Gundeninda Gudigantalu Today Episode: కుటుంబానికి దెబ్బేసిన బాలు- ప్రభావతి, రోహిణికి అవమానం- రవి శ్రుతి పెళ్లికి ప్లాన్
Gundeninda Gudigantalu Serial October 1st Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 1వ తేది ఎపిసోడ్‌లో షాపింగ్ మాల్‌లో ప్రభావతి, రోహిణి, మనోజ్ అవమానంగా ఫీల్ అవుతారు. మరోవైపు శ్రుతిని హౌజ్ అరెస్ట్ చేస్తారు సురేంద్ర, శోభన. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో
Gundeninda Gudigantalu Serial Today Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో షాపింగ్ మాల్‌లో శ్రుతి కోసం ప్రభావతి, కామాక్షి వెతుకుతుంటారు. రవి దాక్కున్న ట్రయల్ రూమ్‌లోకే శ్రుతి వెళ్తుంది. ఇంత భయపడితే పెళ్లి ఎలా చేసుకుంటావ్ అని శ్రుతి అంటుంది. పక్కనే ఉన్న ట్రయల్ రూమ్‌లోకి బాలు వెళ్తాడు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామని శ్రుతి అంటే.. కొంచెం టైమ్ ఇవ్వు అని రవి అంటాడు.
ఆ మాటలు బాలు వింటాడు. బాలు వేసుకున్న డ్రెస్ సరిగా వేసుకోలేకపోయేసరికి ట్రయల్ రూమ్‌లోకి మీనా వస్తుంది. మరోవైపు రవికి శ్రుతి ముద్దుపెడుతుంది. బాలుకు బటన్స్ పెట్టిన మీనా బాలు గుండెలపై ప్రేమగా వాలుతుంది. అప్పటివరకు బాగున్నా బాలు కంగారుపడి షర్ట్ బాగుందని బయటకు వస్తాడు. రవి, శ్రుతి బయటకు వెళ్లాలనుకుంటే బాలు, మీనా ఉండేసరికి ఆగిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక శ్రుతి, రవి బయటకు వస్తారు.
ఇంటికి వెళ్తానని
బయట సంజు ఉంటాడు. డ్రెస్ టైట్‌గా ఉందని సంజుకు చెబుతుంది శ్రుతి. చీర కట్టుకోమ్మని చెబుతాడు. కానీ, శ్రుతి వినదు. సంజు గట్టిగా చెప్పడంతో నేను వెళ్తాను అని ఇంటికి వెళ్తుంది శ్రుతి. కౌంటర్ దగ్గర మీనా చీర 12 వేలు అని కౌంటర్ అతను చెప్పడంతో బాలు పే చేస్తాడు. ఫ్రీ కూపన్స్ అంటూ ప్రభావతి వాళ్లు మనీ పే చేస్తారు. మౌనిక నువ్వేం తీసుకోలేదా అని మీనా అడుగుతుంది. అంతా వాళ్ల సంగతే చూసుకున్నారు. నాకు సాలరీ వస్తుంది కదా. అప్పుడు ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం కొనుక్కుంటా అని మౌనిక చెబుతుంది.
రెండు పట్టు చీరలు 20 వేలు, ఒక డ్రెస్ ఐదు వేలు. మొత్తం 25 వేలు అని కౌంటర్ అతను అంటాడు. దాంతో కూపన్స్ ఇస్తాడు మనోజ్. బిల్ మొత్తం 25 వేలు అంటే.. మేము ఐదు వేలు కడితే చాలు అంతేకదా అని మనోజ్ అంటాడు. లేదు సార్ మొత్తం కట్టాలని కౌంటర్ అతను అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఎందుకని అంతా అడుగుతారు. ఈ కూపన్స్ నిన్నటితోనే ఎక్స్‌పైర్ అయిపోయాయని బిల్ కౌంటర్ అతను అంటాడు.
దాంతో అంతా అవాక్కవుతారు. బాలు సంతోషపడతాడు. నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు. అది ఎలా అంటే.. తాను తీసుకుని చూసిన విషయం చెబుతాడు బాలు. దాంతో బాలుపై అంతా కోప్పడతారు. కూపన్సో.. కూపన్సో.. అని నా కొడుకు కష్టపడి తీసుకొచ్చాడు అని సొంత డబ్బా కొట్టావు కదా డబ్బావతి. ఇది నాకు తెలిసే కావాలని మీతో రెచ్చగొట్టి ఖర్చు చేయించాను. ఎలా ఉంది నా దెబ్బ డబ్బావతి అని బాలు అంటాడు. దాంతో ప్రభావతి, రోహిణి, మనోజ్ మొహాలు వాడిపోతాయి.
అవమానంగా
బిల్ కట్టురా అని బాలు అంటాడు. ఎవరు ఏం తీసుకురాలేదని చెబుతారు. ఏరా రవి అని ప్రభావతి అంటే.. కూపన్స్ వచ్చేసరికి మీ సంగతే చూసుకున్నారు. నన్ను కానీ, మౌనికను పట్టించుకున్నారా. మమ్మల్ని అడిగే అర్హత లేదని, రెస్టారెంట్‌కు వెళ్తాడు రవి. మీనాను తీసుకోమన్నారు కదా రెండు మూడు వందల చీరలు అవి తీసుకోండి అని బాలు అంటాడు. దాంతో అవమానంగా ఫీల్ అవుతారు ప్రభావతి, రోహిణి, మనోజ్.
వదినా అంటూ కామాక్షి వైపు చూస్తూ అప్పు ఇస్తావా అని అడుగుతుంది ప్రభావతి. నా దగ్గర నా చీరకు మాత్రమే తీసుకొచ్చాను. జీవితంలో వీడిని నమ్మకు. నేను నిన్ను నమ్మను అని కామాక్షి వెళ్లిపోతుంది. మొత్తం 17 వేలు ఉన్నాయి అత్తయ్య.. ఇంకా మూడు వేలు కావాలి అని రోహిణి అంటుంది. దాంతో బాలువైపు చూస్తారు. అమ్మో వీళ్లు నాతో కట్టించేలా ఉన్నారు అనుకుని వాళ్ల ముఖచిత్రం చూశాం అయిపోయింది పదా వెళ్దామని బాలు అంటాడు.
ఆపిన మీనా ఆ మూడు వేలు కట్టండి అని అంటుంది. ఏం అక్కర్లేదు. నా చీర వద్దులే అని ప్రభావతి అంటుంది. ఊరుకోండి అత్తయ్య అని మీనా అంటుంది. ఎంతైనా మా అమ్మే కదా. తన పరువు పోతే నా పరువు పోయినట్లే అని బాలు కడతాడు. ఈ మూడు వేలు రాజేష్ గాడు ఇచ్చాడు. అప్పు కింద ఇస్తున్నాను అని బాలు అంటాడు. మనతోనే వాళ్లు వస్తారని మీనా అంటే.. వాళ్లు నా డబ్బా కారులో రారు. మనోజ్ గాడు తెప్పించే పడవలాంటి కారులో వస్తారు కదా డబ్బావతి అని బాలు, మీనా వెళ్లిపోతారు.
తర్వాత ప్రభావతి వెళ్లిపోతుంది. నిన్ను నమ్మి వస్తే నన్ను, అత్తయ్యని పరువు తీస్తావా. కనీసం డేట్ ఎక్స్‌పైర్ కూడా చూసుకోవా అని మనోజ్‌ను తిడుతుంది రోహిణి. మరోవైపు షాపింగ్ అయిపోయిందని, చాలా సంతోషంగా ఉందని శ్రుతి చెబుతుంది. నేను అనుకున్నంత ముద్దపప్పు కాదు. చాలా సేఫ్‌గా చూసుకున్నాడు అని శ్రుతి చెబుతుంది. దాంతో సంతోషిస్తారు శ్రుతి తల్లిదండ్రులు. సంజు దగ్గర ఏదో మ్యాజిక్ ఉందని, అందుకే శ్రుతి మారుతుంది అని సురేంద్ర అంటాడు.
సంజు సడెన్ ఎంట్రీ
పర్స్ చూసేవాడికి, లెక్కలేకుంటే ఖర్చు పెట్టడం గురించి తెలిసి వచ్చినట్లుంది. ఆ సత్య మీద ఉంది అట్రాక్షన్ అని సురేంద్ర అంటాడు. రవితో శ్రుతి కాల్ మాట్లాడుతుంది. ఇంతలో శోభన కాఫీ తీసుకొచ్చి ఎవరని అడుగుతుంది. మీ అల్లుడు గారు. నువ్ కూడా మాట్లాడుతావా అని శ్రుతి అంటే.. వద్దని వెళ్లిపోతుంది శోభన. ఎందుకు అలా చెప్పావని రవి అడిగితే.. నువ్ కాబోయే అల్లుడువే కదా అని శ్రుతి అంటుంది.
ఇప్పటిదాకా వాళ్లు కలిసే ఉన్నారు కదా. మళ్లీ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు అని సురేంద్రతో శోభన సంతోషంగా చెబుతుంది.
ఇంతలో సంజు వస్తాడు. దాంతో శ్రుతి తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఏంటీ దెయ్యాన్ని చూసినట్లు షాక్ అవుతున్నారు. షాపింగ్ మధ్యలో వచ్చేసింది. నాకు నచ్చిన చీర కట్టుకోదట అని జరిగింది చెబుతాడు సంజు. అందుకే చీర ఇద్దామని వచ్చాను అని శ్రుతి బెడ్ రూమ్ వైపు వెళ్తాడు సంజు. దాంతో అతన్ని ఆపి శోభన వెళ్తుంది. తనకు రవితో మాట్లాడుతుందని తెలిసిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నావని శోభన అడిగితే.. సంజుతో మాట్లాడుతున్నాని శ్రుతి చెబుతుంది.
దాంతో మరి అతనెవరు అని సంజును చూపిస్తుంది శోభన. నన్నే పిచ్చిదాన్ని చేస్తావా అని శోభన అనడంతో శ్రుతి షాక్ అవుతుంది. రేయ్.. శ్రుతికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకోసారి మాట్లాడితే మా ఆయన చంపేస్తాడు అని రవికి వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తుంది శోభన. శ్రుతిని కిందకు తీసుకొస్తుంది శోభన. ఇప్పుడు ఈ చీర నచ్చకపోవచ్చు. కానీ, రేపు కట్టుకున్నాక అంతా బాగుందని చెబుతారు. నాకు ఎవరైనా ఎదురుచెబితే నచ్చదు అని చీర ఇచ్చి సంజు వెళ్తాడు. చీరను కింద పడేసి నేను అర్జంట్‌గా బయటకు వెళ్లాలి అని శ్రుతి అంటుంది.
దాంతో శ్రుతిని ఒక్కటి లాగి పెట్టి కొడుతుంది శోభన. మమ్మీ అని శ్రుతి అనేసరికి మళ్లీ ఒక్కటి కొడుతుంది. ఇది మన కళ్లు గప్పి చాలా చేస్తుంది. ఇక లాభం లేదు. దీనికి పెళ్లి అయ్యేదాక ఇంట్లోంచి కదలనిచ్చేదేలేదు అని రూమ్‌లో లాక్ చేసి హౌజ్ అరెస్ట్ చేస్తుంది. పెళ్లయ్యేదాకా ఈ గదిలోనే పడుండు అని శోభన అంటుంది. ఏంటిది అని సురేంద్ర అడిగితే.. ఇలాగే వదిలేస్తే.. ఆ సత్యం కొడుకుతో లేచిపోతుంది. నేను చెప్పేది వినండి అని సురేంద్రకు చెబుతుంది శోభన.
రెండ్రోజుల్లో పెళ్లి చేసుకుందాం
లోపల ఫోన్ కోసం వెతుకుతుంటుంది శ్రుతి. తన బ్యాగ్‌లో ఉన్న మొబైల్‌కు ఛార్జింగ్ పెడుతుంది. ఛార్జ్ అయ్యాక.. రవికి కాల్ చేసి జరిగింది చెబుతుంది శ్రుతి. ఇంకా ఆలస్యం చేయకు. రెండ్రోజుల్లో మనం పెళ్లి చేసుకోవాలి. ఏం చేయాలో నేను చెబుతాను. మనకు హెల్ప్ చేసేందుకు ఒకరు కావాలి అని ప్లాన్ చెబుతుంది శ్రుతి. మరోవైపు మనోజ్ డ్యూటికి వెళ్తున్నాను అని మనోజ్ అంటాడు. డ్యూటికి కాదు. డ్యూటి వెతుక్కోడానికి అని చెప్పు. నీకెప్పుడు జాబ్ ద1రుకుంతుదిరా అని ప్రభావతి అంటుంది.
అంతా ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. నేను మధ్యలో వదిలేశాను అని తెలిసి ఎవరు ఇవ్వడం లేదు. కానీ, కొన్ని కంపెనీలు చూసి పెట్టాను. మధ్యాహ్నం ఇంటర్వ్యూకు వెళ్లాలి. కానీ, కారులో వెళ్లాలి. డబ్బులుంటే ఇవ్వమ్మా అని మనోజ్ అడుగుతాడు.