Satyam Rajesh: ఇది పక్కింట్లో జరిగే కథ.. టెనెంట్‌పై సత్యం రాజేష్ కామెంట్స్-satyam rajesh comments on tenant movie and reveals story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Satyam Rajesh: ఇది పక్కింట్లో జరిగే కథ.. టెనెంట్‌పై సత్యం రాజేష్ కామెంట్స్

Satyam Rajesh: ఇది పక్కింట్లో జరిగే కథ.. టెనెంట్‌పై సత్యం రాజేష్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Apr 18, 2024 06:25 AM IST

Satyam Rajesh About Tenant: మా ఊరి పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు సత్యం రాజేష్. తాజాగా సత్యం రాజేష్ నటించిన సినిమా టెనెంట్. ఇప్పటికే ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను సత్యం రాజేష్ పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఇది పక్కింట్లో జరిగే కథ.. టెనెంట్‌పై సత్యం రాజేష్ కామెంట్స్
ఇది పక్కింట్లో జరిగే కథ.. టెనెంట్‌పై సత్యం రాజేష్ కామెంట్స్

Satyam Rajesh About Tenant: పొలిమేర 2తో ఊహించని సక్సెస్ అందుకున్న సత్యం రాజేష్ హీరోగా నటించిన చిత్రం టెనెంట్. వై.యుగంధర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్ నోరోన్హా, భరత్‌ కాంత్‌ కీలక పాత్రలు పోషించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాకు విశేషాలను మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సత్యం రాజేష్.

yearly horoscope entry point

టెనెంట్ ఎవరు? ఎవరు ఎవరింటికి వస్తున్నారు? ఏంటి ఈ సినిమా కథ?

ఇది ఎదురింట్లో లేదా పక్కింట్లో జరిగే కథ. భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ. ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగే స్టోరీ. అన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్పారో అది పర్‌ఫెక్ట్‌గా తీశారు. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. సినిమా థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పేలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది.

టెనెంట్‌కు ‘A’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు?

సినిమా ట్రైలర్‌లో మేడమీద నుంచి పడి చనిపోయే సీన్ ఉంది కదా.. అది సినిమాటిక్‌గా చూపిస్తే క్లీన్ సర్టిఫికెట్ వస్తుంది. కానీ, రియాలిటీకి దగ్గరగా చూపిస్తేనే ఆడియన్స్‌కు ఒరిజినల్ ఫీల్ కలుగుతుంది. ఈ సీన్‌ను రియాలిటీకి దగ్గరగా చూపించడం వల్లే ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి.

మీరు ఇలాంటి సినిమాలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు?

నేను మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు యాక్షన్, డ్యాన్స్‌లు, రొమాంటిక్, మాస్ ఎలిమెంట్స్, భారీ బడ్జెట్ లాంటి సినిమాలను ఎంచుకోను. నేను ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. ఇప్పుడు ఎవరితోనే పోటీ పడాలనే కోరిక నాకు లేదు.

ట్రైలర్‌లో ఎడిటింగ్ కట్స్ చాలా బాగున్నాయి. సినిమాలో షార్ట్సే వాడారా? ట్రైలర్ కోసం సెపరేట్‌గా కట్ చేయించారా?

ఒక్క షాట్ కూడా ట్రైలర్ కోసం అని చేయలేదు. అన్నీ సినిమాలో షార్ట్సే వాడాము. డైరెక్టర్ యుగంధర్ గారు కథ చెప్పినప్పుడే నేను హ్యాపీ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను కథ వింటూనే ఉన్నా. ఇది భలే ఉందే అని ఫీలయిన కథ ఇది.

ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలకు రైటింగ్ చాలా ముఖ్యం.. ఈ సినిమా రైటింగ్‌లో ఉన్న మ్యాజిక్ ఏంటి?

ఈ సినిమా కథను వర్మ శ్రీనివాస్ గారు రాశారు. ఆయన రైటింగ్ చాలా నేచురల్‌గా ఉంది. ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సినిమాలో నేను మాట్లాడేదే చాలా తక్కువ ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు?

స్ట్రీట్ ఫైట్ అని నేను మెయిన్ లీడ్‌లో ఒక సినిమా చేస్తున్నా. మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Whats_app_banner