడుగుతుంది. నాకు కల వచ్చింది. పీడకల. అది గాని జరిగితే నా సంగతి అంతే అని శైలేంద్ర అంటాడు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయట అని ధరణి అంటుంది. దాంతో ధరణిపై కోప్పడతాడు శైలేంద్ర. ఒక్కసారి కూడా పాజిటివ్‌గా కూడా ఆలోచించవా అని శైలేంద్ర అంటాడు. సరే వాడు ఎక్కడున్నాడు. వాడే రిషి గాడు.. రిషి కాదు. రంగా రంగా ఎక్కడున్నాడు అని శైలేంద్ర నోరుజారుతాడు.

ఆటాడుకున్న వసుధార

ధరణి ఆశ్చర్యంగా చూస్తే.. ఇంకోసారి దీనిముందు నోరు జారకూడదు. పసిగట్టేస్తుంది అని శైలేంద్ర అనుకుంటాడు. అసలు ఈయనకు ఏమైంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు. ఎందుకు ప్రతిసారి రంగా రంగా అంటున్నారు. అసలు ఎవరీ రంగా అని ధరణి అనుమానపడుతుంది. వసుధార, మహేంద్ర మాట్లాడుకుంటుంటే శైలేంద్ర వచ్చి చూస్తాడు. వీళ్లు మాట్లాడుకుంటున్నారు అంటే మనకు ఉపయోగపడుతుంది అని అలాగే పైనుంచి చూస్తూ ఉంటాడు.

శైలేంద్రను చూసిన వసుధార ఉండు నీతో ఒక ఆట ఆడుకుంటాను అని అనుకుంటుంది. మావయ్య.. రిషి సార్‌లో ఏదో తేడా కొడుతోంది. సార్‌లో ప్రవర్తనలో మార్పు వచ్చింది అని వసుధార అంటే.. నాకేం అలా అనిపించడం లేదు. నువ్ ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉందని మహేంద్ర అంటాడు. రంగా గాడు బాబాయ్ దగ్గర వంద మార్కులు కొట్టేశాడు కానీ, వసుధార దగ్గరే అని శైలేంద్ర అనుకుంటాడు. లేదు మావయ్య సార్‌ ప్రవర్తన వింతగా ఉంది. నా మాట నమ్మట్లేదా మీరు అని వసుధార అంటుంది.

మళ్లీ ఇరికించాడు

వామ్మో వసుధార నిజం బయటకు లాగేసేలా ఉంది అని కంగారుగా వాళ్ల ముందుకు వచ్చేస్తాడు శైలేంద్ర. లేనిపోని అనుమానాలు ఎందుకు పెట్టుకుంటావ్. ఇన్నాళ్లు బాధపడ్డావ్. ఇప్పుడు రిషి వచ్చాకా ప్రవర్తనలో మార్పు అని అంటున్నావ్. ఏంటీ బాబాయ్ ఇది అని శైలేంద్ర అంటాడు. ఇంతలో వేప తోముకుంటూ రిషి ఎంట్రీ ఇస్తాడు. అది చూసి మహేంద్ర, శైలేంద్ర, వసుధార షాక్ అవుతారు. ఈ రంగా గాడు మళ్లీ ఇరికించాడు అని శైలేంద్ర అనుకుంటాడు.

రిషి ఏంటీ ఇలా వస్తున్నాడు అని అనుకున్న మహేంద్ర.. రిషి నువ్ వేపపుల్ల వేయడమేంటీ అని అడుగుతాడు. నాకు ఇలాగే బాగుంటుంది అని రిషి అంటాడు. ఇన్నాళ్లు మనకు దూరంగా ఉన్నాడు. ఆరోగ్యం బాలేకుంటే ఆయుర్వేదం వాడుతున్నాడు. అందుకే ఆరోగ్యం కోసం వేపపుల్ల వాడుతున్నాడు అని శైలేంద్ర కవర్ చేస్తాడు. దాంతో అంతా నవ్వుకుంటారు. మరోవైపు రంగా నానమ్మ ఏం తినను, తాగను అని అంటుంది. దాంతో నువ్ ఇలా ఉంటే బావ నన్ను అంటాడు అని సరోజ నచ్చజెబుతుంది.

నాలుగు పైసలు వచ్చాయో లేదో

ఇంతలో సంజీవ వస్తాడు. ఇప్పుడెలా ఉందని అడుగుతాడు. నువ్ బాధపడాల్సిన అవసరం లేదు. బాగా సంపాదిస్తున్నాడు అంట కదా. తంతే బూరలబుట్టలో పడినట్లు తన్నకుండానే కరెన్సీ నోట్లపై పడ్డాడు. పది లక్షల అప్పు తీర్చాడు అంటే మాములు విషయమా. ఇంతకీ ఫోన్ చేస్తున్నాడా అని సంజీవ అడుగుతాడు. లేదని నానమ్మ చెబుతుంది. నాలుగు పైసలు వచ్చినవో లేదో నీకు ఫోన్ చేయడం మానేసాడు అని సంజీవ అంటాడు. బావ అలా కాదని వెనుకేసుకొస్తుంది సరోజ.

మరోవైపు వసుధార తడిచిన జుట్టును ఆరబెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే వచ్చిన రిషి వసుధారను వెనుకవైపు నుంచి రొమాంటిక్‌గా చూస్తాడు. డియర్ కామ్రెడ్ పాట ప్లే అవుతుంది. వసుధార వీపు చూపిస్తూ సీన్‌ను రొమాంటిక్‌గా చూపించారు. వచ్చి కూర్చుని వసుధారను అలానే చూస్తూ ఉంటాడు రిషి. అది చూసిన వసుధార మీరెప్పుడు వచ్చారని అడుగుతుంది. తెలీదు అని రిషి అంటాడు. వసుధార భుజాలపై చేతులు వేసి అజంతా శిల్పంలా ఉన్నావ్ అని రిషి అంటాడు.

కాలేజీ విషయం సాల్వ్ అయితే

తర్వాత వసుధారను వెనుకవైపు నుంచి కౌగిలించుకుంటాడు రిషి. ఇన్నాళ్లు ఎందుకు దూరం పెట్టారు అని వసుధార అడుగుతుంది. కొన్నిసార్లు అవతారాలు ఎత్తాలంటే దూరం ఉండాలి. ఇక నుంచి నిన్ను దూరం చేసుకోలేను. చాలా మిస్ అయ్యాను అని రిషి అంటాడు. నేను కూడా. మీకు దూరంగా ఉండలేను. ఒక కాలేజీ విషయం సాల్వ్ అయితే మనం ఎప్పటికీ సంతోషంగా కలిసే ఉంటాం. ఇంతకీ ఏం ఆలోచించారు అని వసుధార అడుగుతుంది.

ఇంకా ఏం ఆలోచించలేదు. నాకు తెలియని విషయాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. చివరి వరకు నిర్ణయం తీసుకోలేను అని రిషి అంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner