Gundeninda Gudigantalu Today Episode: శ్రుతికి తాళి కట్టిన రవి- మీనా మెడకు చుట్టుకున్న పెళ్లి- కీడు శంకించిన బాలు-gundeninda gudigantalu serial october 8th episode ravi marriage with shruthi meena gundeninda gudigantalu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: శ్రుతికి తాళి కట్టిన రవి- మీనా మెడకు చుట్టుకున్న పెళ్లి- కీడు శంకించిన బాలు

Gundeninda Gudigantalu Today Episode: శ్రుతికి తాళి కట్టిన రవి- మీనా మెడకు చుట్టుకున్న పెళ్లి- కీడు శంకించిన బాలు

Sanjiv Kumar HT Telugu
Oct 08, 2024 11:19 AM IST

Gundeninda Gudigantalu Serial October 8th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌లో శ్రుతితో మాట్లాడేందుకు అని చెప్పి తన పెళ్లికి మీనాను తీసుకెళ్తాడు రవి. మరోవైపు సంజును మాయ చేసి తీసుకొచ్చిన శ్రుతి గిఫ్ట్ కోసం పంపిస్తుంది. ఇలా గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్‌లో..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 8వ తేది ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మీనాను రెడీ అని రవి అడుగుతాడు. హా అయ్యాను. ఇప్పటికీ రెండుసార్లు అడిగావ్. వెళ్లేది టైమ్ అడగడానికే కదా. ఏదో పెళ్లికి వెళ్తున్నట్లు కంగారుపడుతున్నావ్ అని మీనా అంటుంది. అలా ఏం లేదని రవి వెళ్లిపోతుంటే.. మీనాకు బాల్ కాల్ చేస్తాడు. అన్నయ్యకు ఏం చెబుతావని రవి అడుగుతాడు.

అమ్మాయిని కలుస్తున్నాడా

మీనా స్పీకర్ ఆన్ చేస్తుంది. ఏం చేస్తున్నావ్ పూలగంప అంటాడు బాలు. రెడీ అవుతున్నాను అని మీనా అంటుంది. ఎక్కడికీ అని బాలు అడుగుతాడు. దాంతో నోరు జారినట్లు నాలుక కరుచుకున్న మీనా.. హా మా ఆయన మలేషియాలో కోట్లు సంపాదించాడు. వాటిని తీసుకురాడానికి వెళ్తున్నాను అని సెటైర్ వేస్తుంది మీనా. తర్వాత రవిగాడిని కనిపెట్టామన్నా కదా. ఆ అమ్మాయిని కలుస్తున్నాడా. పూర్తిగా మర్చిపోయాడా అని బాలు అడుగుతాడు.

ఈరోజు నుంచి కలవడు. జోక్ చేశాను. ఆ అమ్మాయిని రవి కలవడు. ఆ పూచీ నాది అని మీనా అంటుంది. దాంతో రవి ఎమోషనల్‌గా చూస్తాడు. వాడు మంచివాడు. నాకైనా మా నాన్నకైనా వాడు ఏ ఇబ్బంది తేడు అని బాలు అంటాడు. తర్వాత ఎప్పుడు వస్తాడో అడగమని మీనా చెవిలో చెబుతాడు రవి. మీనా అడుగుతుంది. ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ అవుతాను. ఈరోజు వస్తాను అని బాలు చెబుతాడు. తర్వాత కాల్ కట్ చేసిన మీనా.. నాతో ఇన్ని అబద్ధాలు చెప్పిస్తున్నావేంటీ రవి. మీ అన్నయ్యతో నేనెప్పుడు అబద్ధం చెప్పలేదని మీనా అంటుంది.

ఇవాళ్టితో ఎవరికీ ఏ సమస్య రాదని రవి అంటాడు. రేయ్ రెస్టారెంట్‌కేనా అని ప్రభావతి అంటే.. ఇంకెక్కడికి వెళ్తాడు. ఇల్లు, రెస్టారెంట్ తప్పా వాడికేం తెలుసని సత్యం అంటాడు. ఇంకా ఎన్నాళ్లు ట్రైనింగ్‌రా. సొంతంగా రెస్టారెంట్ పెట్టుకుంటావని సత్యం అడిగితే.. లోన్ కోసం ట్రై చేస్తున్నాను అని రవి చెబుతాడు. తొందరగా పెట్టుకోరా. నీకోసం మీ అమ్మ సంబంధాలు చూస్తుందని సత్యం అంటాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోడానికే అని తెలిస్తే నాన్న ఏమైపోతాడో అని రవి అనుకుంటాడు.

దెబ్బ తగిలించుకున్న రవి

లోన్ దొరక్కపోతే బ్యాంకులో ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకో అని సత్యం అంటాడు. దానికి ఇంటి పత్రాలు ఎందుకు. మనకుంది ఒక్కటే ఇల్లు అని ప్రభావతి అంటుంది. రోహిణికి తాకట్టు పెట్టినప్పుడు మనకు పదిళ్లులు ఉన్నాయా అప్పుడు సత్యం అంటాడు. తర్వాత మీనా వస్తే పెళ్లికి రెడీ అయినట్లు అయ్యావని ప్రభావతి అంటుంది. గుడికి వెళ్తున్నానని మీనా చెబుతుంది. ఇంతలో కీస్ తీసుకుందామని రవి తలకు దెబ్బ తగిలించుకుంటాడు.

కంగారుపడిన సత్యం చూస్తాడు. రక్తం ఏం రావట్లే.. బొప్పి కట్టింది. వెళ్లేముందు దెబ్బ తగిలితే ఆ పని కాదట. కాసేపు కూర్చోని వెళ్లురా అని సత్యం అంటాడు. ఎవరి దిష్టి తగిలిందే. ఎప్పుడు లేనిది ఇవాళ బాగా రెడీ అయ్యావ్. తలకు దెబ్బ తగిలిందని ప్రభావతి ఫీల్ అవుతుంది. మీనాను డ్రాప్ చేస్తానని రవి అంటే ప్రభావతి అడ్డు చెబుతుంది. అన్నింట్లో దూరుతావ్ అని సత్యం వారిస్తాడు. దాంతో రవి, మీనా బయటకు వస్తారు. మావయ్యకు అబద్ధం చెప్పి వెళ్లడం బాలేదని మీనా అంటుంది.

శ్రుతిని కలవడానికి అని మావయ్యకు చెబుతామని మీనా అంటే.. వచ్చాక చెబుదామని రవి అంటాడు. సరేనని మీనా అంటుంది. బాలు, సత్యం మాటలు గుర్తు చేసుకుంటూ నడుస్తాడు రవి. మరోవైపు బాలు సడెన్ బ్రేక్ వేస్తాడు. ఏమైందని ప్యాసెంజర్ అడిగితే.. పిల్లి అడ్డొచ్చిందని చెబుతాడు బాలు. ఏమైంది నాకు. ఉదయం నుంచి ఏదోలా ఉంది. ఏదో కీడు శంకిస్తోంది. అయినా అడ్డొచ్చింది మా ఇంటి మహాతల్లి కాదు కదా. పిల్లేగా. ఏం కాదులే అని బాలు అనుకుంటాడు.

భయపడిన పంతులు

మరోవైపు గుడిలో పెళ్లి గురించి సుమతిని అడుగుతాడు పూజారి. ఏమైనా గొడవలు కావు కదా. పోలీసు కేసులు గట్రాలు అయినా నేను పడలేనమ్మా అని పూజారి అంటాడు. మీలాగే నేను నలిగిపోతున్నాను. కానీ, మాటిచ్చినందుకు నలిగిపోతూనే సహాయం చేస్తున్నాను అని అనుకున్న సుమతీ అలాంటిదేం ఉండదని చెబుతుంది. అమ్మేదని అడిగితే.. తనుక జ్వరం వచ్చిందని సుమతి చెబుతుంది. మరోవైపు కారులో వెళ్తుండగా ఫోన్‌లో ఎక్కువగా చూస్తుంది శ్రుతి.

నీకు ఫోన్ అడిక్షన్ ఉన్నట్లుందిగా. రేపు పెళ్లయ్యాక ఇలాగే చేస్తే.. గొయ్యి తీసి కప్పేస్తాను అని సంజు అంటాడు. ఏంటీ అని శ్రుతి అంటే.. ఫోన్‌ను అని సంజు చెబుతాడు. ఫ్రెండ్స్ వచ్చారో లేదో అని టెక్ట్స్ చెస్తున్నాను అని శ్రుతి అంటుంది. పెళ్ల నీ ఫ్రెండ్‌ది. తను చూసుకుంటుంది. నీకుంది ఫ్రెండ్షిప్ అడిక్షన్. రేపు మన శోభనం గదిలో కూడా నీ ఫ్రెండ్స్ వస్తారా అని సంజు సీరియస్ అవుతాడు. సరే అని శ్రుతి అంటే.. ఏంటీ సరే. ఏం అర్థమైంది అని సంజు అంటాడు.

నువ్ చెప్పిందే అర్థమైంది కాబట్టి సరే అన్నాను. నువ్ ఇలా అరిస్తే.. కారు దిగి నడుచుకుంటూ పెళ్లికి వెళ్తాను. నీతో అరిపించుకోవడం కంటే అది బెటర్. నేను సీరియస్‌గాన చెబుతున్నాను అని శ్రుతి అంటుంది. కానీ, సంజు ఆపడు. నేను ఒక లైన్ వరకే భరిస్తాను. లేకుంటే గన్ తీస్తాను. నేను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టే సహనంతో ఉన్నాను. నేను అరిస్తే భరించాలి అని డామినేట్ చేస్తుంటాడు సంజు. కాస్తా స్పీడ్‌గా వెళ్లమని శ్రుతి చెబుతుంది.

సంజును పంపించేసిన శ్రుతి

తర్వా ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత స్పోర్ట్స్ మోడ్‌లో పెడితే నువ్ తట్టుకోలేవని స్పీడ్‌గా వెళ్తాడు సంజు. కట్ చేస్తే గుడి దగ్గరికి చేరుకుంటారు సంజు, శ్రుతి. ఇక్కడ ఎలాంటి హడావిడి లేదని సంజు అడుగుతాడు. ఏదోటి కవర్ చేసి పెళ్లికి గిఫ్ట్ తీసుకురమ్మని సంజును పంపిస్తుంది శ్రుతి. దాంతో మంచి గిఫ్ట్ తీసుకొస్తాను అని సంజు కారులో వెళ్తాడు. సంజు వెళ్లిపోయాక.. సుమతిని శ్రుతి కలుస్తుంది. ఇతనెవరు అని సుమతి అడిగితే.. వాడితోనే నా పెళ్లి ఫిక్స్ అయిందని శ్రుతి చెబుతుంది.

తర్వాత గుడిలోకి వెళ్తారు శ్రుతి, సుమతి. పెళ్లి ఏర్పాటల్లో ఉంటారు. ఇంతలో మీనా, రవి వస్తారు. శ్రుతి గుడిలోపల ఉందని, తను చాలా మొండిగా మాట్లాడుతుందని, ముందు నేను వెళ్లి తర్వాత నిన్ను పిలుస్తాను అని నచ్చజెప్పి రవి గుడి లోపలికి వెళ్తాడు. బయట మీనా ఉంటుంది. స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లాడిలా వెనక్కి తిరిగి తిరిగి వెళ్తాడేంటీ అని మీనా అనుకుంటుంది. గుడి లోపలికి వెళ్లిన రవి పెళ్లి కూతురు గెటప్పులో శ్రుతిని చూసి ఫ్లాట్ అవుతాడు.

చూసుకుంది చాలు.. జరగాల్సింది చూడండి అని సెటైర్ వేస్తుంది సుమతీ. తర్వాత రవి డ్రెస్ మార్చుకునేందుకు వెళ్తాడు. బయట ఎదురుచూస్తున్న మీనా ఇంకా రావట్లేదేంటని, ఆ మొండిఘటం ఈ అమాయకుడిని ఎన్ని తిప్పలు పెడుతుందో అని మీనా అనుకుంటుంది. రవి పెళ్లి కొడుకు గెటప్పుతో వస్తాడు. ఇద్దరు పెళ్లిపీటలపై కూర్చుంటారు. పంతులు మంత్రాలు చదువుతుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

శ్రుతితో రవి పెళ్లి

తర్వాతి ఎపిసోడ్‌లో రవికి బాలు ఫోన్ చేస్తాడు. శ్రుతి కట్ చేయమంటే కట్ చేస్తాడు. తర్వాత మీనాకు కాల్ చేసి వాడు కాల్ కట్ చేస్తున్నాడు. వాడి ఫోన్ నుంచి కాల్ చేయమని చెబుతాడు బాలు. దాంతో గుడిలోకి వెళ్తుంది మీనా. శ్రుతికి రవి తాళి కట్టడం చూస్తుంది మీనా. శ్రుతికి రవి తాళి కడతాడు. రవి అని గట్టిగా అరుస్తుంది మీనా. నేను ఇలా బతకడం ఇష్టంలేదా. ఇదంతా నా మెడకు చుట్టుకుంటుంది అని మీనా ఆవేదనగా చెబుతుంది.

Whats_app_banner