Gundeninda Gudigantalu Today Episode: రవిని కలిసిన మీనా- జైలు నుంచి తండ్రిని విడిపించుకుంటానన్న మరిది- అడ్డుపడిన శ్రుతి-gundeninda gudigantalu serial october 16th episode ravi knew father in police cell gundeninda gudigantalu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: రవిని కలిసిన మీనా- జైలు నుంచి తండ్రిని విడిపించుకుంటానన్న మరిది- అడ్డుపడిన శ్రుతి

Gundeninda Gudigantalu Today Episode: రవిని కలిసిన మీనా- జైలు నుంచి తండ్రిని విడిపించుకుంటానన్న మరిది- అడ్డుపడిన శ్రుతి

Sanjiv Kumar HT Telugu
Oct 16, 2024 09:35 AM IST

Gundeninda Gudigantalu Serial October 16th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌లో సత్యంకు టిఫిన్ తినిపించాలని బాలు ట్రై చేసిన సత్యం తినడు. మరోవైపు శ్రుతి లేదని, లేచిపోయిందని తండ్రి నీలకంఠానికి చెబుతాడు సంజు. ఇలా గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్‌లో..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో ప్రతి ఒక్కరిని పీకి రవిగాడి అడ్రస్ తెలుసుకో.. నాన్న అరెస్ట్ అయ్యారురా. నేను ఇక్కడ లేకుంటే నాన్నకు ధైర్యం చెప్పేవాళ్లు ఉండరు. అవసరం అయితే నాలుగు తగిలించి తీసుకురా అని తన ఫ్రెండ్ రాజేష్‌కు చెబుతాడు బాలు.

అంతా లోపలికి వెళ్తారు. ఏవండి మీకెందుకు అండి ఇంత పెద్ద శిక్ష. మీరు చేసిన పుణ్యం అంతా ఏమైపోయిందండి అని ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడికి వచ్చిన మీనాను ఇంకా ఏం చూస్తున్నావే పాపిష్టిదానా. ఎక్కడ ఉండాల్సిన మనిషిని ఎక్కడ పడేశావే. ఇలాంటి నిన్ను ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడే నా భర్త. నీకు కనీసం ఆ విశ్వాసం కూడా లేదా. నేను అప్పుడే తలబాదుకుని చెప్పాను. అయినా వినకుండా ఇంతదూరం తీసుకొచ్చారు అని ప్రభావతి అంటుంది.

భార్యలా శ్రుతి

ఇప్పుడు జరిగిపోయినవి ఎందుకు వదిలేయండి అని మనోజ్ అంటాడు. ఇప్పుడు మన పరిస్థితే బాగోలేదు. మీనా గురించి ఎందుకు అని రోహిణి అంటుంది. నాన్న నేను నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని బాలు వెళ్లిపోతాడు. బయట ఉన్న మీనా ఏవండి అంటుంది. ఏ ఛీ.. అవతలికి వెళ్లు. ఎన్నిసార్లు గెంటేసిన ఇక్కడ ఉంటావేంటీ అని కోపంగా వెళ్లిపోతాడు బాలు. మరోవైపు మీనా అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు రవి.

శ్రుతి వచ్చి టీ ఇస్తుంది. కానీ, అది వినిపించుకోడు రవి. తర్వాత టీ తాగుతాడు. ఏంటీ సైలెంట్‌గా తాగుతున్నావ్. బాగుందని కాంప్లిమెంటో, బాగోలేదని కంప్లైంటో ఇవ్వు అని శ్రుతి అంటుంది. బాగుందని రవి చెబుతాడు. మొహటానికి అంటున్నావా అని శ్రుతి అంటే.. లేదు మనస్ఫూర్తిగా చెబుతున్నాను అని రవి అంటాడు. దాంతో రవిని హగ్ చేసుకుని భర్త కాంప్లిమెంట్ ఇస్తే భార్య ఆనందానికి అవధులు ఉండవు తెలుసా అని శ్రుతి అంటుంది.

పెళ్లయిందన్న ఎక్జైట్‌మెంట్‌తో నేను ఏదోదో మాట్లాడుతుంటే నువ్వేంటీ బాడీ ఇక్కడ పెట్టి మైండ్ ఎక్కడో పెట్టావ్ అని శ్రుతి అంటుంది. నీకు భయంగా లేదా. పేరెంట్స్‌ను తలుచుకుంటే బాధగా లేదా. నువ్ కనిపంచడంలేదని నీకోసం వెతుకుతారు కదా అని రవి అంటాడు. కుక్క పిల్ల కనిపించకపోయినా వెతుకుతారు. మూడు రోజులు వెతికి ఎవరి పనుల్లో వారు బిజీలో ఉండిపోతారు. చాలా ఎమోషన్‌ను వారు అర్థం చేసుకుంటే ఆ పిచ్చోడిని ఇచ్చి పెళ్లి చేయరు. వాళ్లకు బిజినెస్ పార్టనర్ కావాలి అని శ్రుతి అంటుంది.

ఫస్ట్ నైట్ గురించి

కానీ, వాళ్ల పరువు పోతుంది కదా అని రవి అంటాడు. చెప్పి చూశాం అయినా వినలేదు కదా. మా నాన్నకు డబ్బు ఉంటే చాలు. పిల్లలు అవసరం లేదు అని శ్రుతి అంటాడు. మా నాన్నకు మాత్రం పిల్లలే ముఖ్యం. వాళ్లు గుర్తు వస్తున్నారు. వాళ్లకు కాల్ చేయనా అని రవి అంటాడు. తర్వాత నేనుండగా వాళ్లు గుర్తు రావడం ఏంటీ. ఇప్పుడు వాళ్లకు కాల్ చేస్తే మన లొకేషన్ తెలిసిపోతుంది. తెలిసి తెలిసి మనమే మన గురించి చెప్పినట్లు అవుతుంది. ఇప్పుడు మన ఫస్ట్ నైట్ గురించి ఆలోచించు అని శ్రుతి అంటుంది. దాంతో సరే అని వెళ్లిపోతాడు రవి.

వీడెక్కడి మొగుడండి బాబు అని శ్రుతి చిరాకు పడుతుంది. మరోవైపు సత్యంకు బాలు టిఫిన్ తీసుకెళ్తాడు. ఇది హోటల్ అనుకుంటున్నావా. ఏంటిది అని కానిస్టేబుల్ అంటాడు. అయినా బాలు తినిపించేందుకు ట్రై చేస్తుంటాడు. అయినా కానిస్టేబుల్ వద్దని వారిస్తాడు. ఆయన పొద్దున నుంచి తినలేదని, ఆకలికి ఆగలేరని ప్రభావతి అంటుంది. మా ఎస్సై గారు వస్తే తిడతారు అని కానిస్టేబుల్ అంటాడు. దాంతో హ్యూమానిటీ లేకుండా మాట్లాడతరేంటీ. ఇది అసలు కేసే కాదు అని మనోజ్ అంటాడు.

నువ్ తిను నాన్న అని బాలు అంటాడు. ఏయ్ చెబితే అర్థం కాదా అని కానిస్టేబుల్ అంటాడు. దాంతో బాలు కోపంగా చూస్తాడు. దానికి కానిస్టేబుల్ దడుసుకుంటాడు. నాకు ఈ ప్రపంచంలో మా నాన్నకన్నా ఎవరు ఎక్కువ కాదు. ఆయన్ని అవమానించిన ఇబ్బందిపెట్టినా నేను ఊరుకోను అని బాలు అంటాడు. అది కాదయ్య ఇది స్పెషల్ కేసు అని కానిస్టేబుల్ అంటాడు. ఏంటీ స్పెషల్ కేసు. ఆయన ఏమైనా దొంగతనం చేశాడా, కూని చేశాడా. ఒక వెధవని కన్నాడు. అదొక్కటే ఆయన తప్పు. దానికి తండ్రిగా ఆయన గుండె పగిలిపోయి లోపల ఎంత కుమిలిపోతున్నారో తెలుసా అని బాలు అంటాడు.

చచ్చేదాక కనిపించకు

మీ ఎస్సై గారు వస్తే నేను మాట్లాడతలే అని బాలు చెప్పడంతో కానిస్టేబుల్ ఊరుకుంటాడు. సత్యం మాత్రం తినడు. మీకు దండం పెడతాని తినండి అని ప్రభావతి అంటుంది. బాలు తినిపిస్తుంటే చేతిని పక్కకు నెట్టేస్తాడు సత్యం. మనోజ్, రోహిణి, బాలు అంతా తినమని సర్దిచెబుతారు. నాకొద్దు అని ఆవేదనగా అంటాడు సత్యం. దాంతో కన్నీళ్లు తుడుచుకుంటూ టిఫిన్ తీసుకెళ్లిపోతాడు బాలు. బయట పడేస్తాడు. మీనా అక్కడే ఉంటుంది.

ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని బాలు అంటే.. మావయ్య గారిని అని మీనా అంటుంది. హుమ్.. ఇక్కడిదాకా తీసుకొచ్చావ్. ఎప్పుడు పోలీస్ స్టేషన్‌కు రాని మా అమ్మను తీసుకొచ్చావ్. మా అమ్మ ఎప్పుడైనా ఏడవడం చూశావా. మా నాన్న మాతో మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూశావా. రక్తం సలసల కాగిపోతుంది. చచ్చేదాకా నాకు కనిపించకు అని బాలు లోపలికి వెళ్లిపోతాడు. నేను చెప్పేది వినండి అని మీనా అరుస్తుంది.

కనీసం మంచినీళ్లు అయినా తాగు నాన్న అని బాలు అంటే.. తాగను అని తల ఊపుతాడు సత్యం. చంపేయ్ నాన్న. నన్ను చంపేయ్. నిన్ను ఇలా చూస్తూ ఉండటం కన్న చావడమే బెటర్ నాన్నా. ఎద్దులా కొడుకులు ఉన్న నిన్ను బయటకు తీసుకురాలేకపోతున్నాం నాన్న. మంచినీళ్లు అయినా తాగు నాన్న అని ప్రాధేయపడతాడు బాలు. బాలు బాధ చూడలేక సత్యం నీళ్లు తాగుతాడు. అమ్మా నువ్ మౌనికి, రోహిణి ఇంటికి వెళ్లండి. రాత్రి అయింది కదా. వెళ్లి భోజనం చేయండి అని మనోజ్ అంటాడు.

కచ్చితంగా వస్తాడు

నేను ఎక్కడికి వెళ్లను. ఆయన ఇలా పస్తులుంటే నేను ఎలా తింటాను. నాకేం వద్దు అని ప్రభావతి ఏడుస్తూ చెబుతుంది. నేను కూడా వెళ్లను. అత్తయ్యతోనే ఉంటాను అని రోహిణి అంటుంది. పార్లరమ్మ వాడు ఆకలికి ఆగలేడు. మీరిద్దరు వెళ్లి తిని అమ్మకు ఏమైనా తీసుకురండి అని బాలు అంటాడు. నాకు అసలు ఆకలే లేదురా అని మనోజ్ అంటాడు. ఇదంతా రవికి తెలిస్తే కచ్చితంగా వస్తాడు. కానీ, ఈ విషయం రవికి ఎలా చెప్పాలి. పెళ్లికి వచ్చినవాళ్లలో ఎవరు తెలిసినావారున్నారు అని మీనా అనుకుంటుంది.

గుడిలో మాట్లాడిన మృదులను గుర్తు చేసుకుంటుంది మీనా. అవును, మృదులకు తెలుస్తుందేమో అని ఆమె ఇంటికి వెళ్తుంది మీనా. శ్రుతి రవి పెళ్లికి నువ్ వచ్చావ్ కదా. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో నీకు తెలుసా. నీకు తెలిస్తే చెప్పమ్మా. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శ్రుతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని మావయ్యను జైల్లో పెట్టారు. శ్రుతి రవి వచ్చి చెబితే కానీ విడిచిపెట్టరట. శ్రుతి వాళ్ల నాన్న చాలా పలుకుబడి ఉన్నతను కదా. మేము ఎవరం చెప్పిన వినట్లేదు అని మీనా అంటుంది.

శ్రుతి వాళ్లు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు అక్క. మీరు ఫోన్ చేయలేకపోయారా అని మృదుల అంటుంది. వాళ్ల ఫోన్స్ స్విచాఫ్ వస్తుంది. అందరం పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాం. ఎంత చెప్పిన వదిలిపెట్టట్లేదు అని మీనా అంటుంది. నేను కూడా ట్రై చేస్తాను. వాళ్లకు ఈ విషయం చెప్పి పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తాను అని మృదుల అంటుంది.

అడ్రస్ చెప్పిన మృదుల

ఆ పెళ్లి నేనే చేశాను అంటున్నారు. నన్ను దూరం పెట్టారు. నా భర్త దగ్గరికి రానివట్లేదు. నా కాపురం ముక్కలైపోయేలా ఉంది. రవి వచ్చి చెప్పకపోతే నా జీవితం కూడా సర్వనాశనం అయ్యేలా ఉందమ్మా. వాళ్లు ఎక్కడున్నారో తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పమ్మా అని మీనా వెళ్లిపోతుంటుంది. అప్పుడు మృదుల పిలిచి సారీ అక్క. వాళ్లు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. మీ పరిస్థితి తెలిసి కూడా చెప్పకపోతే తప్పు అవుతుంది అని మృదుల అంటుంది.

శ్రతిని పెళ్లి చేసుకునేవాడు శ్రుతి వాళ్ల నాన్న వాళ్లిద్దరిని విడదీస్తున్నారట. వాళ్లకు తెలిస్తే ప్రమాదామని శ్రుతి సీక్రెట్‌గా ఉంచమని చెప్పింది. శ్రుతి ఎక్కడుందో ఎవరికి చెప్పొద్దు అక్క అని తన ఫ్రెండ్ కీర్తి ఇంటి అడ్రస్ ఇస్తుంది మృదుల. ఎవరికి చెప్పను. నేనే వెళ్తాను అని కీర్తి ఇంటికి వెళ్తుంది మీనా. మరోవైపు తన ఫ్రెండ్‌కు నీలకంఠ సంజయ్ పెళ్లి గురించి చెబుతాడు. సంజయ్ ఫోన్ చేస్తూ చిరాకు పడటాన్ని నీలకంఠ చూస్తాడు.

సంజు అని నీలకంఠ పిలుస్తాడు. అటువైపు ఉన్న సంజు పలకడు. దాంతో చేయి వేసి పిలుస్తాడు. అప్పుడు ఎవర్రా అని చేయి తీసి ఫైర్ అవుతాడు సంజు. తండ్రిని చూసి షాక్ అయిన సంజు నాన్న నువ్వా.. సారీ సారీ అని అంటాడు. ఏమైందని నీలకంఠ అడుగుతాడు. ఏం లేదని సంజు అంటాడు. నీకు త్వరలో పెళ్లి కాబోతుంది. ఆవేశంతో ఎలాంటి పనులు చేయకు. నేను చూస్తూ ఊరుకోను అని నీలకంఠ అంటాడు. డిస్టర్ట్ చేయడానికి పెళ్లి జరిగితే కదా. పెళ్లి కూతురే లేనప్పుడు పెళ్లి ఎలా జరుగుతుంది నాన్న అని అసలు విషయం చెబుతాడు సంజు.

ఎదురుపడిన మీనా

తర్వాతి ఎపిసోడ్‌లో తల్లిదండ్రులును చూసి వస్తాను. వాళ్లు సరిగ్గా ఉన్నారో లేదో చూస్తాను అని రవి బయటకు వెళ్లబోతుంటే మీనా ఎదురవుతుంది. దాంతో జరిగింది చెబుతుంది మీనా. ఇప్పుడే మేము వస్తాం. నాన్నను విడిపించుకుంటాను అని రవి అంటాడు. ఇప్పుడు బయటకు వెళ్తే సమస్యలు మరింత పెరుగుతాయని, వద్దని చెబుతుంది శ్రుతి. మరోవైపు రవి దొరికితే నేను చేయాల్సింది చేసి మీకు అప్పగిస్తాను అని బాలు అంటాడు.

Whats_app_banner