Gundeninda Gudigantalu Today Episode: బిచ్చగాడిగా మనోజ్.. ముష్టి వేసిన బాలు.. మీనాను జోక్యం చేసుకోవద్దంటూ వార్నింగ్-gundeninda gudigantalu serial october 2nd episode balu suspects manoj gundeninda gudigantalu today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: బిచ్చగాడిగా మనోజ్.. ముష్టి వేసిన బాలు.. మీనాను జోక్యం చేసుకోవద్దంటూ వార్నింగ్

Gundeninda Gudigantalu Today Episode: బిచ్చగాడిగా మనోజ్.. ముష్టి వేసిన బాలు.. మీనాను జోక్యం చేసుకోవద్దంటూ వార్నింగ్

Sanjiv Kumar HT Telugu
Oct 02, 2024 09:06 AM IST

Gundeninda Gudigantalu Serial October 2nd Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్‌లో తండ్రి దగ్గర మూడు వందలు తీసుకుని జాబ్‌కు అని చెప్పి పార్క్‌కు వెళ్తాడు మనోజ్. అక్కడికి బాలు వస్తాడు. తన తండ్రికి ఇచ్చిన నోట్ చూసి మనోజ్ అక్కడే ఉన్నాడని అనుమానపడతాడు బాలు.

గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 2వ తేది ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అమ్మ డ్యూటీకి వెళ్తున్నా అని మనోజ్ అంటే.. డ్యూటీ వెతుక్కోడానికి వెళ్తున్నా అని చెప్పు. ఇంకా ఎన్ని రోజులురా. నీకెప్పుడు జాబ్ వస్తుందిరా అని ప్రభావతి అంటుంది.

అందరూ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారమ్మా. నాకు మధ్యలో వదిలేసిన ఎక్స్‌పీరియన్స్ తప్పా ఏం లేదు. అయినా కొన్ని కంపెనీలు చూసి పెట్టాను. కారులో వెళ్లాలి. ఒక ఐదు వందలు ఇవ్వు. ఎండగా ఉంది. ఇంటర్వ్యూకి ఫ్రెష్‌గా వెళ్లాలి అని మనోజ్ అంటాడు. నా దగ్గర డబ్బులు లేవురా. ఎంతకాలం అని రోహిణి దగ్గర నిజం దాస్తావ్. తను దొరకడం నీ అదృష్టం. నెల నెల జీతం ఏం చేస్తున్నావని తనకు డౌట్ రాదా. నా దగ్గర ఉన్న లక్ష ఎవడో దొంగ వెధవ కొట్టేశాడు అని ప్రభావతి చెబుతుంది.

కుక్కలా చూస్తున్నాడు

రోహిణికి చెప్పడానికి నా దగ్గర ఐడియా ఉంది. ఇప్పుడైతే ఐదు వందలు ఇవ్వు అని మనోజ్ అంటాడు. నాన్న పెన్షన్ డబ్బులు వచ్చినట్లు ఉన్నాయి. వెళ్లి అడుగు. నేను అయితే లక్ష ప్రశ్నలు వేస్తారు అని ప్రభావతి అంటుంది. సత్యం డబ్బులు లెక్కపెడతాడు. అవి చూసి మనోజ్ తెగ సంతోషంగా అదోలా చూస్తాడు. అది చూసిన బాలు మనోజ్‌ను పక్కకు తిప్పి నాన్న డబ్బులు బయట ఎందుకు లెక్కపెడుతున్నావ్. మటన్ షాప్ ముందు కుక్కలా ఎలా చూస్తున్నాడో చూడు అని బాలు అంటాడు.

వాడేం డబ్బు మొహం చూడనివాడు కాదని ప్రభావతి అంటుంది. దానికి 40 లక్షల మొహం, 17 లక్షల మొహం నువ్ ఎవడు చూడలేదని ఎవరైనా అన్నారా అని బాలు పంచ్ వేస్తాడు. తర్వాత బాలు నీ దగ్గర ఐదు వందలకు చిల్లర ఉందా అని సత్యం బాలును అడుగుతాడు. తర్వాత ప్రభావతిని పక్కకు తీసుకెళ్లి వెళ్లి డబ్బులు అడగమని చెబుతాడు. బాలు గాడు వెళ్లాక అడుగుదామని అనుకుంటారు. సత్యంకు చిల్లర ఇస్తాడు బాలు.

దీనిపై ఏంట్రా ఇలా రాసి ఉందని సత్యం అడుగుతాడు. ఇప్పుడు అంతా ఇలాగే రాసుకుంటున్నారు. పొరపాటున నా దగ్గరికి వచ్చింది. లేకుంటే ఇలాంటివి జాగ్రత్తగా దాచుకుంటారు. మీ కాలంలో లవ్ లెటర్స్ లాగా అని బాలు అంటాడు. నేను ఎవరికీ లవ్ లెటర్ ఇవ్వలేదురా అని సత్యం అంటాడు. ఇవ్వాల్సింది నాన్నా అనవసరంగా ఈ ఇల్లు మింగినావిడను ఇల్లాలిగా రాకుండా ఉండేదని బాలు అంటాడు. ఇప్పటికైనా ఇవ్వమనండి ఎవరొద్దన్నారు అని ప్రభావతి అంటుంది.

సిగ్గుపడిన సత్యం

పాపం నీలవేణికి పెళ్లై మనవళ్లు కూడా పుట్టారో. ఇస్తేం ఏం బాగుంటుంది అని సత్యం అంటాడు. అంటే నీలవేణి అనే ఒకత్తిని మీరు లవ్ చేశారా అని ప్రభావతి అడుగుతుంది. లవ్ అంటే.. అది అని సిగ్గుపడిన సత్యం.. ఆ నీలవేణి పట్టు పరికిణి, ఓణి వేసుకుని మా ఇంటి ముందు పట్టీలతో గలగల వెళ్లేది. మా ఇంటి కిటికీలోంచి తొంగి చూసేవాడిని అని సత్యం అంటాడు. ఓహో.. నువ్వేం తక్కోవాడివి కాదు నాన్నోయ్ అని బాలు అంటాడు.

ఊరికే అన్నారు. మీ అమ్మ ఉడుక్కోవాలని అని సత్యం అంటాడు. తర్వాత బాలు, మీనా వెళ్లిపోతారు. నాన్న అని మనోజ్ పిలిస్తే.. ఏరా నువ్ ఆఫీస్‌కు వెళ్లలేదా అని సత్యం అడుగుతాడు. రోజు వెళ్తున్నాను. పది నుంచి సాయంత్రం వస్తున్నాను. ఐదు వందలకు చిల్లర ఉందా అని మనోజ్ అడుగుతాడు. నీకు ఇంకా జీతం రాలేదా అంటే.. ఇవాళ వస్తుందని అబద్ధం చెబుతాడు మనోజ్. జీతం రాగానే ఖర్చు చేయకుండా రోహిణికి ఇవ్వు. అప్పుడే నీకు మర్యాదగా ఉంటుందని సత్యం అంటాడు.

తర్వాత మూడు వందలు ఇవ్వండి అని ప్రభావతి అంటుంది. దాంతో మనోజ్‌కు ఇస్తాడు సత్యం. ఇక వెంటనే మనోజ్ పారిపోతాడు. వీడేంటీ ఐదు వందల నోటు ఇవ్వకుండా వెళ్లాడు అని సత్యం అంటాడు. ఆ రెండు వందలు కూడా ఇచ్చి ఐదు వందలు తీసుకోండని ప్రభావతి అంటుంది. మీకు డబ్బు చూపించడమే పాపం అయిపోయింది. నీ బుద్ధులే మనోజ్‌ గాడికి వచ్చాయని సత్యం అని వెళ్లిపోతాడు. తర్వాత బాలుతో ప్రేమపై ఉపన్యాసాలు ఇస్తున్నారేంటీ అని అడుగుతుంది మీనా.

బాలు, మీనా ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. కుర్రతనంలో అందరికీ ఉన్నట్లే చిన్న చితక ప్రేమ కథలు ఉన్నాయని బాలు అంటే.. మీనా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మాత్రం గుండెలో నువ్వే ఉన్నావ్ అని బాలు అనడంతో సంతోషిస్తుంది మీనా. తర్వాత బాలు వెళ్లిపోతాడు. కారులో ప్యాసెంజర్ తన భార్యతో ఆఫీస్‌కు వెళ్లి కష్టపడుతున్నట్లు మాట్లాడుతాడు. మధ్యలో ఆఫీస్‌ వచ్చినట్లు చెప్పిన ప్యాసెంజర్ కారు దిగి లిఫ్ట్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఏడో ఫ్లోర్ వరకు మెట్లు ఎక్కాలి అని అంటాడు.

ఇలాంటి అభాగ్యులు

అయితే, అక్కడ ఏం ఉండదు. బాలు చుట్టూ చూస్తాడు. క్యాబ్‌కు మూడొందలు అయిందని చెబితే.. చిల్లర లేదని ప్యాసెంజర్ అంటాడు. ఏడో ఫ్లోర్‌లో ఎవరినైనా ఉంటే తీసుకురండి అని బాలు అంటాడు. ఏడో ఫ్లోరా నా బొంద.. ఉద్యోగం పోయి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడ్డాను. నాలాంటి అభాగ్యులు చాలామందే ఉన్నారు. ఎవరినైనా చిల్లర అడిగి తీసుకొస్తాను అని పార్క్‌లోపలికి వెళ్తాడు ప్యాసెంజర్. ప్రపంచంలో ఇలాంటి అభాగ్యులు కూడా ఉంటారా. అభాగ్యులు వీళ్ల వీరి భార్యలా అని బాలు అనుకుంటాడు.

అసలే ఉద్యోగం పోయిందని అన్నాడు. చిల్లర తీసుకొస్తాడా లేదా అని పార్క్‌లోకి వెళ్తాడు బాలు. అక్కడ అంతా జాబ్ చేస్తున్నట్లు ఫోన్‌లో భార్యలపై అరుస్తుంటారు. అది చూసి బాలు షాక్ అవుతాడు. బాలు ప్యాసెంజర్ వెళ్లి మనోజ్ దగ్గర చిల్లర అడిగి తీసుకుంటాడు. అది తీసుకెళ్లి బాలుకు ఇస్తాడు ప్యాసెంజర్. అది చూసి బాలు షాక్ అవుతాడు. ఈ నోట్ నాన్నకు ఇచ్చానే. ఆయన ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వస్తాడు. ఆ లక్షలు మింగినవాడు ఇక్కడ ఉన్నాడా ఏంటీ. అయినా వాడికి ఈ నోట్ ఇవ్వలేదే అని బాలు అవమానిస్తాడు.

పార్క్‌లో చుట్టూ చూస్తాడు. కానీ, బాలును మనోజ్ చూస్తాడు. దాంతో ఉన్న చోటు నుంచి పారిపోతాడు మనోజ్. ఓ డోరమోన్ బొమ్మ దగ్గర దాక్కుంటాడు మనోజ్. అక్కడికే వచ్చి బాలు చూస్తాడు. కానీ, కనిపించడు. బాలు అటు తిరగ్గానే మనోజ్ పారిపోతాడు. తర్వాత అడుక్కునే వాడి దగ్గరికి వెళ్లి పక్కన కూర్చుని ముసుగు కప్పి కూర్చుంటాడు. అక్కడికే బాలు వస్తాడు. పక్కన ఉన్న అతను అడుక్కుంటాడు. అతనికి బాలు డబ్బులు వేస్తాడు.

విడాకులు ఇచ్చేవరకు

మనోజ్‌ను చూసిన బాలు ఈ దొరబాబుకు అడుక్కోవడం రాదా. మొహం చూపించట్లేదు అంటే పెద్దరోగమే వచ్చి ఉంటుందని బాలు అంటాడు. దాంతో మనోజ్ తల ఊపుతాడు. బాలు బిక్షం వేసి వెళ్తాడు. తర్వాత వీడి దగ్గర అడుక్కునే గతి పట్టింది అని బాలు వేసిన చిల్లర బఠానీలకు పనికి వస్తుందని తీసుకుని వెళ్తాడు. తర్వాత బాలు ప్యాసెంజర్‌కు దగ్గరికి వెళ్తాడు మనోజ్. వాడు నా తమ్ముడు. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేవరకు ఇంట్లో గొడవ చేస్తాడు అని మనోజ్ చెబుతాడు.

ఇంట్లో జీతం ఇవ్వాలి. వడ్డీకి పదివేలు ఇవ్వమని మనోజ్ అడుగుతాడు. ఇంటి అడ్రస్, పార్క్ అడ్రస్, మీ ఆవిడ పార్లర్ అడ్రస్ అన్ని దీంట్లో రాసి ఇవ్వమని అతను చెబుతాడు. తర్వాత ఆధార్ కార్డ్ అడుగుతాడు. ఈ ఫామ్, ఆధార్ కార్డ్ పట్టుకుని నిలబడు అని బాలు ప్యాసెంజర్ అంటాడు. దొంగలకు ఫొటో తీసినట్లు ఏంటీ బ్రో అని మనోజ్ అంటాడు. రవి వార్నింగ్ ఇచ్చిన వినట్లేదని, తన అమ్మాయితో మాట్లాడుతున్నాడని సత్యంతో సురేంద్ర వార్నింగ్ ఇస్తాడు.

మీ అమ్మాయి మాట్లడటం లేదా. ముందు మీ అమ్మాయికి చెప్పమని సత్యం అంటాడు. తర్వాత ఇంట్లో బాలు, మీనాతో ఇంటికి ఏదో పెద్ద ఆపద రాబోతున్నట్లు అనిపిస్తుంది. రవి, శ్రుతి ప్రేమించుకుంటున్నారని సురేంద్ర అనుమాన పడుతున్నాడు అని సత్యం అంటాడు. మీరు ఓసారి రవితో మాట్లాడండి అని మీనా అంటుంది. ఇందులో నువ్ జోక్యం చేసుకుంటే మంచిగా ఉండదని బాలు అంటాడు.